Andhra PradeshEducationTop News

AP GRAMA / WORD VOLUNTEER APPLICATION PROCESS || HOW TO APPLY AP VOLUNTEER POST UPDATES

 

 

అన్ని జిల్లాల కలెక్టర్లు

 

నోటిఫికేషన్ ఇచ్చి సెలక్షన్ కమిటీల ద్వారా ఎంపిక చేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థల్లో 70,888 వార్డు వలంటీర్ పోస్టుల భర్తీకి ఆగస్టులో నియామక ప్రక్రియ చేపట్టారు.

 

వాటిలో 51,718 పోస్టులు భర్తీ అయ్యాయి.

ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు అందించేందుకుగాను వెంటనే మిగిలిన 19,170 పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమని భావిస్తే మున్సిపల్ కమిషనర్లను సంప్రదించి కలెక్టర్లు వలంటీర్ పోస్టులను పెంచవచ్చని కూడా పేర్కొంది. ప్రతి మున్సిపల్ కార్పొరేషన్/ మున్సిపాలిటీ కమిషనర్ అధ్యక్షతన తహశీల్దార్, మెప్మా పీవో సభ్యులుగా ఉండే నియామక కమిటీ ఇంటర్వ్యూల ద్వారా వలంటీర్లను ఎంపిక చేస్తుంది.

 

అర్హులైన అభ్యర్థులు

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వలంటీర్ పోస్టుకు కనీస విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత. నవంబరు 1, 2019 నాటికి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. కార్పోరేషన్/ మున్సిపాలిటీ యూనిట్‌గా రిజర్వేషన్ల నిబంధనల మేరకు ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఏదైనా కేటగిరీలో అర్హులైన వారు లేకపోతే జిల్లాను యూనిట్‌గా పరిగణించి ఆ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం మీద 50 శాతం పోస్టులను మహిళలకు కేటాయిస్తారు. డిసెంబర్ 1నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button