Govt Job Notifications 2023
CRPF, IAF, ORDNANCE FACTORY, SSC, BSF, INCOME TAX DEPARTMENT, UPSC, TSPSC, APPSC, JOBS NOTIFICATIONS 2023

1458 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ పాసైన వాళ్లు అర్హులు
CRPF 1458 Jobs : మొత్తం 1458 పోస్టుల్లో.. 143 పోస్టులు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ స్టెనో ర్యాంకు గల పోస్టులు. మిగిలినవి 1315 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. వివరాల్లోకెళ్తే..
ప్రధానాంశాలు:
- సీఆర్‌పీఎఫ్ రిక్రూట్‌మెంట్ 2023
- 1458 ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు
- జనవరి 4 నుంచి దరఖాస్తులు ప్రారంభం
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 1458 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 1458 పోస్టుల్లో.. 143 పోస్టులు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ స్టెనో ర్యాంకు గల పోస్టులు. మిగిలినవి 1315 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ప్రక్రియ 2023, జనవరి 4 నుంచి ప్రారంభం కానుంది. అప్లికేషన్ల సమర్పణకు గడువు జనవరి 25గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు http://crpf.gov.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం:
- అర్హత: అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: అభ్యర్థుల వయస్సు జనవరి 25, 2023 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
- వేతనాలు : అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టు వేతనాల పే లెవెల్ 5గా నిర్దేశించారు. దీని కింద వేతనం రూ. 92,300 వరకు లభిస్తుంది. హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులకు వేతనం రూ. 81,100 వరకు లభిస్తుంది.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://crpf.gov.in/
నోటిఫికేషన్
SSC GD Constable Admit Card 2022 : కానిస్టేబుల్ ఉద్యోగాల అప్లికేషన్ స్టేటస్ వచ్చేసింది.. చెక్ చేసుకోవడానికి లింక్ ఇదే
ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ (SSC GD Constable) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ పోస్టులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయి పోస్టుల భర్తీకి సంబంధించిన Application Status లింక్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) యాక్టివేట్ చేసింది. అయితే ప్రస్తుతానికి సౌత్ రీజియన్, కర్ణాటక-కేరళ రీజియన్లకు సంబంధించిన లింక్‌ను మాత్రమే అందుబాటులో ఉంచింది. త్వరలోనే రీజియన్ల వారీగా అన్ని రీజినల్ వెబ్‌సైట్లలో ఉంచనుంది. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు.
IMPORTANT LINKS
CRPF RECRUITMENT
IAF AFCAT Recruitment 2023: ఐఏఎఫ్‌లో 317 ఉద్యోగాలు… రూ.1,77,500 వరకు వేతనం
IAF AFCAT Recruitment 2023 | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఖాళీల భర్తీకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) ద్వారా అభ్యర్థులను కోర్సులకు ఎంపిక చేసి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐఏఎఫ్. ఫ్లయింగ్ బ్రాంచ్, పర్మనెంట్ కమిషన్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ద్వారా ఈ కోర్సుల్ని నిర్వహిస్తోంది. 2023 జనవరిలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హైదరాబాద్‌లోని దుండిగల్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఈ కోర్సుల్ని నిర్వహిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 317 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1న ప్రారంభం కానుంది. అదే రోజున https://afcat.cdac.in/AFCAT/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు లింక్ యాక్టివేట్ అవుతుంది. నోటిఫికేషన్ అప్‌లోడ్ అవుతుంది. అప్లై చేయడానికి డిసెంబర్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి. పూర్తి వివరాలను https://careerindianairforce.cdac.in లేదా https://afcat.cdac.in వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు.
IAF AFCAT Recruitment 2023
యంత్ర ఇండియాలో 5,395 ఉద్యోగాలు.. నో ఎగ్జాం.. నో ఇంటర్వ్యూ.. టెన్స్ పాసైతే చాలు
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్‌లోని యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లోని ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి.. 5,395 ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు ఐటీఐ, నాన్ ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్‌లోని యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లోని ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి.. 5,395 ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు ఐటీఐ, నాన్ ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోని ఆర్డ్‌నెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ- చండీగఢ్, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఇటార్సీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఖమారియా, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- కట్ని, వెహికల్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీ- కిర్కీ, మెషిన్ టూల్ ప్రొటోటైప్ ఫ్యాక్టరీ- అంబర్‌నాథ్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- అంబఝరి, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్- మెదక్ తదితర ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో ఐటీఐకు సంబంధించి 3,508, నాన్ ఐటీఐకు సంబంధించి 1887 ఖాళీలు ఉన్నాయి.
IMPORTANT LINKS
ORDNANCE FACTORY RECRUITMENT
SSC : 5369 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు

తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5369 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రధానాంశాలు:
- ఎస్‌ఎస్‌సీ జాబ్ రిక్రూట్‌మెంట్ 2023
- 5369 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
- మార్చి 27 దరఖాస్తులకు చివరితేది
SSC Recruitment 2023 : భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5369 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాల్లోకెళ్తే..
- పోస్టులు: ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్ తదితర పోస్టులున్నాయి.
- అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.
- వయసు: 18-30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
- ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/ డేటాఎంట్రీ టెస్ట్/ కంప్యూటర్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- పరీక్ష విధానం: పరీక్షలో భాగంలో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్కు ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫీజు: రూ.100.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 06, 2023
- దరఖాస్తులకు చివరి తేది: మార్చి 27, 2023
- ఆన్‌లైన్ పేమెంట్‌కు చివరి తేది: మార్చి 28, 2023
- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ : జూన్- జులై 2023.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్ :https://ssc.nic.in/
SSC RECRUITMENT
BSF : 1284 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10వ తరగతి పాసైన వాళ్లు అర్హులు
BSF Recruitment 2023 : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. తాజాగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1284 పోస్టులను భర్తీ చేయనుంది.
ప్రధానాంశాలు:
- బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2023
- 1284 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- మార్చి 27 దరఖాస్తులకు చివరితేది
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖలో భాగంగా ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1284 పోస్టులను భర్తీ చేయనుంది. వివరాల్లోకెళ్తే..
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖలో భాగంగా ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1284 పోస్టులను భర్తీ చేయనుంది. వివరాల్లోకెళ్తే..
మొత్తం ఖాళీలు: 1284
- కానిస్టేబుల్(ట్రేడ్స్‌మెన్) పోస్టులు.
- పురుషులు: 1220
- మహిళలు: 64
- విభాగాలు: కోబ్లర్, టైలర్, వాషర్‌మన్, బార్బర్, స్వీపర్, కుక్, వెయిటర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
- అర్హత: మెట్రిక్యులేషన్/ 10వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. కొన్ని ట్రేడుల్లో ఎన్‌ఎస్‌క్యూఎఫ్ లెవల్ 1 కోర్సు పూర్తి చేయాలి.
- వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
- జీతభత్యాలు: నెలకు రూ.21700-రూ.69100 చెల్లిస్తారు.
- ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- రాతపరీక్షలో భాగంగా 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించాలి. కానీ అందుకు ఎలాంటి మార్కులు ఉండవు.
- దరఖాస్తు ఫీజు: రూ.100.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుకు చివరి తేది: మార్చి 27, 2023.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://rectt.bsf.gov.in/
BSF Notification
BSF వాటర్ వింగ్ రిక్రూట్‌మెంట్ 2023 127 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయబడింది, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
BSF వాటర్ వింగ్ రిక్రూట్‌మెంట్ 2023 : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సబ్-ఇన్‌స్పెక్టర్ (SI), హెడ్ కానిస్టేబుల్ (HC)తో సహా వాటర్ వింగ్‌లోని వివిధ గ్రూప్ ‘B’ & ‘C’ పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కానిస్టేబుల్, మొదలైనవి. అర్హత గల అభ్యర్థులు BSF వాటర్ వింగ్ ఖాళీ 2023 కోసం rectt.bsf.gov.in వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. BSF వాటర్ వింగ్ రిక్రూట్‌మెంట్ 2023 కి సంబంధించిన అన్ని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
రిక్రూట్‌మెంట్ ఆర్గనైజేషన్ | సరిహద్దు భద్రతా దళం (BSF) |
పోస్ట్ పేరు | వివిధ పోస్ట్‌లు |
Advt No. | BSF వాటర్ వింగ్ రిక్రూట్‌మెంట్ 2023 |
ఖాళీలు | 127 |
జీతం/ పే స్కేల్ | పోస్ట్ వైజ్ మారుతూ ఉంటుంది |
ఉద్యోగ స్థానం | ఆల్ ఇండియా |
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ | మార్చి 27, 2023 |
దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
వర్గం | BSF రిక్రూట్‌మెంట్ 2023 |
అధికారిక వెబ్‌సైట్ | rectt.bsf.gov.in |
టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరండి |
దరఖాస్తు రుసుము
వర్గం | ఫీజులు |
---|---|
Gen/ OBC/ EWS (Gropu-B) | రూ. 200/- |
Gen/ OBC/ EWS (Gropu-C) | రూ. 100/- |
SC/ ST/ ESM | రూ. 0/- |
చెల్లింపు మోడ్ | ఆన్‌లైన్ |
ముఖ్యమైన తేదీలు
ఈవెంట్ | తేదీ |
---|---|
ప్రారంభం దరఖాస్తు | ఫిబ్రవరి 26, 2023 |
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ | మార్చి 27, 2023 |
పరీక్ష తేదీ | తర్వాత తెలియజేయండి |
పోస్ట్ వివరాలు, అర్హత & అర్హత
వయో పరిమితి : ఈ రిక్రూట్‌మెంట్‌కు వయోపరిమితి SI (మాస్టర్, ఇంజిన్ డ్రైవర్)కి 22-28 సంవత్సరాలు , మిగిలిన అన్ని పోస్టులకు వయోపరిమితి 20-25 సంవత్సరాలు. వయస్సును లెక్కించడానికి ముఖ్యమైన తేదీ దరఖాస్తు ఫారమ్ యొక్క చివరి తేదీ. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.
పోస్ట్ పేరు | ఖాళీ | అర్హత |
---|---|---|
SI (మాస్టర్) | 5 | 12వ ఉత్తీర్ణత + మాస్టర్ సర్టిఫికేట్ |
SI (ఇంజిన్ డ్రైవర్) | 5 | 12వ ఉత్తీర్ణత + ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్ |
SI (వర్క్‌షాప్) | 2 | మెక్./ మెరైన్/ ఆటో మొబైల్‌లో డిగ్రీ/ డిప్లొమా |
HC (మాస్టర్) | 39 | 10వ పాస్ + సెరాంగ్ సర్టిఫికెట్ |
HC (ఇంజిన్ డ్రైవర్) | 56 | 10th పాస్ + ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్ |
HC (వర్క్‌షాప్)- మెషినిస్ట్ | 4 | 10వ తరగతి ఉత్తీర్ణత + సంబంధిత విభాగంలో ఐటీఐ |
HC (వర్క్‌షాప్)- మెకానిక్ | 1 | 10వ తరగతి ఉత్తీర్ణత + సంబంధిత విభాగంలో ఐటీఐ |
కానిస్టేబుల్ (సిబ్బంది) | 15 | 10వ పాస్ + 1 సంవత్సరం ఎక్స్‌ప్రెస్. + ఈత |
BSF WATER WING RECRUITMENT
ముఖ్యాంశాలు:-
ఆదాయపు పన్ను విభాగంలో కొత్త ఇన్స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ
కేవలం టెన్త్ అర్హతతో అప్లై చేసుకుంటే పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్ వస్తుది.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు
కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
అర్హులు అయితే అప్లై చేయండి కన్ఫామ్ గా జాబ్ వస్తుంది.
కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ
ఇన్‌కమ్ ట్యాక్స్, కర్ణాటక మరియు గోవా రీజియన్ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్, టాక్స్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌గా నియామకం కోసం ప్రతిభావంతులైన క్రీడాకారుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేయడానికి ముందు, దరఖాస్తుదారులు పోస్ట్ కోసం వారి అర్హతను నిర్ధారించడానికి వివరణాత్మక మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలు, ఖాళీ స్థానం, ఇతర షరతులు మరియు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం క్రింద ఇవ్వబడిన సూచనల ద్వారా వెళ్లాలి. రిక్రూట్‌మెంట్ యొక్క అన్ని దశలకు వారి ప్రవేశం ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
INCOME TAX RECRUITMENT