Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Dharani Telangana || Dharani Portal 2023 || View Telangana Land Records ditails

ధరణితోనే భధ్రం || Dharani Telangana

 

 

ధరణితోనే భధ్రం

 

 

 

 

 

ధరణితోనే భధ్రం

 

ఉదయాన్నే ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దళారులను బతిమిలాడాల్సిన అవసరం లేదు. పేపర్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన ముచ్చటే లేదు. మధ్యవర్తులు లేరు. పట్వారీ, గిర్దావర్‌ ప్రమేయం లేదు.

 

 

  • రైతన్నల భూ లావాదేవీల బాధలు తీర్చిన వెబ్‌ పోర్టల్‌
  • గతంలో రిజిస్ట్రేషన్‌ కావాలంటే వారం సమయం పట్టేది..
  • పాస్‌ పుస్తకం రావాలంటే మూడు వారాలు..
  • అధికారులు ఆలస్యం చేస్తే ఐదారు నెలలు..
  • ప్రస్తుతం పదిహేను నిమిషాల్లోనే పట్టా..
  • కొనుగోలుదారుల్లో పెరిగిన నమ్మకం..
  • సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు
  • పారదర్శకంగా, సులువుగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌

 

 

దేశంలో మొదటిసారి రెవెన్యూ రికార్డులలో ఐటీ ఇంటర్వెన్షన్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నది టీ(బీ)ఆర్‌ఎస్‌ ప్రభుత్వమని గర్వంగా తెలియజేస్తున్నా. ఈ విధానం గ్యారెంటీగా సూపర్‌హిట్‌ అయితది. దేశమంతటా విప్లవం లేపుతది. కేంద్రం మీద, ఇతర రాష్ర్టాల ప్రభుత్వాల మీద విపరీతమైన ఒత్తిడి కూడా వస్తది.

 

 

 

ఉదయాన్నే ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దళారులను బతిమిలాడాల్సిన అవసరం లేదు. పేపర్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన ముచ్చటే లేదు. మధ్యవర్తులు లేరు. పట్వారీ, గిర్దావర్‌ ప్రమేయం లేదు. డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌లను ప్రసన్నం చేసుకోవాల్సిన పనిలేదు. అసలు లంచమనే మాటేలేదు. ఏం తెలియని వాళ్లు కూడా ఆఫీసుకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధంగా ధరణి వెబ్‌ పోర్టల్‌ రూపకల్పన చేయబడింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో విప్లవాత్మక మార్పని చెప్పవచ్చు. సీఎం కేసీఆర్‌ ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న అద్భుతమైన పథకం. భూ పరిపాలనలో కొత్త శకంగా చెప్పవచ్చు. గతంలో రిజిస్ట్రేషన్‌ కావాలంటే వారం, పాసు పుస్తకం కావాలంటే మూడు వారాలు, అధికారులు ఆలస్యం చేస్తే ఐదారు నెలలు పట్టేది. ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పారదర్శకంగా, సులువుగా, ఇబ్బంది లేకుండా అవుతున్నాయి. పావుగంటలోనే పట్టాలు అవుతుండడంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సమీకృత భూముల రికార్డుల నిర్వహణ వ్యవస్థ ధరణి పోర్టల్‌ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని, భూలావాదేవీల విషయంలో అద్భుతాలు సృష్టించిందని చెప్పవచ్చు.

ధరణి పోర్టల్‌ రాకముందు ఏ ఊరికెళ్లినా.. ఎవరిని కదిలించినా భూ తగాదాలే. రైతుల భూమి రికార్డులు పట్వారీలు, వీఆర్‌ఏలు, వీఆర్‌వోలు, తహసీల్లార్ల ఇండ్లలో ఉండేవి. అధికారులు ఎవరికి కోపం వచ్చినా రికార్డుల్లోని భూమి వేరే వారి పేరిట మారేది. ఇష్టారాజ్యంగా పట్టాదారులను మార్చే దుస్థితి. అది కాకపోతే ఉన్న ఫలంగా ప్రభుత్వ భూమిగానో.. కాలువ వెళ్లే భూమిగానో మారిపోయేది. అధికారి రాసిందే రికార్డు.. భూమి తన పేరుపై నుంచి మారిందని ఆ రైతుకు తెలిసి మార్చుకుందామంటే అప్పటికే ఏండ్లు గడిచిపోయేవి. కార్యాలయాల చుట్టూ తిరిగి.. తృణమో.. ప్రణమో.. సమర్పించుకుంటే కానీ పనయ్యేది కాదు. ఇది గతంలో కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో ఉన్న దుస్థితి. కానీ తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చాక కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్‌లో సెర్చ్‌ చేస్తే చాలు. రైతు పేరు మీద ఎంత భూమి ఉందనే రికార్డులన్నీ కనిపిస్తున్నాయి. ఏ సర్వే నంబరులో ఎంత భూమి ఉంది, అది ఎవరి పేరిట ఉందనే వివరాలు చూపిస్తున్నాయి.

రికార్డు మారాలంటే అమ్మకందారు, కొనుగోలుదారు ఉండాల్సిందే. అధికారులు ఇష్టారాజ్యంగా చేసేందుకు వీలులేని పారదర్శక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఎక్కడా ఎవరికి పైసా ఇవ్వకుండా భూమిని అమ్ముకునే, కొనుగోలు చేసుకునే రోజులు వచ్చాయి. ఇది ధరణితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన మార్పు. కానీ.. రైతులు ఆనందంగా ఉంటే చూడలేని కాంగ్రెసోళ్లు, బీజేపీ వాళ్లు ధరణిపై అనవసర ఆరోపణలు చేస్తూ.. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను తీసేస్తామంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పారదర్శకంగా, కచ్చితత్వంతో పనిచేసే వ్యవస్థను రద్దు చేసి, పాత కాలం పద్ధతులనే మళ్లీ తీసుకురావాలని చూస్తున్నారు. అదే జరిగితే రైతులకు మళ్లీ కష్టాలు తప్పవని, రైతు బాంధవుడు కేసీఆర్‌ తీసుకొచ్చిన ధరణితో తమ బాధలు తప్పాయని, కార్యాలయానికి వెళ్లిన నిమిషాల్లోనే పనైపోతున్నదని రైతులు అంటున్నారు. ధరణిని ఇలాగే కొనసాగించాలని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

నెలల తరబడి తిప్పలు..
ధరణి రాకముందు భూమి విక్రయించాలంటే పట్టాదారు పాసు బుక్కులు తీసుకొని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లాలి. అక్కడ డాక్యుమెంట్‌ రైటర్లు అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసి, రిజిస్ట్రార్‌ దగ్గరకు వెళ్లే సరికి వారం పట్టేది. అలా వారం రోజులకు రిజిస్ట్రేషన్‌ అయ్యాక డాక్యుమెంట్‌ ఇవ్వడానికి మరోవారం తిప్పించుకునేటోళ్లు. రిజిస్ట్రేషన్‌ అయ్యాక అది పట్టుకొని మ్యూటేషన్‌(రికార్డులో పేరు మార్చుకునేందుకు) కోసం రెవెన్యూ ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ ఆధారంగా నోటీసులు సర్వ్‌ చేసి, అభ్యంతరాల స్వీకరణకు 15 రోజులు సమయం పట్టేది. ఆ లోపు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే మ్యూటేషన్‌ పూర్తయి పట్టా పాసుబుక్‌ చేతికి రావడానికి మరో వారం సమయం పట్టేది. ఎంత త్వరగా చేసినా నెల నుంచి నెలన్నర రోజులు కార్యాలయాల చుట్టూ తిరగడానికే సరిపోయేది. అధికారులు ఆలస్యం చేస్తే ఐదారు నెలలు అదే పని మీద ఉండాల్సిన పరిస్థితి.

నిమిషాల్లో పనులు..
ధరణి పోర్టల్‌ వచ్చాక అగ్రికల్చర్‌ భూముల రిజిస్ట్రేషన్‌ను తహసీల్దార్‌లకు అప్పగించారు. పోర్టర్‌లో టైటిల్‌ క్లియర్‌గా ఉంటే చాలు స్లాట్‌ బుక్‌ చేసుకొని, ఇచ్చిన సమయానికి తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్తే నిమిషాల్లోనే పని అయిపోతుంది. ఒకేసారి రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యూటేషన్‌ పూర్తయి పట్టాదారు పాసు పుస్తకం మీద ఎంత కొన్నది.. ఎంత అమ్ముకున్నది వివరాలు వచ్చేస్తాయి. రైతు ఫలానా సర్వే నంబర్‌లో ఎన్ని ఎకరాలు అమ్మితే అన్ని ఎకరాలు సదరు రైతు పాస్‌బుక్‌ నుంచి కట్‌ అయిపోయి, కొనుగోలు చేసిన రైతు పాస్‌బుక్‌లో యాడ్‌ అవుతాయి. అంటే గతంలో 30 రోజులు పట్టిన పని ఇప్పుడు ముప్పై నిమిషాల్లో అయిపోతుంది. కొనుగోలుదారు, అమ్మకందారుతోపాటు ఇద్దరు సాక్షులు ఉంటే చాలు రిజిస్ట్రేషనైనా, నాలా కన్వర్షన్‌ అయినా నిమిషాల్లో పని.

ఒక్క రోజులో నాలా కన్వర్షన్‌
నా భార్య, నా పేరిట రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. దాన్ని నాన్‌ అగ్రికల్చర్‌లోకి మార్చుకోడానికి ఈ రోజు (శనివారం) ఉదయం ఎంఆర్‌వో ఆఫీసుకు వచ్చా. రూ.2.80 లక్షలు కడితే కన్వర్షన్‌ అయిపోతుందన్నారు. వెంటనే బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు కట్టేశా. సాయంత్రం రమ్మని స్లాట్‌ ఇచ్చారు. వచ్చిన వెంటనే ఇద్దరి పేరిట ఉన్న భూమిని కన్వర్ట్‌ చేసి ఇచ్చారు. ఇంత వేగంగా పని అయిపోతుంద నుకోలేదు. నా వరకైతే ధరిణి పోర్టల్‌ రెవెన్యూ వ్యవస్థ లో వచ్చిన విప్లవం. ఎవరికీ రూపాయి ఇవ్వకుండా న్యాయబద్ధంగా, చట్టప్రకారం నేను కట్టాల్సినంత కట్టగానే కన్వర్షన్‌ అయిపోవడం ఆనందంగా ఉంది.
– జునుబాల తిరుపతయ్య.

అమ్మిన వెంటనే మెస్సేజ్‌ వచ్చింది..
నాకున్న ఎకరం భూమిని విక్రయిం చా. ఈ రోజు రిజిస్ట్రేషన్‌ ఉం టుందంటే వచ్చా. ఫొటోలు, సంతకాలు తీసుకున్న నిమిషా ల్లో రిజిస్ట్రేషన్‌ అయిపోయిం దన్నారు. నా పాస్‌బుక్‌లో ఎకరం అమ్మినట్లు నమోదు చేశారు. కొన్న వ్యక్తికి కొత్త పాస్‌బుక్‌ పంపిస్తామని చెప్పారు. కార్యాలయం నుంచి బయటికి రాగానే నా భూమి బదలాయింపు అయినట్లు ఫోన్‌కు మెస్సేజ్‌ కూడా వచ్చిందని మా అబ్బాయి చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఇంత తొందరగా పని అయ్యేది కాదు. చాలా తొందరగా పనైపోయింది.
– బండారి కొమురయ్య, భూమి విక్రయదారు.

ఎవరికీ పైసా ఇవ్వద్దు..
ధరణి పోర్టల్‌ వచ్చాక నిమిషాల్లో పనైపోతున్నది. టైటిల్‌ క్లియర్‌గా ఉంటే చాలు రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ నిమిషాల్లో చేసేస్తున్నాం. పట్టా పాస్‌బుక్‌ పాతది ఉంటే దాని మీదే కొనుగోలు చేసిన భూమి వివరాలు యాడ్‌ చేసి, అమ్ముకున్న వారికైతే డిలేట్‌ చేసి ఇస్తున్నాం. అత్యంత పారదర్శకంగా పని చేస్తున్నా. మా కార్యాలయంలో ఎవరికీ పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్ని సరిగా ఉంటే నిమిషాల్లో పని పూర్తవుతుంది.
– రాజేశ్వర్‌, ఎంఆర్‌వో, మంచిర్యాల.

పాత పద్ధతి వద్దు.. ధరణియే ముద్దు..
నేను మంచిర్యాల శివారులోని రంగపేటలో బంధువుల వద్ద ఎకరం వ్యవసాయ భూమి కొన్నా. ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ కోసమని శుక్రవారం ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చా. ఆన్‌లైన్‌లో డీడీ తీయమన్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు స్లాట్‌ ఇచ్చారు. అమ్మిన వ్యక్తివి, నా ఫొటోలు తీసుకున్నారు. ఫింగర్‌ ప్రింట్‌, ఐరీస్‌ నమోదు చేశారు. సాక్షులు సంతకం పెట్టగానే ఎమ్మార్వో రాజేశ్వర్‌ సార్‌ వచ్చి అప్రూవ్‌ చేశారు. కేవలం 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసి, టైటిల్‌ ఇచ్చారు. పాస్‌బుక్‌ ఇంటికే వస్తుందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం కూడా నేను ల్యాండ్‌ కొన్నా. అప్పుడు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, పాస్‌బుక్‌ రావడానికి రెండు నెలలు పట్టింది. ఇప్పుడు నిమిషాల్లో అయిపోయింది. ధరణితోనే సాధ్యమైంది. ఇంకా పాతకాలం తరహా వ్యవస్థ ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button