Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

DSC and TET Notification 2024

డీఎస్సీ, టెట్‌-2024 నోటిఫికేషన్‌.. ద‌ర‌ఖాస్తుల ప్రారంభం కూడా.. మార్గదర్శకాలు జారీ..!

 

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు మ‌రో శుభ‌వార్త చెప్ప‌నున్న‌ది. ఇటీవ‌లే ప్ర‌భుత్వం గ్రూప్‌-1,2తో పాటు వివిధ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే.

ఇప్పుడు తాజాగా ఫ్రిబ్ర‌వ‌రి 1వ తేదీన డీఎస్సీ, టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.  ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 2022, 2023 కాలంలో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

నిజానికి.. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. అప్పుడు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్‌కు హాజరుకావొచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్‌ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.. ఒకట్రెండు రోజుల్లో పూర్తి వివరాలతో టెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

‘టెట్‌’ నిబంధనల సడలింపు ఇలా..

ఇక టెట్‌ నిర్వహణకు ఏర్పాట్లుచేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్‌ పేపర్‌–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరన్న నిబంధన ఉండేది. దాన్ని సవరించి ఏపీ టెట్‌–2024 నోటిఫికేషన్‌కు ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్‌లో 50 మార్కులు తప్పనిసరి చేసింది. దీనివల్ల ఎక్కువమంది అభ్యర్థులు టెట్‌ రాసేందుకు అవకాశముంటుంది.

 

 

ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్‌ పేపర్‌–1 రాసే అభ్యర్థులు ఇంటర్మిడియట్‌లో 50 శాతం మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్‌/సీనియర్‌ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ డిగ్రీ ఉండాలి.

 

దీంతో పాటు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్‌తో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తిచేయాలి లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ చేసిన వారు టెట్‌ పేపర్‌–1 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. అయితే.. ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఐదు శాతం మార్కుల సడలింపునిచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.

 

 

 

 

Related Articles

Back to top button