Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Teaching Jobs in nvs 2022

Teaching Jobs 2022 నవోదయ విద్యాలయాల్లో 1,616 పోస్ట్‌లు.. అర్హతలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్‌ ఇలా..

 

 

 

 

ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వారికి.. తీపి కబురు. బీఈడీ పూర్తి చేసి.. ప్రభుత్వ ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి చక్కటి అవకాశం. ఆకర్షణీయ వేతనాలతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడేందుకు మార్గం… కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు చెందిన జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి నియామక ప్రకటన!! దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో.. ప్రిన్సిపల్స్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ), మ్యూజిక్, ఇతర విభాగాల్లో.. 1,616 పోస్ట్‌ల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నవోదయ విద్యాలయాల్లో ఉద్యోగాలు, అర్హతలు, ఎంపిక విధానం తదితర సమాచారం…

 

 

  • నవోదయ విద్యాలయ సమితిలో టీచింగ్‌ పోస్ట్‌లు
  • పలు కేటగిరీల్లో 1,616 పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం
  • ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ కొలువులు

 

జవహర్‌ నవోదయ విద్యాలయాలు.. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నెలకొన్న పాఠశాలలు. వీటిలో ఉద్యోగం లభించిందంటే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వేతనాలు, కెరీర్‌ ఉన్నతి సొంతమవుతుంది. బీఈడీ ఉత్తీర్ణులు జవహర్‌ నవోదయ పాఠశాలల్లో కొలువుల భర్తీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పటికే.. రాష్ట్ర స్థాయిలో టెట్, డీఎస్సీ వంటి పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారు.. అదే ప్రిపరేషన్‌తో వీటికి పోటీ పడే అవకాశం ఉంది.

 

 

టీజీటీ టు ప్రిన్సిపల్‌

  • ప్రిన్సిపల్‌(గ్రూప్‌–ఎ)–12 పోస్ట్‌లు
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(గ్రూప్‌–బి)–397
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(గ్రూప్‌–బి)–683
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌–థర్డ్‌ లాంగ్వేజ్‌(గ్రూప్‌–బి) – 343
  • ఇతర టీచింగ్‌ పోస్ట్‌లు (మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ– మేల్, పీఈటీ–ఫిమేల్, లైబ్రేరియన్‌)–181పోస్ట్‌లు.

 

అర్హతలు

  • ప్రిన్సిపల్‌: కనీసం యాభై శాతం మార్కులతో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి. బీఈడీ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. ఈ పోస్ట్‌కు సంబంధించి పని అనుభవాన్ని కూడా అర్హత ప్రమాణంగా పేర్కొన్నారు. వయసు 50ఏళ్ల లోపు ఉండాలి.
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ ఉండాలి. హిందీ, ఇంగ్లిష్‌ మీడియంలో బోధన నైపుణ్యం, అనుభవం ఉండాలి. వయసు 40ఏళ్ల లోపు ఉండాలి.

 

  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ): కనీసం 50శాతం మార్కులతో నాలుగేళ్ల ఇంటిగ్రేటె డ్‌ బీఈడీ ఉత్తీర్ణత సాధించాలి.లేదా డిగ్రీతోపాటు బీఈడీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.వయసు 35ఏళ్ల లోపు ఉండాలి.
  • ఇతర కేటగిరీ పోస్టులకు గ్రాడ్యుయేషన్, డిప్లొమా(లైబ్రరీ సైన్స్‌), బీపీఈడీ, డిప్లొమా(ఫైన్‌ ఆర్ట్స్‌), బ్యాచిలర్‌ డిగ్రీ(మ్యూజిక్‌)లో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 35ఏళ్లలోపు ఉండాలి.

 

రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ

నవోదయ విద్యాలయ పోస్టులకు ఎంపిక ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలుత కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత నిర్దిష్ట కటాఫ్‌ మార్కులను పేర్కొని.. దానికి అనుగుణంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో నిలిచిన వారికి పర్సనల్‌ ఇంటరాక్షన్‌ నిర్వహిస్తారు. లైబ్రేరియన్‌ పోస్ట్‌లను మాత్రం కేవలం రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగానే భర్తీ చేస్తారు.

 

 

నవోదయ విద్యాలయ సమితి, నోయిడాలో 1616 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

వేర్వేరు విభాగాల్లో రాత పరీక్షలు

 

ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, థర్డ్‌ లాంగ్వేజ్‌ టీజీటీ, ఇతర టీచింగ్‌ పోస్ట్‌లను భర్తీ చేయనున్న క్రమంలో.. ఆయా పోస్ట్‌లను అనుసరించి.. రాత పరీక్షను వేర్వేరు విధానాల్లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పోస్ట్‌ల వారీగా రాతపరీక్ష తీరుతెన్నుల వివరాలు..

ప్రిన్సిపల్స్‌

విభాగంసబ్జెక్ట్‌ప్ర.మా.
పార్ట్‌–1రీజనింగ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ1010
పార్ట్‌–2జనరల్‌ అవేర్‌నెస్‌2020
పార్ట్‌–3లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ హిందీ)2020
పార్ట్‌–4అకడమిక్, రెసిడెన్షియల్‌ అంశాలు5050
పార్ట్‌–5అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్‌5050
మొత్తం150150

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు

ఆరు విభాగాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. వివరాలు..

విభాగంసబ్జెక్ట్‌ప్ర.మా.
పార్ట్‌–1జనరల్‌ అవేర్‌నెస్‌1010
పార్ట్‌–2రీజనింగ్‌ ఎబిలిటీ2020
పార్ట్‌–3ఐసీటీ నాలెడ్జ్‌1010
పార్ట్‌–4టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌1010
పార్ట్‌–5సంబంధిత సబ్జెక్ట్‌8080
పార్ట్‌–6లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ (జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ హిందీ)2020

 

  • పార్ట్‌–6లో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే మిగతా విభాగాల సమాధానాలను మూల్యాంకన చేస్తారు.

ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్, ఇతర టీచింగ్‌ పోస్ట్‌లు

ఈ పోస్ట్‌లకు కూడా ఆరు విభాగాలుగా పరీక్ష నిర్వహిస్తారు. వివరాలు..

విభాగంసబ్జెక్ట్‌ప్ర.మా.
పార్ట్‌–1జనరల్‌ అవేర్‌నెస్‌1010
పార్ట్‌–2రీజనింగ్‌ ఎబిలిటీ1010
పార్ట్‌–3ఐసీటీ నాలెడ్జ్‌1010
పార్ట్‌–4టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌1010
పార్ట్‌–5సంబంధిత సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌8080
పార్ట్‌–6లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ (జనరల్‌ హిందీ, ఇంగ్లిష్, ఎంచుకున్న రీజనల్‌ లాంగ్వేజ్‌)3030
  • పార్ట్‌–6 కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. అప్పుడే మిగతా విభాగాల మూల్యాంకన చేస్తారు
  • అన్ని పేపర్లకు.. కేటాయించిన సమయం మూడు గంటలు.

తుది దశలో పర్సనల్‌ ఇంటర్వ్యూ

అన్ని పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షలో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు నిర్దేశిస్తారు. దానికి అనుగుణంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఆ తర్వాత పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి 1:5 లేదా 1:6 నిష్పత్తిలో చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూల్లో అభ్యర్థులకున్న సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తోపాటు టీచింగ్‌ దృక్పథం, బోధన వృత్తిపై ఆసక్తి, అనుభవం వంటి అంశాలను పరిశీలిస్తారు.

 

 

టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!

 

 

ప్రిపరేషన్‌ ఇలా 
సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ + సమకాలీనం

ఆయా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పరీక్షలో విజయానికి సబ్జెక్ట్‌ నాలెడ్జ్, విద్యా దృక్పథాలు, పెడగాజీ, చైల్డ్‌ డెవలప్‌మెంట్, శిశు వికాసం వంటి అంశాలపై దృష్టిపెట్టాలి. పెడగాజికి సంబంధించి సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం–నాయకత్వం–గైడెన్స్‌–కౌన్సెలింగ్‌ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. పెడగాజిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తేనే ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.

 

 

రీజనింగ్‌ ఎబిలిటీ

ఈ విభాగానికి సంబంధించి.. వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. నెంబర్‌ సిరీస్, అనాలజీస్, బ్లడ్‌ రిలేషన్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, ఆడ్‌ మన్‌ ఔట్‌ వంటి అంశాలతోపాటు టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, టైమ్‌ అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ తదితర అంశాలపై పట్టు సాధించాలి.

 

టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగానికి సంబంధించి విద్యా దృక్పథాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పెడగాజీ, చైల్డ్‌ సైకాలజీ, కరిక్యులమ్‌ ఆర్గనైజేషన్, లెసన్‌ ప్లాన్, ఇన్‌స్ట్రక్షనల్‌ మెటీరియల్స్‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

 

లాంగ్వేజ్‌

లాంగ్వేజ్‌ విభాగాలకు సంబంధించి అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో.. అదే విధంగా జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ హిందీలకు సంబంధించి.. వ్యాకరణ అంశాలు,బోధనపద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. స్కూల్‌ స్థాయిలో సబ్జెక్ట్‌ పుస్తకాలతోపాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, ఆర్టికల్స్, డెరైక్ట్‌ అండ్‌ ఇన్‌ డెరైక్ట్‌ స్పీచ్, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.

 

ఐసీటీ

ఈ విభాగానికి సంబంధించి బోధన విధానంలో అందుబాటులోకి వస్తున్న ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ) టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఆడియో వీడియో లెక్చర్‌ మెటీరియల్స్,వాటి వినియోగం, కంప్యూటర్స్‌ వినియోగం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

TET Model papers

జేఎన్‌వీ.. 2022–23 ముఖ్యాంశాలు

  • ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, థర్డ్‌ లాంగ్వేజ్‌ టీజీటీ, ఇతర విభాగాల్లో 1,616 టీచర్‌ పోస్ట్‌లు.
  • ఆయా పోస్ట్‌లకు సంబంధించి 150 మార్కులతో రాత పరీక్ష.
  • రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూ.
  • ఇంటర్వ్యూలోనూ విజయం సాధిస్తే పే లెవల్‌–7,8లతో నియామకం ఖరారు.
  • గరిష్ట వయో పరిమితి విషయంలో రిజర్వ్‌డ్‌ కేటగిరీ వర్గాల వారికి నిబంధనల మేరకు సడలింపు కల్పిస్తారు.
  • అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూలై 22, 2022
  • ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహణ: అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం
  • వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/

 

 

15,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీ… ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

Teacher Jobs | కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లో (Kendriya Vidyala Schools) 12,044 ఖాళీలు, నవోదయ విద్యాలయాల్లో 3,156 ఖాళీలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా నడిపే స్కూళ్లల్లో 15,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ, ఏపీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోండి.

 

1. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) స్కూళ్లు, నవోదయ విద్యాలయ పాఠశాలల్లో మొత్తం 15,000 పైగా టీచర్ పోస్టులు (Teacher Jobs) ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రీయ విద్యాలయాల్లో 12,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే, నవోదయ విద్యాలయాల్లో 3,000 పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి.

 

2. భారతదేశంలో మొత్తం 1,247 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయాల్లో 2019లో 5,562 ఖాళీలు ఉంటే, 2020 నాటికి ఖాళీల సంఖ్య పెరిగి 8,055 కి చేరుకుంది. 2021లో ఈ ఖాళీల సంఖ్య 10,452 కి చేరగా, ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం 12,044 ఖాళీలు ఉన్నాయి. అంటే 2019 నుంచి ఖాళీల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేంద్రీయ విద్యాలయాల్లో 12,044 టీచింగ్ పోస్టులు, 1,332 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

3. కేంద్ర విద్యా శాఖ వివరాల ప్రకారం కేంద్రీయ విద్యాలయాల్లో 9,161 మంది టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేశారు. 2021 లెక్కల ప్రకారం కేంద్రీయ విద్యాలయాల్లో ఎక్కువగా తమిళనాడులో 1,162 ఖాళీలు ఉన్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో 1,066 ఖాళీలు, కర్నాటకలో 1,006 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 641 ఖాళీలు, తెలంగాణలో 547 పోస్టులున్నాయి.

 

4. ఇక నవోదయ విద్యాలయ పాఠశాలల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా 3,156 ఖాళీలు ఉన్నాయి. జార్ఖండ్‌లో ఎక్కువగా 230 ఖాళీలు ఉంటే, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాంలో 215 చొప్పున పోస్టులున్నాయి. తెలంగాణలో 69, ఆంధ్రప్రదేశ్‌లో 106 పోస్టులున్నాయి. 2. ఈ వివరాలను కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి ప్రకటించారు.

 

5. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి వివరాలను వెల్లడించారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ స్కూళ్లు, నవోదయ విద్యాలయ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అని, సంబంధిత రిక్రూట్‌మెంట్ నిబంధనల ప్రకారం ఖాళీలను భర్తీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు.

 

6. ఉపాధ్యాయుల పదవీ విరమణతో పాటు విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటం లాంటి అనేక కారణాల వల్ల ఖాళీల సంఖ్య పెరుగుతున్నట్టు తెలిపారు. బోధన, అభ్యాస ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూసేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పాఠశాలల్లో తాత్కాలిక కాల వ్యవధి కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల్ని భర్తీ చేస్తున్నామన్నారు.

 

7. విద్య రాజ్యాంగం ఉమ్మడి జాబితాలోని అంశం అని, ఉపాధ్యాయుల నియామకం, సర్వీస్ కండీషన్స్, ఉపాధ్యాయుల కేటాయింపు లాంటివన్నీ రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయన్నారు. అయితే ఖాళీగా ఉన్న పోస్టుల్ని ఎప్పటిలోగా భర్తీ చేస్తారన్న స్పష్టత లేదు.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button