Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Farmer loan waiver of Rs.2 lakh soon IN TS

త్వరలోనే రూ.2లక్షల రైతు రుణమాఫీ

 

 

 

 

 

 

 

ఎన్నికల హామీలో భాగంగా త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయనున్నట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు. కులకచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం శుక్రవారం చైర్మన్‌ మొగులయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారన్నారు.

 

 

 

 

గత ప్రభుత్వం రూ.10లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. ప్రతీనెల ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కులకచర్ల సొసైటీ ద్వారా 1508 మంది రైతులకు బంగారంపై రూ.10.87కోట్లు, 1320 మందికి స్వల్పకాలిక రుణాలు, రూ.1067కోట్లు 911మందికి దీర్ఘకాలిక రుణాలు రూ.26.04 కోట్లు, 163 మందికి స్వయం ఉపాధి కింద రూ.19.69లక్షలు ఇవ్వడం అభినందనీయమన్నారు. బలవం తపు వసూళ్లు లేవని రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి కొత్త రుణాలు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, సీఈవో బక్కారెడ్డి, మేనేజర్‌ వెంకటయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు భీమ్‌రెడ్డి, బ్లాక్‌బీ అధ్యక్షుడు భరత్‌కుమార్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బీఎస్‌ ఆంజనేయులు, కార్యదర్శి గోపాల్‌నాయక్‌, ఎంపీటీసీ ఆనంద్‌, సొసైటీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

 

 

 

 

 

Related Articles

Back to top button