Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Farmer Loans Waiver 2023

రుణ మాఫీ అందని రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో రైతుల ఖాతాలోకి రుణ మాఫీ డబ్బులు..

 

 

 

రైతు రుణ మాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం, ఇప్పటి వరకు మొత్తం 22.46 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేశామని ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

 

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణ మాఫీని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రైతు రుణ మాఫీకి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు మొత్తం 22.46 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేశామని, ఇంకా 7.15 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేయాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.
ఈ రుణ మాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 12,617 కోట్లను ఖర్చు చేసిందని, ఇంకా రూ. 6400 కోట్లను ఖర్చు చేయాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా కొంత మంది రైతుల బ్యాంకు ఖాతాలలోకి రుణ మాఫీ నగదు డిపాజిట్ అవ్వలేదని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి, అందరికి రుణ మాఫీ డబ్బును వారి బ్యాంకు ఖాతాలలోకి జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ రుణ మాఫీ పథకం ద్వారా ఇప్పటి వరకు 22.46 లక్షల మంది రైతులు లబ్ది పొందారని, వారు బ్యాంకు ఖాతాలలోకి ఇప్పటికే రుణ మాఫీ నగదు జమ అయ్యిందని, ఇక మిగిలిన రైతుల బ్యాంకు ఖాతాలలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా రుణ మాఫీ నగదు వెనక్కి వచ్చిందని, వీలైనంత త్వరగా సదరు సమస్యలను పరిష్కరించి తిరిగి వారి బ్యాంకు ఖాతాలలోకి నగదు బదిలీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

రుణ మాఫీ అందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి రైతుకు రుణ మాఫి ప్రయోజనాన్ని అందించడం తమ ముఖ్య లక్ష్యం అని ప్రభుత్వం తెలిపింది. అలాగే రైతుల రుణ మాఫీకి సంబంధించిన సమస్యలను ప్రభుత్వానికి తెలియచేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ ఎవరికైనా రుణ మాఫీకి సంబంధించిన సందేహాలు ఉంటే, వెంటనే 040-23243667 నెంబర్ కి కాల్ చేసి తమ సమస్యలను, అలాగే సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని ప్రభుత్వం తెలిపింది.

Related Articles

Back to top button