Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Good Boy for OMR… In TSPSC everything is computer exam..

TSPSC Revised Exam Dates

 

 

 

ఓఎంఆర్ కి రాం రాం... టీఎస్పీఎస్సీలో అంతా కంప్యూటర్ పరీక్షలే..

 

 

 

పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో  పోటీ పరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాబోయే రిక్రూట్ మెంట్ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించాలని ఆలోచిస్తోంది. టీఎస్పీఎస్సీ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో సాధ్యమైన చోట నిర్వహించాలని యోచిస్తోంది. ఎగ్జామ్ పేపర్ల తయారీ, భద్రత, ఇతర సాంకేతిక ఇబ్బందులు లేకుండా క్వషన్ బ్యాంకును రూపొందించి…అభ్యర్థుల సంఖ్య ఎంత ఉన్నా కూడా..విడతల వారీగా ఆన్ లైన్ పరీక్షలు జరపాలని కసర్తులు చేస్తోంది. అయితే టీఎస్పీఎస్సీలో ఇప్పటి వరకు 25వేల మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలను మాత్రమే కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తోంది. మిగిలిన పరీక్షలు ఆఫ్‌లైన్ మోడ్‌లో అంటే OMR ఆధారితంగా నిర్వహించబడుతున్నాయి. ఇక నుంచి  25వేలకు అభ్యర్థులు మించినా..ఈ పరీక్షలకు CBT  విధానాన్ని విస్తరించనుంది. పరీక్షలను విడతల వారీగా నిర్వహించి.., నార్మలైజేషన్ విధానం అమలు చేయాలని టీఎస్పీఎస్సీ  భావిస్తోంది.

 

 

IBPS, SCC లెక్క..

 

SSC, IBPS, ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల తరహాలోనే నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్‌పీఎస్సీ ఆలోచిస్తోంది. అయితే ప్రస్తుతం ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. లక్షల సంఖ్యలో అభ్యర్థులకు ఒకేరోజున పరీక్షలు నిర్వహించడం కష్టమే. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు విడతల వారీగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఒక్కోసారి ఈ పరీక్షలు వారం రోజులపాటు జరుగుతున్నాయి. అయితే తెలంగాణలో ప్రస్తుతం 25వేల మంది అభ్యర్థులకు మాత్రమే ఒకేసారి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించేందుకు సదుపాయాలున్నాయి. ఇక ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లు ఉపయోగించుకుంటే రోజుకు దాదాపు 50వేల మంది వరకు ఒకేసారి పరీక్షలు నిర్వహించవచ్చు. అభ్యర్థుల సంఖ్య  ఇంకా పెరిగితే మాత్రం..విడతల వారీగా పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ ఆలోచన చేస్తోంది.

 

 

 

 

కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ కోసం టీఎస్పీఎస్సీ ఒక సమగ్రమైన క్వషన్ బ్యాంకును సిద్దం చేయనుంది. ఇందులో భాగంగా  ప్రశ్నలు ప్రతీ సెషన్‌లో ఒకే విధంగా ఉండవు. ప్రతి సెషన్‌కు ప్రశ్నాపత్రం భిన్నంగా ఉంటుంది. దీంతో అభ్యర్థులు ప్రతి సెషన్‌లోని పరీక్షల సులభంగా రాయలేరు. కాపీ కొట్టలేరు.ప్రతీ సెషన్ లో పేపర్ కఠినంగా ఉండేందుకు టీఎస్ ఎంసెట్ తరహా  ప్రక్రియను అనుసరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ పరీక్షలు.. విధానంపై ఇప్పటికే అభ్యర్థుల్లో అవగాహన ఉండటంతో..ఆ దిశగా కసరత్తు చేస్తోంది.

 

 

TSPSC Revised Exam Dates: కొత్త తేదీల రీషెడ్యూల్‌పై టీఎస్‌పీఎస్సీ క‌స‌ర‌త్తు.. వచ్చే 2 నెలల్లో ఏయే పరీక్షలున్నాయంటే..

 

 

తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా పలు నియామక పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. రద్దయిన పరీక్షల కొత్త తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీని రద్దు చేసిన..

 

 

TSPSC Revised Exam Dates: కొత్త తేదీల రీషెడ్యూల్‌పై టీఎస్‌పీఎస్సీ క‌స‌ర‌త్తు.. వచ్చే 2 నెలల్లో ఏయే పరీక్షలున్నాయంటే..

 

 

 

తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా పలు నియామక పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. రద్దయిన పరీక్షల కొత్త తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీని రద్దు చేసిన రోజునే పునఃపరీక్ష తేదీని జూన్‌ 11గా నిర్ణయించింది. రద్దైన ఇతర పరీక్షలు ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షలతోపాటు వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ, వివిధ పోటీ పరీక్షల తేదీలను పరిశీలించి ఆయా పరీక్షలకు ఆటంకంకలగకుండా టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు అనువైన తేదీలను వారంలోగా ప్రకటించనుంది. అలాగే గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పరీక్షలకు మధ్య వ్యవధిని పరిశీలించి, ఆ మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. తక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్న నోటిఫికేషన్ల రాతపరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహిస్తోంది. ఫలితాలను కూడా వేగంగా వెల్లడించాలని భావిస్తోంది.

 

 

 

ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సిన హార్టికల్చర్‌ అధికారులు, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, భూగర్భజల అధికారులు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్ల పరీక్షలను యధావిధిగా నిర్వహించాలా? లేదా అనే విషయాలను పరిశీలిస్తోంది. అవసరమైతే వారం నుంచి 15 రోజుల వ్యవధితో వీటిని రీషెడ్యూలు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ పరీక్షలన్నింటినీ సీబీఆర్‌టీ పద్ధతిలో నిర్వహించాలని కమిషన్‌ యోచిస్తోంది. ఏఈఈ పోస్టులకు 81 వేల మంది, ఏఈ పోస్టులకు 74 వేల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ పోస్టుల్లో వివిధ కేటగిరీలు ఉన్నందున, ఆయా విభాగాల వారీగా సీబీఆర్‌టీ విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని కమిషన్‌ భావిస్తోంది. భద్రతను మరింత పటిష్టం చేసే విషయాలపై సైబర్‌ సెక్యూరిటీ నుంచి సూచనలు తీసుకుంటోంది.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button