Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

https://www.tspsc.gov.in/

టీఎస్పీఎస్సీలో ఉద్యోగ ఖాళీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

 

 

 

 

 

టీఎస్పీఎస్సీలో ఉద్యోగ ఖాళీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(Telangana Public Service Commission) పేపర్ లీకేజీ వ్యవహారం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో ఇప్పటికే 19 మందిని అరెస్టు చేశారు. ఇప్పటికే నిర్వహించిన నాలుగు పరీక్షలను కూడా రద్దు చేసిన టీఎస్పీఎస్సీకి అందులో ఒక్క డీఏఓ పేపర్ కు తప్ప మిగతా నోటిఫికేషన్లకు కొత్త తేదీలను ప్రకటించారు. ఇక పేపర్ లీకేజీలో ఎవరి పాత్ర ఉందో తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయగా.. తాజాగా దీనిలోకి ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇంకా విచారణ జరుగుతుండగానే పరీక్ష తేదీలను ప్రకటించడం.. హైకోర్టు(High Court) నుంచి తుది తీర్పు రాకుండానే పరీక్షలను ఎలా నిర్వహిస్తారని నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

బోర్డు సభ్యులను మార్చాలని.. చైర్మన్ రాజీనామా చేయాలని కూడా ఇటీవల నిరుద్యోగుల నుంచి డిమాండ్స్ఊ పందుకున్నాయి. బోర్డు సభ్యులను మార్చకుంబడా.. మళ్లీ పరీక్షలు నిర్విహిస్తే.. పేపర్ లీక్ కాదని గ్యారెంటీ ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కొత్త వారిని తీసుకొని.. మళ్లీ పరీక్షలను నిర్వహించాలని నిరుద్యోగులను నుంచి ఎక్కువగా వచ్చే డిమాండ్. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వంతెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌( TSPSC )లో ప‌ది కొత్త పోస్టులను మంజూరు చేసింది.

 

 

ప‌రీక్ష‌ల కంట్రోల‌ర్, డిప్యూటీ కంట్రోల‌ర్, అసిస్టెంట్ కంట్రోల‌ర్, చీఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్, చీఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ ఆఫీస‌ర్, సీనియ‌ర్, జూనియ‌ర్ నెట్ వ‌ర్క్ అడ్మినిస్ట్రేట‌ర్, సీనియ‌ర్, జూనియ‌ర్ ప్రోగ్రామ‌ర్ పోస్టుల‌తో పాటు జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి కేడ‌ర్‌లో లా ఆఫీస‌ర్ పోస్టును మంజూరు చేసింది ప్ర‌భుత్వం. ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ ప్ర‌తిపాద‌న‌లు ఆమోదించింది ప్ర‌భుత్వం. టీఎస్‌పీఎస్సీ అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా బీఎం సంతోష్ నియామ‌కం అయ్యారు. ఐఏఎస్ ఆఫీస‌ర్ సంతోష్ టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌ల కంట్రోల‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ మేర‌కు బీఎం సంతోష్‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఔట‌ర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్ట‌ర్ బాధ్య‌త‌ల నుంచి సంతోష్‌ను బ‌దిలీ చేశారు.

 

 

 

Date

Item Name

Details

07/04/2023ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండిGet Details
07/04/2023జనరల్ అవేర్నెస్Get Details
07/04/2023క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్Get Details
07/04/2023రీజనింగ్Get Details
07/04/2023కరెంటు అఫైర్స్Get Details

 

 

AP TS Circle మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అన్ని రకాల ఉద్యోగాల పూర్తి వివరాలు

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button