Andhra PradeshEducationNational & InternationalSocialTelanganaTop News

Invitation of applications for filling up the posts of Anganwadi 2024

అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

 

ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లా పరిధిలో గల ఐసిడిఎస్ ప్రాజెక్టలు పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్ నందు ఖాళీగా ఉన్న 49 అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి అర్హుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు 2024 జనవరి 26 నుండి ఫిబ్రవరి 10వతేదీ సాయంత్రం ఐదు గంటల లోగా సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారికి నేరుగా గాని పోస్ట్ ద్వారా గాని దరఖాస్తులు సమర్పించాలన్నారు.

అంగన్వాడీ కార్యకర్త, ఆయా, మినీ కార్యకర్తల పోస్టులకు దరఖాస్తు చేయదలచిన మహిళలు తప్పని సరిగా పదోతరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని, ప్రధానంగా స్థానికంగా నివాసం కలిగి ఉండాలని వివాహిత అయి ఉండాలని తెలిపారు. 2023 జూలై 1 నాటికి అభ్యర్థులు 21 సంవత్స రములు పూర్తి చేసి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని తెలిపారు. 21 సంవత్సరాల లోపు అభ్యర్థులు లభించని పక్షంలో 18 సంవత్సరాలు పూర్తయిన వారి దరఖాస్తులు పరిశీలించబడతాయని అయితే కేవలం ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలకే వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

 

ఎంపికలో పదవ తరగతి ఉత్తీర్ణత 50 మార్కులు, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ఐదు మార్కులు, వితంతువులకు ఐదు మార్కులు, మైనర్ పిల్లలు కలిగి ఉన్న వితంతువులకు ఐదు మార్కులు, పూర్తి అనాధ, క్రెచ్, హోమ్, ప్రభుత్వ సంస్థలలో నివశించు సత్ప్రవర్తన సర్టిఫికెట్ కలిగిన వారికి 10 మార్కులు, అర్హత కలిగిన వికలాంగ వ్యక్తులకు ఐదు మార్కులు మౌఖిక పరీక్షకు 20 మార్కులు మొత్తం 100 మార్కులకు లెక్కించబడుతుంది అని తెలిపారు. మార్కుల ఆధారంగా పూర్తి పారదర్శకతతో నియామకాలు జరుగుతాయని ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు మధ్యవర్తులను, దళారులను నమ్మి మోసపోవద్దని, వారి అర్హతలను, మార్కులను పరిశీలించి ఎంపిక చేయటం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. పూర్తి వివరముల కొరకు సంబంధిత ఐసిడిఎస్ నందు సంప్రదించగలరని తెలిపారు.

 

Related Articles

Back to top button