Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Land Registrations in telangana

భూమి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలనుకునే వారికి గుడ్​న్యూస్​.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. !

 

 

 

 

 

ఏళ్లుగా భూమి రిజిస్ట్రేషన్లు పెండింగ్​లో పడిపోయిన వారికి గుడ్​న్యూస్​. అనుమతులు లేని లేఅవుట్లలోని ప్లాట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

 

 

 

ఏళ్లుగా భూమి రిజిస్ట్రేషన్లు (Land Registrations) పెండింగ్​లో పడిపోయిన వారికి గుడ్​న్యూస్​. అనుమతులు లేని లేఅవుట్లలోని (Layouts) ప్లాట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం  (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అలాంటి లేఅవుట్లలోని ప్లాట్లకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ (First registration) చేయడం లేదు. దీంతో హైదరాబాద్ (Hyderabad) తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల శివార్లలోని గ్రామ పంచాయతీల్లో వేలాది ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ గ్రామాల్లో చాలా వరకు మున్సిపాలిటీలుగా మారడమో, విలీనం కావడమో జరిగింది. ఈ నేపథ్యంలో నిబంధనను సడలించాలని సీఎం కేసీఆర్ (CM KCR)​ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సదరు లేఅవుట్లు ఎల్ఆర్ఎస్ (LRS) చెల్లించేందుకు అర్హమైనవి అయితే.. ఆ లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను తెలంగాణ ప్రభుత్వం అనుమతించనున్నట్టు సమాచారం.

 

 

 

తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆ ప్లాట్లకు ఫస్ట్ రిజిస్ట్రేషన్లు చేయాలని.. అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఎల్ఆర్ఎస్ చెల్లించాల్సి ఉందన్న అంశాన్ని చేర్చాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఒకటి రెండు రోజుల్లో జారీచేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. అదనపు ఆదాయ వనరుల సమీకరణలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. దీంతో ఏళ్లుగా పెండింగ్​లో పడిపోయిన సమస్యకు కొద్దిరోజుల్లోనే చెక్​ పడే అవకాశం ఉంది.

 

 

 

ధరణి తెచ్చిన చిక్కులు.. తెలంగాణలో భూ సంస్కరణల పేరుతో రెవెన్యూ శాఖ తీసుకొచ్చిన ధరణి భూ యజమానులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. సర్వే నంబర్లు తప్పుగా నమోదవడం, ఒకరి భూమి మరొకరి సర్వే నంబర్లలో చేరడం, విస్తీర్ణాలలో హెచ్చుతగ్గులు, పాసు పుస్తకాల్లో తప్పులు.. ఇలా అనేక సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. వాటిని సరిదిద్దుకునే అవకాశాలు పోర్టల్లో లేకపోవడం, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం లభించకపోవడం.. తదితర కారణాలతో విసిగివేసారిన బాధితులు ఆందోళన బాటపడుతున్నారు.

Asara Pensions: ఇక వారికి కూడా ఆసరా పింఛన్​.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు! కొందరు ఇంకాస్త ముందుకెళ్లి నిరసన తెలిపే క్రమంలో అధికారుల సమక్షంలోనే ఆత్మహత్యా ప్రయత్నాలకు తెగబడుతున్నారు బాధితులు. ఫలితంగా జిల్లా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి అధికారులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ఏమూల నుంచి ఏ బాధితుడు వచ్చి ఎలాంటి ఆందోళన చేపడతారో.. ఏం అఘాయిత్యానికి పాల్పడతారోనన్న ఆందోళన అక్కడి సిబ్బందిలో కనిపిస్తోంది. సోమవారం మూడు జిల్లాల్లో బాధితులు పెట్రోలు పోసుకునేందుకు ప్రయత్నించారు. గతంలో ఉమ్మడి వరంగల్ , మహబూబ్ నగర్ , కరీంనగర్ , రంగారెడ్డి జిల్లాల్లోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి.

Injection Murder: ట్విస్టు మామూలుగా లేదుగా.. ‘‘సూది మర్డర్‌ వెనుక కథ ఇదీ..’’ 2017-18 మధ్య కాలంలో రెవెన్యూశాఖ నిర్వహించిన భూదస్త్రాల ప్రక్షాళనలో సిబ్బంది ఇష్టారాజ్యంగా యాజమాన్య హక్కులను మార్చేశారు. అదే సమాచారంతో ధరణి పోర్టల్ అమల్లోకి తేవడంతో ఒక్కసారిగా పలు అవకతవకలు బయటపడ్డాయి. రాష్ట్రంలో దాదాపు 11 లక్షల ఎకరాల భూమికి యాజమాన్య హక్కుల్లో స్పష్టత లేదంటూ.. వివాదాస్పద జాబితాలో చేర్చి పాసుపుస్తకాలు జారీ చేయలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button