Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Notification for 9 thousand Anganwadi teachers and helpers in Telangana 2024

తెలంగాణలో 9వేల అంగన్వాడి టీచర్లు, హెల్పేర్ల నోటిఫికేషన్ జారీ.

 

 

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 9,వేల అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం కార్యాచరణను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం అనుమతించిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనున్నారు.

 

 

 

గతంలో అంగన్‌వాడీ టీచర్ల పోస్టులకు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉండేది తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఉపాధ్యాయులతో పాటు హెల్పర్లుగా నియమితులైన వారు కనీసం ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.అదేవిధంగా వయోపరి మితి 18 నుండి 35 సంవత్సరాలు 65 సంవత్సరాలు దాటిన తర్వాత వారి సేవలను పొందకూడదు విద్యార్హత మార్కులు స్థానికత ఇంటర్వ్యూ మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక్కో కేంద్రంలో అంగన్వాడీ టీచర్‌తోపాటు హెల్పర్ ఉంటారు గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైనవారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్నవారికి సూపర్ వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

 

 

వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్‌వైజర్ పోస్టుల్లోనూ 50 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి.

 

 

 

 

Related Articles

Back to top button