Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

PM Kisan Status – Beneficiary List Check, e-KYC, Online | PM-KISAN 15th Installment

రైతుల ఖాతాల్లో కేంద్రం నిధుల జమ - ముహూర్తం ఖరారు..!

 

 

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి సంబంధించిన ఇన్ స్టాల్ మెంట్ ఈ నెలలో రావాల్సి ఉంది. 15వ ఇనిస్టాల్ మెంట్ నిధులను దీపావళి వేళ రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికార వర్గాలు ఇందుకు ఈ నెల 27న ముహూర్తంగా నిర్ణయించారు. కానీ, దీపావళి వేళ రైతులకు అందేలా తాజాగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

 

 

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు కేంద్రం ఆర్దికంగా సాయం అందిస్తోంది. క సాయం అందిస్తారు. ఈ సొమ్ము నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. ఈ పథకాన్ని , 2019, ఫిబ్రవరి 24న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతులందరికీ ఒక్కొక్కరికి రూ. 2000 చొప్పున మూడు విడతలుగా సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఈ సొమ్ము నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. కాగా 14వ నగదు సాయం ఈ ఏడాది జూలైలో విడుదలైంది. అయితే ఈ పథక లబ్ధిదారులైన రైతులు ఈ సాయం పొందుకోవాలంటే తప్పనిసరిగా ఈ-కేవైసీ అప్ డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.

 

 

ఇందు కోసం ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పూర్తి సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇందులో హోమ్‌పేజీలోని ‘ఫార్మర్స్ కార్నర్’ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆపై మీరు ‘బెనిఫిషియరీ లిస్ట్’ లింక్‌పై క్లిక్ చేయాలి. మీరు మరొక వెబ్‌పేజీలోకి వెళ్లిన తరువాత..దీని తర్వాత, మీరు మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకుని, ఆపై గెట్ రిపోర్ట్ బటన్‌పై క్లిక్ చేయాలి. లబ్ధిదారుల జాబితాలో, మీరు పథకం ప్రయోజనాలను పొందేందుకు షార్ట్‌లిస్ట్ చేసి ఉంటే వివరాలను పొందే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ-కేవేసీని పూర్తి చేయాలి. ఫార్మర్స్ కార్నర్ విభాగంలోని ‘ఈ-కేవైసీ’పై క్లిక్ చేయటం ద్వారా
ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ’ విభాగాన్ని పొందిన తర్వాత, ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.

 

 

 

ఆ తర్వాత ‘సెర్చ్’పై క్లిక్ చేయంటంతో ఆపై, మీ ఆధార్-లింక్ అయిన మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, ‘ఓటీపీ పొందండి’పై క్లిక్ చేయాలి. ఓటీపీని నమోదు చేసి, ధ్రవీకరిస్తే ఈ-కేవైసీ పూర్తవుతుంది. ఇక, ఏపీలో పీఎం కిసాన్ కు అదనంగా నిధులు కలిపి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పేరుతో నిధుల విడుదల చేస్తోంది. కేంద్రం ఈ నెలలో త్రైమాసిక నిధులు విడుదలకు నిర్ణయం తీసుకోవటంతో..ప్రభుత్వం తమ నిధులను ఈ నెల 7న రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది.

 

 

 

Related Articles

Back to top button