Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Runamafi New Ruls 2023 || KCR Runamafi 2023

రైతులకు షాకిస్తున్న బ్యాంకు అధికారులు..రుణాలకు కొత్త రూల్

 

 

గృహ, వాహన రుణాల మాదిరిగానే ఇక రైతులు పంట రుణాలు పొందాలనుకుంటే వారికి సిబిల్‌ స్కోర్‌ ఉండాల్సిందే. లేదంటే బ్యాంకు అధికారులు తిరస్కరిస్తారు. రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు పెట్టిన కొత్త నిబంధన ఇది. ప్రస్తుతం వానాకాలం సీజన్లో పంట రుణాల కోసం వాణిజ్య బ్యాంకుల వద్దకు వెళ్లిన రైతులకు బ్యాంకర్లు కొత్త మెలిక పెట్టారు. రూ.1లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన హామీతో బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లించని రైతులకు సిబిల్‌ పేరుతో ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.

 

 

రుణగ్రహీతల ఆర్థిక క్రమశిక్షణకు ఇది సరైన మార్గమే అయినప్పటికీ, వాణిజ్య అవసరాలకు పెట్టిన నిబంధనను పంట రుణమాఫీకి వర్తింపజేయడంతో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్నారు. వ్యాపార, వాణిజ్య, గృహనిర్మాణ అవసరాలకు ఇచ్చే రుణాలకు తప్ప సిబిల్‌తో సంబంధం లేకుండా బ్యాంకులు రైతులకు పంట రుణాలను మంజూరు చేసేవి. ఈ ప్రక్రియలో కొన్ని బ్యాంకులు పట్టాదారు పాస్‌ పుస్తకాలను బ్యాంకులోనే ఉంచుకొని రుణాలు ఇవ్వగా, ఇంకొన్ని బ్యాంకులు కేవలం పట్టాదారు పాస్‌ పుస్తకంపై స్టాంప్‌ వేసి తిరిగి దాన్ని రైతులకే ఇచ్చేవారు. పట్టాదారు పాస్‌ పుస్తకంలో సదరు రైతు పేరిట ఉన్న భూ విస్తీర్ణం పరిమితి మేరకు బ్యాంకర్లు పంట రుణాలను ఇస్తారు. అయితే బ్యాంకుల నిబంధనల ప్రకారం రైతులు పంట రుణాలు పొందిన నాటి నుంచి ఏడాది లోపు రుణాలను వడ్డీతో సహా తీర్చాలి.

 

 

అయితే ప్రభుత్వం రుణమాఫీ ప్రకటిస్తుందనే ఉద్దేశంతో కొందరు రైతులు కనీసం వడ్డీ కూడా చెల్లించలేదు. ఫలితంగా సదరు రైతుకు సిబిల్‌ స్కోర్‌ తగ్గింది. పైగా వరుస మూడేళ్లు లావాదేవీలు లేని ఖాతాలు ఎన్పీ (నో ప్రొటెక్ట్‌) పరిధిలోకి వెళ్తున్నాయి. పంట రుణాలు పొందడానికి బ్యాంకర్లు సిబిల్‌తో పాటు కొత్త కొర్రీని కూడా జోడించినట్టు తెలుస్తోంది. ఇదివరకైతే సంబంధిత రైతు పట్టాదారు పాస్‌ పుస్తకం, వన్‌ బీ, పహాణీని రుణ దరఖాస్తు ఫారానికి జతపరిస్తే సరిపోయేది. భూ విస్తీర్ణాన్ని బట్టి పరిమిత మేరకు పంట రుణాలను బ్యాంకర్లు ఇచ్చేవారు. కాగా, తాజాగా పంట రుణాలకు వీటితో పాటు జామీను(పూచీకత్తు)ను కూడా ఇవ్వాలని షరతు పెడుతున్నట్టు సమాచారం. పంటరుణం పొందాలంటే కుటుంబ సభ్యులలో వారసులైన వారు లేదా ప్రభుత్వ ఉద్యోగులతోనైనా జామీను సంతకం చేయించే నిబంధనను అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పంట రుణాలకు బ్యాంకర్లు కొత్త కొత్త నిబంధనలు పెడుతుండటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

రైతులకు చేయూతనివ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రుణ మాఫీ అర్హులందరికీ అందేలా చూడాలని వరంగల్‌ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు సూచించారు. వర్ధన్నపేటలో నూతనంగా నిర్మించిన జిల్లా సహకార బ్యాంకు సమావేశం హాలులో వరంగల్‌ జోనల్‌ స్థాయి సహకార సంఘాల సొసైటీ చైర్మన్లు, బ్యాంకు అధికారులు, సీఈవోలతో బుధవారం సమీక్ష నిర్వహించారు.

 

 

రైతులకు చేయూతనివ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రుణ మాఫీ అర్హులందరికీ అందేలా చూడాలని వరంగల్‌ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు సూచించారు. వర్ధన్నపేటలో నూతనంగా నిర్మించిన జిల్లా సహకార బ్యాంకు సమావేశం హాలులో వరంగల్‌ జోనల్‌ స్థాయి సహకార సంఘాల సొసైటీ చైర్మన్లు, బ్యాంకు అధికారులు, సీఈవోలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని రైతులకు చెందిన రూ.115 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. సొసైటీల వారీగా అర్హుడైన ప్రతి రైతుకు రుణమాఫీ జరిగేలా చూడాలని సూచించారు. అంతేకాక అర్హులైన వారికి వెంటనే కొత్త రుణాలను కూడా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు రుణ మాఫీ, కొత్త రుణాల మంజూరు విషయంలో సొసైటీ సీఈవోలకు సహకారం అందించాలని ఆదేశించారు.

 

 

వ్యాపారాలపై దృష్టి సారించాలి..
ప్రాథమిక వ్యవసాయ సహకార, కర్షక సేవా రైతు సంఘాలు కేవలం రుణాలు ఇవ్వడం, వసూలు చేయడంతో పాటు ఆర్థికంగా బలోపేతం కావడంపై దృష్టి సారించాలని, వీలైన కేంద్రాల్లో వ్యాపారాలు చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు. నందనం బ్యాంకు పరిధిలో ఐనవోలులో వ్యాపార సముదాయాన్ని ప్రారంభించినట్లు ఉదహరించారు. ఇదే తరహాలో ప్రజల అవసరాలను గుర్తించి వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం బ్యాంకు అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకారం అందించనున్నట్లు చెప్పారు. అన్ని సొసైటీలకు భవనాలను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సొసైటీల బాధ్యులు, పాలక మండలి సమావేశాలు ఏర్పాటు చేసుకొని భవనాల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రధాన కూడళ్లు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు.

 

 

సొసైటీల వారీగా సమీక్ష..
జోనల్‌ పరిధిలోని తొర్రూరు, నెల్లికుదురు, రాయపర్తి, వర్ధన్నపేట, నందనం, కొలన్‌పల్లి తదితర సొసైటీల వారీగా చైర్మన్‌ రవీందర్‌రావు, జీఎం, సీఈవోలు సమీక్ష నిర్వహించారు. బ్యాంకు, సొసైటీల ద్వారా ఇచ్చిన రుణాలు, నెలవారీగా, పంట కాలాల వారీగా అవుతున్న రికవరీలపై చర్చించారు. లావాదేవీలు, ఖర్చుల వివరాలను తెలుసుకొన్నారు. రికార్డుల తయారీ, రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడితే సంబంధిత శాఖల సీవోలు, ఇతర అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రుణమాఫీపై నిర్లక్ష్యం వహించొద్దని, సీఎం కేసీఆర్‌ సూచనల ప్రకారం పనిచేయాలన్నారు. సొసైటీ అకౌంట్స్‌ విషయంలో సీవోలు పారదర్శకంగా పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ చాపల యాదగిరిరావు, డీఆర్‌ఏవో వల్యానాయక్‌, సీఈవో చిన్నారావు, జీఎం శ్రీధర్‌, డీజీఎం కురువానాయక్‌, ఏజీఎం రాజశేఖర్‌, నోడల్‌ అధికారి భద్రునాయక్‌, బ్యాంకు మేనేజర్లు సమత, రమ్యశ్రీ, శ్రవణ్‌ పాల్గొన్నారు.

 

 

Related Articles

Back to top button