Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

runamafi updates in telangana 2023

పంటల రుణ పరిమితి పెంపు

 

 

 

 

పంటల రుణ పరిమితి పెంపు

 

 

వచ్చే వానాకాలానికి సంబంధించి పంట రుణాల పరిమితి (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌)ను ఈ సారి పెంచారు. ఈ మేరకు గత నెల 21న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)లో నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే వానాకాలానికి సంబంధించి పంట రుణాల పరిమితి (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌)ను ఈ సారి పెంచారు. ఈ మేరకు గత నెల 21న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)లో నిర్ణయం తీసుకున్నారు. 123 పంటలకు ఈ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను ఖరారు చేశారు. దీని ఆధారంగానే బ్యాంకు అధికారులు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పంటల రుణ పరిమితిని ఖరారు చేయనున్నారు. పెంచిన పంట రుణాల వివరాలను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) తన పరిధిలోని శాఖలు, సంఘాలకు తెలియ చేసింది. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం తమ శాఖలకు సమాచారాన్ని అందించాయి.

 

 

గతంలో పోలిస్తే పంటల వారీగా ఎంత మొత్తం ఇవ్వాలనేది టెస్కాబ్‌ నిర్ణయించింది. సాగుకు అయ్యే పెట్టుబడి ఏటా పెరుగుతున్నా రైతులకు ఇచ్చే రుణాల పరిమితి పెరుగుదల మాత్రం నామమాత్రంగానే ఉంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అధిక విస్తీర్ణంలో వరి సాగు అవుతుంది. ఆ తర్వాత స్థానం పత్తి, మిర్చిది. వరి పంట కు మాత్రం ఎకరానికి రూ. 45వేలు ఖరారు చేయడం కొంత మేరకు రైతులకు ఊరటనిచ్చింది. మొదటిసారిగా పంటలతోపాటుగా పాడి, కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, చేపల పెంపకం యూనిట్లు, పట్టు పురుగుల పెంపకానికీ రుణాలు ఇవ్వాలని టెస్కాబ్‌ నిర్ణయించింది.

 

 

 

బ్యాంకర్ల దయ

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌కు అనుగుణంగా రుణాలు ఇవ్వకపోవడంతో పాటు నిర్దేశించిన లక్ష్యం మేరకు పంపిణీ చేయకపోవడం పట్ల బ్యాంకర్ల తీరుపై అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకర్లు జిల్లా కలెక్టర్ల సమావేశంలో జరిగిన ఒప్పందాలను సైతం విస్మరించి రైతులకు ఇచ్చే రుణాల్లో కోత పెడుతున్నాయి. తామిచ్చిన లక్ష్యాలను తామే తుంగలో తొక్కుతున్నారు. ఈ సారైనా టెస్కాబ్‌ సూచనలు పూర్తి స్థాయిలో అమలు చేస్తారా? లేదా? అన్నది బ్యాంకర్ల దయపై ఆధారపడి ఉందని రైతులు చెబుతున్నారు. నాలుగేళ్లలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రాజెక్టుల పరిధిలో సాగు విస్తీర్ణం పెరగడం, కూలీల కొరత, పెరిగిన పెట్టుబడుల కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. సాగునీటి కల్పన, వ్వయసాయ యాంత్రీకరణ, పాడి పరిశ్రమ, ఎద్దులు, ఎడ్లబండ్లు, భూముల అభివృద్ధి, విత్తనోత్పత్తి, సేంద్రీయ సాగు విషయంలో చాలా వరకు రైతులకు రుణాలు అందటం లేదు.

 

 

కొత్తవారికి ఏవీ?

బ్యాంకు అధికారులు తలుచుకుంటే పంట రుణ పరిమితిని పెంచి ఇవ్వడంతోపాటు సక్రమంగా రుణాలు చెల్లించిన రైతులకు నిర్దేశిత మొత్తం కన్నా 30శాతం వరకు కూడా రుణాన్ని పెంచి ఇచ్చే వీలున్నది. నిర్దేశిత లక్ష్యాల మేరకే రుణాలు ఇవ్వని ప్రస్తుత పరిస్థితుల్లో.. అదనంగా రుణాన్ని ఆశించడం అత్యాశే అవుతుందని రైతులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందినవారు, ఇది వరకు రుణం పొందని వారు సుమారు 50వేల మంది వరకు ఉంటారు. వీరంతా ఈసారి తమకు కూడా ఇవ్వాలని కోరుతున్నారు.

ప్రభుత్వం రూ.లక్ష వరకు పంటరుణ మాఫీ నిధులను కూడా విడుదల చేసినట్లయితే ఉమ్మడి జిల్లాలో రూ.వెయ్యి కోట్ల వరకు రైతులకు చేతికందుతుంది. ఇది ఎంతో ఊరట నివ్వడమేకాకుండా పెరిగిన పంట రుణాలకు తోడయినట్లు ఉంటుంది. అయితే ఇప్పటివరకు పంట రుణాలు పొందనివారు. కొత్తగా పాస్‌ పుస్తకాలు పొందిన వారు ఆయా మండల వ్యవసాయాధికారులను సంప్రదించాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటున్న రైతులు 6.29 లక్షలమంది వరకు ఉన్నారు. సుమారు రూ.2,963కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు.

 

 

పొంతన లేదు

సాగుకయ్యే పెట్టుబడికి, బ్యాంకు రుణ పరిమితికి సంబంధం లేకుండా ఉంది. ప్రతీ సీజన్‌కు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరిగి పోతున్నాయి. రైతులు విధిలేని పరిస్థితిలో వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకుంటున్నారు. దీనికితోడు మద్దతు ధరలు భరోసా ఇవ్వలేక పోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పందించినా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఉదాహరణకు పత్తి సాగుకు ఎకరానికి రూ. 60వేలకు పైగా ఖర్చు అవుతుండగా రూ. 45వేలు మాత్రమే ప్రతిపాదించారు.

 

 

కాగితాలపైనే..

రెండేళ్లుగా నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలివ్వడంలో బ్యాంకర్లు విఫలం అవుతున్నారు. టెస్కాబ్‌ పంట రుణ పరిమితిని పెంచినప్పటికీ నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదు. ధరణి పోర్టల్‌ ఏర్పాటు అనంతరం పలువురు రైతులకు రుణాలు అందని ద్రాక్షగానే మారింది. లీడ్‌ బ్యాంక్‌, వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో బ్యాంకర్లు లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వడం లేదు. టెస్కాబ్‌ నిర్దేశించిన ప్రకారం బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. పరిమితి పెంచినప్పటికీ ఎకరాకు రూ. 30వేలకు మించి ఇవ్వడం లేదంటున్నారు.

అది కూడా సాగు సమయం దాటిన తర్వాత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు, దీంతో పెట్టుబడి సమయంలో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. జిల్లా పాలనాయంత్రాంగం చొరవ తీసుకొని నిర్దేశిత లక్ష్యం మేరకు రుణాలు సకాలంలో పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

 

Untitled-1.jpg

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button