Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Rythu Bandhu Updates

How To Chek Rythu Bandhu

 

 

 

 

ప్రభుత్వానికి నివేదించిన వ్యవసాయ శాఖ అధికారులు భూపాలపల్లి జిల్లాలో ఈసారి పెరగనున్న సాగు విస్తీర్ణం 36,596 ఎకరాల అధికంగా పంటలు

 

 

 

 

కృష్ణకాలనీ(భూపాలపల్లి), నవంబరు 7: యాసంగి పంటల యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధమైంది. సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించి ప్రభుత్వా నికి నివేదించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి యాసంగి సాగు విస్తీర్ణం పెరగనుంది. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో గత ఏడాది అయోమయానికి గురై వెనగడుగు వేసిన రైతులు ఈసారి ఆసక్తి చూపుతు న్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ముందడగు వేస్తున్నారు.

 

 

 

ఈ ఏడాది (2022-23) 1,00,207 ఎకరాల్లో యా సంగి పంటలు వేసుకొనే అవకాశం ఉందని వ్యవసా య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత యాసంగి (2021-22)లో 63,611 ఎకరాల్లో సాగు అంచనా రూపొందించగా ప్రస్తుతం 36,596 ఎకరాల విస్తీర్ణం పెగిగింది. గత ఏడాది వరి సాగు విస్తీర్ణం 48,882 ఎకరాలకు అంచనా వేసిన అధికారులు ఈసారి 79,933 ఎకరాలకు ప్రణాళికను రూపొం దించారు. గతం కంటే 31,051 ఎకరాల్లో అధికంగా సాగు అంచనా తయారు చేశారు.

 

 

 

ముందస్తుగానే మొదలు పెట్టాలి…

 

 

ఖరీఫ్‌లో సాగు చేసిన వరి కోతలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని మొత్తం 11 మండలాల్లో 1,01,600 ఎకరాల్లో వరి సాగు చేశారు. అధిక దిగుబడులు వస్తాయని ఆశించిన రైతులకు మాత్రం ప్రకృతి అనుకూలించలేదు. దీంతో నిరాశే ఎదురైంది. అధిక వర్షాలు, చీడపీడలు ఇతరత్రా కారణాలతో దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలైలో వేసిన నాట్లు కోతకు రాగా ఆగస్టులో వేసిన నాట్లు మరో నెల రోజులు పట్టనున్నాయి. డిసెంబరు చివరికల్లా వరి కోతలు పూర్తిచేసి జనవరి చివరి వారంలో యాసంగి సాగు పనులు మొదలు పెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా ఫిబ్రవరి, మార్చిలో నాట్లు వేయడంతో వేసవి తీవ్రత అధికమై వడగండ్లు వచ్చి దిగుబడిపై ప్రభావం చూపే ఆస్కారం ఉందంటున్నారు. వీటిని అధిగమించడంతో పాటు వెదజల్లుతూ డ్రమ్‌ సీడ ర్‌ ద్వారా నాట్లు వేస్తే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

 

 

 

జనవరి కల్లా ప్రారంభించాలి

– విజయభాస్కర్‌, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి

యాసంగి సాగు ప్రణా ళికను రూపొందించి ప్రభు త్వానికి నివేదించాం. ఈసారి సాగు విస్తీర్ణం పెరగనుంది. ఇప్పటికే జిల్లాలో ఖరీఫ్‌ వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈనెల 20 నుంచి కొనుగోలు కేంద్రాలు కూడా అందు బాటులోకి తెస్తాం. రైతులు వచ్చే జనవరి చివరికల్లా యాసంగి పనులు ప్రారంభించాలి. వేసవి తీవ్రతను అధిగమించేందుకు ముందస్తుగా సాగు పనులు మొదలు పెట్టాలి.

 

 

 

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button