Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Rythu Runa Mafi 2024

రుణమాఫీ ఒకేదఫాలో.. నేటి క్యాబినెట్‌ భేటీలో అదే ప్రధాన ఎజెండా!

 

 

రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అంశంపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. శుక్రవారం జరిగే క్యాబినెట్‌ సమావేశంలో రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. రుణమాఫీ ఏ విధంగా చేయాలి? షరతులు పెట్టా లా? వద్దా? ఒకవేళ పెడితే ఏ మేరకు పెట్టాలి?

 

 

 

రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అంశంపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. శుక్రవారం జరిగే క్యాబినెట్‌ సమావేశంలో రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. రుణమాఫీ ఏ విధంగా చేయాలి? షరతులు పెట్టా లా? వద్దా? ఒకవేళ పెడితే ఏ మేరకు పెట్టాలి? అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది. ఒకేసారి రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేసే అంశంపైనా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. ఒకవేళ చేయాలని భావిస్తే, ఇందుకు అవసరమైన నిధుల సమీకరణ ప్రభుత్వానికి సవాల్‌గా మారనున్నది. ఈ నేపథ్యంలో నిధులను ఏ విధంగా సమాకూర్చుకోవాలనే అంశంపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు.

 

 

 

రైతులకు ఉన్న రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఆగస్టు 15 వరకు రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా దేవుళ్ల మీద ఒట్టు పెట్టారు. అయితే, ఇందుకోసం సుమారు రూ.35 వేల కోట్ల నిధులు అవసరమని లెక్క తేలడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు కోతలు పెట్టాలని, కేంద్రం అమలుచేస్తున్న పీఎం కిసాన్‌ పథకం నిబంధనలను రుణమాఫీకి వర్తింపచేయాలని ప్రభుత్వం ఆలోచన చేసినట్టు తెలిసింది. ఈ నిబంధనలు అమలు చేస్తే రాష్ట్రంలోని సగం మంది రైతులకు రుణమాఫీ వర్తించదు. దీంతో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కోతలు పెట్టాలా? వద్దా? అనేదానిపై క్యాబినెట్‌లో నిర్ణయించే అవకాశం ఉన్నది.

 

 

 

 

 

Related Articles

Back to top button