Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Rythu Runa Mafi Scheme 2023 || Runa Mafi Online Registration and Status

https://clw.telangana.gov.in/Login.aspx

 

జయహో.. రైతు రక్షకా

 

‘మేము ఇప్పటికే చెప్పినట్లు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా.. ఆరునూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు.. రైతు సాధికారత సాధించేదాకా విశ్రమించేది లేదు’ అని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకొని వేలాది మంది రైతుల్లో ఆనందం నింపారు. నేటి నుంచి రైతుబంధు తరహాలో విడుతల వారీగా నెలన్నరలో రైతు రుణ మాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలివ్వడంపై అన్నదాతలు సంబురపడుతున్నారు.

 

 

 

జయహో.. రైతు రక్షకా

 

 

  • రుణమాఫీపై అన్నదాతల్లో వెల్లివిరిసిన ఆనందం
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని సంతోషం
  • నెలన్నరలోగా విడుతల వారీగా రుణమాఫీ..
  • సీఎం కేసీఆర్‌కు రైతుల కృతజ్ఞతలు
  • తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని స్పష్టం
  • బీఆర్‌ఎస్‌ సర్కారు వెంటే ఉంటామని వెల్లడి

 

మేము ఇప్పటికే చెప్పినట్లు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా.. ఆరునూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు.. రైతు సాధికారత సాధించేదాకా విశ్రమించేది లేదు’ అని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకొని వేలాది మంది రైతుల్లో ఆనందం నింపారు. నేటి నుంచి రైతుబంధు తరహాలో విడుతల వారీగా నెలన్నరలో రైతు రుణ మాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలివ్వడంపై అన్నదాతలు సంబురపడుతున్నారు. ‘సీఎం కేసీఆర్‌ రైతుల పాలిట దేవుడు.. సాగు మొదలు పంట ఉత్పత్తులను అమ్మేదాకా అండగా ఉంటున్నడు.. కేసీఆర్‌ వల్లే వ్యవసాయం పండుగలా మారింది. ప్రతి రైతును దర్జాగా బతికేలా చేసి.. ఇప్పుడు రుణమాఫీ కూడా చేసిండు.. ఇంతకంటే ఏంగావాలె?.. మేమంతా ఆయనవెంటే నడుస్తం.. తెలంగాణ సర్కారుకే అండగ ఉంటం’ అంటూ కర్షకులు స్పష్టం చేస్తున్నారు.

 

 

 

 

అందుకే ఆలస్యం..
రైతు రుణమాఫీని కొనసాగించినా కరోనా వంటి అనుకోని ఉపద్రవాలు, కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్బీఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం, పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన మందగమనం వల్ల రైతు రుణమాఫీలో కొంతకాలం జాప్యం జరిగిందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌, సాగునీరు వంటి పథకాలను చిత్తశుద్ధితో నిరాటంకంగా కొనసాగిస్తున్నామని, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు.

 

 

ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను రాష్ట్రంలో మరో రూ.19వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్‌ రెండో వారం వరకు రైతుబంధు తరహా విడుతలవారీగా నిధులు విడుదల చేయాలని ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు రుణమాఫీ ప్రకటన వెలువడగానే రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని, ప్రపంచంలో రైతులను పట్టించుకున్న నాథుడు ఉన్నాడంటే అది సీఎం కేసీఆర్‌ మాత్రమేనని, ఎక్కడా లేని విధంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతుబాంధవుడిలా నిలిచారని కొనియాడుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంటు, సాగునీరు, పంట కొనుగోళ్ల ద్వారా రైతులను ఆర్థికంగా నిలబెట్టిన సీఎం కేసీఆరే నిజమైన రైతు రక్షకుడని స్పష్టం చేస్తున్నారు. రైతులు ఉన్నంత కాలం సీఎం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకుంటారని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

 

 

Warangal5

 

 

రైతుల కష్టం తెలిసిన సీఎం
చెన్నారావుపేట, ఆగస్టు 2 : రైతుల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి మన కేసీఆర్‌ సారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తాండు. గవర్నమెంట్‌కు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎవుసం బాగుండాలని రైతుల అప్పులు తీరుస్తాండు. ఇంతకుముందు చిన్న మొత్తంలో ఉన్న రుణాలను మాఫీ చేసి లక్ష రూపాయల రుణాలను కట్టాలంటడని భయపడ్డాం. సొసైటీ అప్పు తీర్చడానికి కొత్త అప్పు చేయాల్సి వస్తదనకున్నం. రైతుల బాధ తెలిసిన సీఎం మనకు ఉన్నడు కాబట్టే రైతులు ధైర్యంగా ఎవుసం చేస్తున్నారు. పంటకు పెట్టుబడి ఇచ్చి, ఉచిత కరెంట్‌ ఇచ్చి, పంటలను తగిన ధర పెట్టి కొంటాండు. ఇలా ఎవుసం చేయమనే ముఖ్య మంత్రికి రైతులు ఎల్లకాలం రుణపడి ఉంటారు.

మాట నిలబెట్టుకొని అండగా ఉన్నరు..

 

హనుమకొండ సబర్బన్‌, ఆగస్టు 2 : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నరు. గత ఎన్నికల తర్వాత కరోనా మూలంగా దేశమంత అల్లకల్లోలం అయినా వడ్లు కొని రైతులకు నగదు అందించారు. ఇప్పుడు రుణమాఫీ అమలుచేస్తున్నందుకు రైతులమంతా కేసీఆర్‌కు రుణపడి ఉంటం. ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిక్థితుల్లో ఉన్నప్పటికీ వ్యవసాయరంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మాకు బాగా ఉపయోగపడుతున్నాయి. భూగర్భ జలాలు భారీగా పెరిగి నిరంతర ఉచిత విద్యుత్‌ను సరాఫరా చేయడంతో పాటు రైతుబీమా, రైతుబంధు పథకాలను ఇవ్వడం వల్ల మేము సంతోషంగా వ్యవసాయం చేయగల్గుతున్నం.
– మంతుర్తి కొమురయ్య, దామెర, ఎల్కతుర్తి మండలం

రైతుబాంధవుడు కేసీఆర్‌
కమలాపూర్‌, ఆగస్టు 2: రైతుల గురించి ఆలోచన చేసే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇచ్చిన మాట తప్పకుండా రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించడం సంతో షంగా ఉంది. నాకు ఎకరం వ్యవసాయ భూమి ఉంది. బ్యాంకులో 40వేలు క్రాప్‌ లోన్‌ తీసుకున్నా. ఎకరం భూమిలో పండించిన పంటతో లోన్‌ కట్టడం ఇబ్బందిగా ఉంది. కేసీఆర్‌ రైతులకు రుణమాఫీ చేసేందుకు ఆదేశాలు జారీ చేయడం ఆనందంగా ఉంది. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలతో మేలు చేస్తున్న కేసీఆర్‌ రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం మంచి విషయం. రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఏ ప్రభుత్వం ఇలా రైతుల కోసం పాటుపడలేదు. కేసీఆర్‌ వచ్చాకనే రైతులకు అన్ని విధాలా మేలు జరుగుతాంది.
– నీలం అర్జున్‌, ఉప్పల్‌

రైతులను పట్టించుకున్నది కేసీఆర్‌ ఒక్కరే..
ఐనవోలు, ఆగస్టు 2: రైతుల బాగుకోసం సీఎం కేసీఆర్‌ చేస్తున్నన్ని మంచి పనులు ఇప్పటివరకు ఏ సీఎం కూడా చేయలేదు. కనీసం ఆలోచించలేదు. ఒకప్పుడు రైతు పెట్టుబడి కోసం ఆడ్తి దుకాణం, బ్యాంక్‌కు అప్పు కోసం పోతే పుట్టనిచ్చే వాళ్లు కాదు. ఎందుకంటే అప్పు తిరిగి ఎట్లా కడుతావని అడిగేటోళ్లు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ సీఎం అయిన తర్వాతే రైతుల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది. కరోనా కల్లోలం వల్ల ఆర్థిక ఇబ్బందులతో కొంత ఆలస్యమైనా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తాన న్నరు. ఇచ్చిన మాట తప్పని సీఎం కేసీఆర్‌కు రైతులందరు రుణపడి ఉంటరు.
– పొన్నాల రాజు, ఒంటిమామిడిపల్లి

అన్నివిధాలా ఆదుకుంటున్నడు
ములుగు, ఆగస్టు 2(నమస్తేతెలంగాణ) : సీఎం కేసీఆర్‌ మా రైతులకు చాలా గొప్ప పనులు చేస్తున్నాడు. రైతుబంధు పెట్టి పెట్టుబడికి అప్పులు చేయకుండా చేసిండు. రైతుబీమా చేయించి రైతు కుటుంబాలకు అండగా నిలిచిండు. ఇప్పుడు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిండు. నేను 2010 నుంచి రుణం తీసుకుంటూ రెనివల్‌ చేస్తూ వస్తున్నాను. ప్రస్తుతం నా పేరు మీద రూ.60వేల రుణం ఉంది. సీఎం రుణమాఫీ చేస్తానని ఇయాల చెప్పగానే ఎంతో ఆనందం అయింది. రాష్ట్రంలోని రైతులందరికీ ఒకే తీరు న్యాయం చేస్తున్నడు. కేసీఆర్‌ సార్‌కు ధన్యవాదాలు.
– రైతు ఆళ్ల వీరయ్య, గోవిందరావుపేట మండలం

జీవితాంతం రుణపడి ఉంటం..
కృష్ణకాలనీ, ఆగస్టు 2 : ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నది సీఎం కేసీఆర్‌ ఒక్కరే. కరోనాతో కొంత ఆలస్యమైనప్పటికీ నేటి నుంచి విడతల వారీగా సెప్టెంబర్‌ 2వ వారం వరకు పూర్తి రుణమాఫీ చేస్తానని చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది. నేను నా పిల్లల పైచదువుల కోసం ఎస్‌బీఐ బ్యాంకుల్లో రూ.లక్ష రుణం తీసుకున్నా. ఏటా వడ్డీ కట్టుకుంటూ వస్తున్న. వడ్డీలు కట్టడం చాలా ఇబ్బందిగా ఉండేది. వ్యవసాయానికి పెట్టుబడి, రుణవడ్డీ కట్టడం ఇబ్బందయ్యేది. వ్యవసాయ పనులు జరుగుతున్న వేళ రైతులకు శుభవార్త చెప్పిండు. రుణమాఫీ చేస్తు న్న సీఎం కేసీఆర్‌కు మా కుటుంబమంతా రుణపడి ఉంటది
– నలిగేటి సతీశ్‌కుమార్‌ యాదవ్‌, కాశీంపల్లి, భూపాలపల్లి

రైతు కళ్లల్లో ఆనందం
పాలకుర్తి, ఆగస్టు 2 : రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషి మరువలేము. రైతుబంధు, రైతు బీమా పథకాలు అందించడమే గాక రైతులు ఇబ్బందులు పడవద్దని రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. దీంతో సన్న, చిన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. రైతుల కళ్లలో ఆనందం చూసేందుకే సీఎం కేసీఆర్‌ చేస్తున్న సాహసోపేత నిర్ణయం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ వచ్చిన తర్వాతనే రైతులకు మేలు జరిగింది.
– వీరమనేని యాకాంతరావు, పాలకుర్తి మండల రైతుబంధు కో-ఆర్డినేటర్‌

కేసీఆర్‌ మాట తప్పరు
గణపురం, ఆగస్టు 2 : నిజంగా ఇది రైతు ప్రభుత్వం. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రతి హామీని నెర్చవేర్చుతున్న మహనీయుడు. నేను కాకతీయ గ్రామీణ బ్యాంకులో రూ.లక్ష పంట రుణం తీసకున్న. ఆగస్టు 3వ తారీఖు నుంచి సెప్టెంబర్‌ 2వ వారంలోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడం చాలా సంతోషంగా ఉంది. వ్యవసాయ పనులు ముమ్మరమైన ఈ పరిస్థితుల్లో పెట్ట్టుబడికి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆగమవుతున్నా. ఈ సమయంలో రుణమాఫీ ఆదుకుంటున్నది. రుణమాఫీతో అప్పులు లేకుండా పోతాయి.
– మోతే కరుణాకర్‌రెడ్డి, గణపురం

ఇంతకన్నా ఏం కావాలె..
బచ్చన్నపేట, ఆగస్టు 2 : రైతుబాంధవుడు సీఎం కేసీఆర్‌ సార్‌. పంటలు సాగు చేసింది మొదలు కోసి అమ్మేదాంక వెంటే ఆసరా అయితాండు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినకాన్నుంచే వ్యవసాయం పండుగ అయింది. ప్రతీ రైతు రాజు లెక్క దర్జాగా బతుకుతున్నడు. రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోకుంట జేసిండు. ఆయనే పంటలకు పెట్టుబడి ఇస్తుండు. నిండుగా కరంటు ఇస్తుండు. రైతుబీమా ఇస్తుండు. వడ్లు ఊళ్లెనే కొనేటట్లు చేసిండు. ఇప్పుడు రుణమాఫీ చేస్తామని ప్రకటించిండు. ఇంత కన్నా ఏం కావాలె రైతుకు. ఆయన నిజంగా రైతుల పాలిట దేవుడే. ఆయన వెంటే ఉంటం.
– మినలాపురం సిద్దిలింగం, కొడవటూరు, బచ్చన్నపేట మండలం

భరోసా కలిగింది..
రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకొని అమలుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించడం చాలా మంచి విషయం. రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటున్నది. బ్యాంకు రుణాల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. రుణమాఫీ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవడం గొప్ప విషయం. రుణమాఫీ చేయడం వల్ల రైతులకు ఎంతో భరోసా కలిగినట్లే. ఒక రైతుగా నేను చాలా సంతోషిస్తున్నా. సీఎం కేసీఆర్‌కు రైతులు రుణపడి ఉంటారు.
– మార్కె రాజు, పాలంపేట, వెంకటాపూర్‌ మండలం

మాఫీ ప్రకటన సంతోషాన్నిచ్చింది..
మహదేవపూర్‌, ఆగస్టు 2 : రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకొని రైతుల పాలిట దేవుడయ్యాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇస్తున్న రైతుబంధు, ఉచిత విద్యుత్‌, పుష్కలంగా సాగునీరు, రైతుబీమాతో రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పడం సంతో షం. రైతుల ఇబ్బందులు తీరుతాయి. ఇదివరకున్న ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలే. రైతులకు ఇబ్బంది లేకుండా తెలంగాణ సర్కార్‌ నిరంతరం కృషి చేస్తాంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో రైతులు బాగుపడుతున్నరు.
– ఎర్రవెల్లి శంకర్‌రావు, బ్రాహ్మణపల్లి

ఆర్థిక భరోసా ఇచ్చారు..
నర్సింహులపేట, ఆగస్టు 2 : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడం చాలా సంతో షంగా ఉంది. రైతులకు ఇప్పటివరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నా రు. ఇప్పటికే రైతుబంధు ఇవ్వడం, పంట నష్ట పరిహారం అందిస్తున్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను గుర్తించి వ్యవసాయా ధికారులు నష్టాన్ని అంచనా వేశారు. వారికి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు చర్యలు తీసుకొని రైతులకు ధైర్యం ఇస్తున్నారు.
– కొండ్రెండి సోమిరెడ్డి, నర్సింహులపేట

 

 

Related Articles

Back to top button