Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TS Inter 1st and 2nd Year Result 2023 || Telangana Inter Result 2023 Download || AP Inter Results 2023

TS మే రెండో వారంలో ఇంటర్ ఫలితాలు 2023 || AP Inter Results 2023

 

 

 

 

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు మే నౄల రెండోవారంలో విడుదల చేసే అవకాశముందని సమాచారం.

ఎప్రిల్ 24 నుంచి పలు జిల్లాల్లో వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే తెలుగు, హిందీతో పాటు చిన్నచిన్న సబ్జెక్టుల వాల్యూయేషన్ పూర్తికాగా, ఎప్రిల్ 25తో పూర్తి స్థాయి స్పాట్ వాల్య్యూషన్ ముగియనున్నది.

 

 

ఈ ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ కలిపి సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక

 

 

TS Inter Results 2023 Date

 

 

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు (Telangana Inter Exams 2023) ముగిసిన విషయం తెలిసిందే. సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులకు గాను 4,02,630 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ కలిపి సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక పరీక్షలు ముగిసిన నేపథ్యంలో అధికారులు జవాబు పత్రాల మూల్యాంకనంపై దృష్టిసారించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రారంభమైన వాల్యుయేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

 

 

 

ఈ నేపథ్యంలో విద్యార్థుల దృష్టి ఫలితాలపై పడింది. ఎప్పుడెప్పుడు రిజల్ట్స్‌ వస్తాయా అన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజా సమాచారం ప్రకారం తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేయడానికి తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను రెండు మూడు రోజుల వ్యవధిలోనే విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

AP Inter Results 2023 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ వార్షిక పరీక్షలు మార్చి 15న ప్రారంభమై.. ఇప్పటికీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 3తో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 4తో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియనున్నాయి. ఈనేపథ్యంలో ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, గణితం, సివిక్స్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది.

ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు..?
ఏపీలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా.. మార్చి 27న సెకండియర్ ఫిజిక్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి ఇంగ్లిష్ మీడియం పేపర్లో తప్పులు దొర్లినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 2 మార్కులు కలపుతామని బోర్డు ప్రకటించింది. ఫిజిక్స్ పేపర్ 2లోని మూడో ప్రశ్న తప్పుగా ఇచ్చినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది.

ఏపీ ఇంటర్‌ తెలుగు మీడియం ప్రశ్నపత్రంలో 3వ ప్రశ్నగా ఆయస్కాంత ప్రవణత (అవపాతము)ను నిర్వచించుము..? అని రాగా.. ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రంలో డిఫైన్ మ్యాగ్నటిక్ డెక్లినేషన్ అని తప్పుగా ప్రచురితమైంది. దానికి బదులుగా డిఫైన్ మ్యాగ్నటిక్ ఇన్‌క్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ అని రావాల్సి ఉంది.

 

 

దీనికి పరీక్ష కేంద్రాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి సందేశాలు పంపించారు. కొన్నిచోట్ల ఆ విషయం విద్యార్థులకు చెప్పగా.. మరికొన్నిచోట్ల ఆ విషయం వారికి చేరలేదు. దీంతో ప్రశ్న తప్పుగా రావడాన్ని పరిగణనలోకి తీసుకొని ఇంటర్మీడియట్ సెకండియర్‌ భౌతికశాస్త్రం పరీక్షలో ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులకు 2 మార్కులను కలపనున్నారు. ప్రశ్నపత్రంలోని మూడో ప్రశ్నకు జవాబు రాసినా, రాయకపోయినా 2 మార్కులు ఇవ్వాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button