Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
School holidays till October-12.. announced by Education Department 2023
అక్టోబర్-12 వరకు స్కూళ్లకు సెలవులు.. ప్రకటించిన విద్యాశాఖ
స్కూల్ పిల్లలకు తమిళనాడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
స్కూల్ పిల్లలకు తమిళనాడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు త్రైమాసిక సెలవులను పెంచినట్లు ప్రకటించింది. మొదట సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు 5 రోజుల పాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వాటిని మరో 6 రోజుల పాటు అదనంగా పెంచింది. ఉపాధ్యాయులకు రెండో సెమిస్టర్‌పై శిక్షణ జరుగుతుండడంతో ఈ సెలవులు పొడిగించారు. అంతే కాకుండా.. అదే టైంలో 6-8 తరగతి విద్యార్థులకు కూడా గతంలో ప్రకటించినట్లు గానే సెలవులు ఉంటాయని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. అయితే.. మళ్లి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు అక్టోబర్ 10 నుంచి 12 వ తేదీ వరకు జరగనున్నాయి. కనుక 1-5 తరగతుల స్కూల్ పిల్లలకు అక్టోబర్-13 వ తేదీ నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం అవుతాయి.
లుగు రాష్ట్రాల్లో అక్టోబర్ నెలలో భారీగా సెలవులు
అక్టోబర్ నెలలో ముఖ్యమైన పండుగలు ఉండటంలో తెలుగు రాష్ట్రాల్లోనే సెలవుల జాతర కొనసాగనుంది. దసరా, బతుకమ్మ సందర్భంగా తెలంగాణలో అక్టోబర్-14 నుంచి 25 వరకు స్కూళ్లకు, కాలేజీలకు 13 రోజులు సెలవులు ప్రకటించారు. తిరిగి అక్టోబర్-26న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో దసరా సందర్భంగా.. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌కు అక్టోబర్-14 నుంచి 24 వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు.