Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Six guarantees.. Applications from 28th of this month.. These are the requirements

ఆరు గ్యారెంటీలు.. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు.. కావలసినవి ఇవే

 

 

ఆరు గ్యారెంటీలు.. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు.. కావలసినవి ఇవే

 

రాష్ట్రప్రభుత్వం అమలుచేయబోతున్న ఆరు గ్యారెంటీలకు రేషన్‌ కార్డునే ప్రామాణికంగా తీసుకొంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

 

 

  • రేషన్‌కార్డు ఆధారంగానే దరఖాస్తులు
  • 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన
  • ఊరూరా అధికారుల బృందం పర్యటన
  • సభలు పెట్టి దరఖాస్తుల స్వీకరణ
  • జనవరి 6 తర్వాత కూడా తీసుకొంటాం
  • ధరణి మంచిదే.. మార్పులు చేస్తాం
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి

 

రాష్ట్రప్రభుత్వం అమలుచేయబోతున్న ఆరు గ్యారెంటీలకు రేషన్‌ కార్డునే ప్రామాణికంగా తీసుకొంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహించి, ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. ఈ పథకాలకు విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని, ప్రస్తుతానికి తెల్లరేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

 

 

 

రేషన్‌కార్డు ఉన్నవారి అర్హతల ఆధారంగా దరఖాస్తు తీసుకుంటామని చెప్పారు. కొత్త రేషన్‌ కార్డులకు, రైతుబంధుకు కూడా ఇక్కడే దరఖాస్తులు తీసుకోబోతున్నట్టు తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి మీడియాకు వివరించారు.

 

 

 

 

 

 

 

Related Articles

Back to top button