Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Telangana Group-4 Jobs 2022 త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్‌.. నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి హరీశ్ రావు

Telangana Govt Jobs: తెలంగాణలో ఇప్పటికే పోలీస్ ఉద్యోగాలు, టీఎస్‌ఎస్పీడీసీఎల్, గ్రూప్-1 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ కూడా విడుదలకానుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్థికమంత్రి హరీష్ రావు వెల్లడించారు.

 

 

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1.35 లక్షల ఉద్యోగాల నియామకం పూర్తిచేశామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మరో 91 వేల ఉద్యోగాలను ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారని.. వాటి భర్త ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

 

 

బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో… పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి హరీశ్‌రావు రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇకపై ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని చెప్పారు.

 

సీఎం కేసీఆర్ ప్రకటించిన 91 వేల ఉద్యోగాల్లో… ఇప్పటికే 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. త్వరలోనే మరో 9,200 గ్రూప్‌-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏడాదిలోపే ఈ ఉద్యోగాలన్నీ భర్తీచేస్తామని చెప్పారు.

 

 

ఇక నుంచి ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ను రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆ మేరకు ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై ఏటా ఉద్యగాల నియామకం ఉంటుందని చెప్పారు.

 

పోలీస్‌ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అన్ని ఉద్యోగాల్లోనూ స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ ఇస్తున్నామని ఆయన చెప్పారు.

 

యువత చిత్తశుద్ధితో చదివితేనే లక్ష్యాన్ని చేరుకోగలరని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఉద్యోగార్థులు కొన్నిరోజులు తాత్కాలిక ఆనందాలను పక్కనబెట్టి.. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండి… దీర్ఘకాలిక లక్ష్యం కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button