Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Telangana Group-I 2 3 4 exams full details 2022 || Telangana government jobs notifications 2022

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?​​​​​​​  

 

 

 

 

 

TSPSC పరీక్షా విధానంలో మార్పులు.. 900 మార్కులతో గ్రూప్‌ 1

 

  • 900 మార్కులతో గ్రూప్‌ 1
  • ఇంటర్వ్యూ రద్దు నేపథ్యంలో పరీక్షా విధానంలో మార్పులు
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

గ్రూప్స్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల్లో ఇంటర్వ్యూలను (మౌఖిక పరీక్షలు) తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్‌–1, గ్రూప్‌–2లో ఇప్పటివరకు రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలుండేవి. దీనివల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందన్న భావనతో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భర్తీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలవుతుందని భావించి ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష విధానంలో జరిగే మార్పులపై టీఎస్‌పీఎస్సీ సమర్పించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సోమవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జీఓ నంబర్‌ 55ను జారీ చేశారు. గతంలో మొత్తం 1,000 మార్కులకు ఉండే గ్రూప్‌–1 పరీక్షను (ఇంటర్వ్యూ 100 మార్కులు పోను) 900 మార్కులకు.

చ‌ద‌వండి: TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?​​​​​​​  

గ్రూప్‌–1 సర్వీసెస్‌

డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్, కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్, రీజినల్‌ ట్రాన్‌ ్సపోర్ట్‌ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, డివిజినల్‌ ఫైర్‌ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, మున్సిపల్‌ కమిషనర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఎస్సీడీడీ), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (బీసీడబ్ల్యూఓ), జిల్లా గిరిజన సంక్షేమాధికారి, జిల్లా ఉపాధి కల్పనాధికారి, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌), అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, శిక్షణ కళాశాలలో అసిస్టెంట్‌ లెక్చరర్, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్, మండల పరిషత్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌.

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మొత్తం మార్కులు: 900

సబ్జెక్ట్‌సమయం (గంటలు)గరిష్ట మార్కులు 
ప్రిలిమినరీ టెస్ట్‌ (జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ)2 1/2150
రాత పరీక్ష (మెయిన్‌ ) (జనరల్‌ ఇంగ్లిష్‌)(అర్హత పరీక్ష)3150
మెయిన్‌ పేపర్‌–1 జనరల్‌ ఎస్సే

  1. సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు
  2. ఆర్థికాభివృద్ధి మరియు న్యాయపరమైన (జస్టిస్‌) సమస్యలు
  3. డైనమిక్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌
  4. భారతదేశ చారిత్రక మరియు సాంస్కతిక వారసత్వ సంపద
  5. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి
  6. విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి
3150
పేపర్‌–2 హిస్టరీ, కల్చర్‌ అండ్‌ జియోగ్రఫీ      

  1. భారతదేశ చరిత్ర మరియు సంస్కతి (1757–1947)
  2. తెలంగాణ చరిత్ర మరియు వారసత్వ సంపద
  3. జియోగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ
3150
పేపర్‌–3  ఇండియన్‌  సొసైటీ, కానిస్టిట్యూషన్‌  అండ్‌ గవర్నెన్స్‌

  1. భారతీయ సమాజం, నిర్మాణం మరియు సామాజిక ఉద్యమం
  2. భారత రాజ్యాంగం
  3. పాలన
3150
పేపర్‌–4 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌  

  1. భారతీయ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
  2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
  3. అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు
3150
పేపర్‌–5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌     

  1. శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర, ప్రభావం
  2. మెడరన్‌  ట్రెండ్స్‌ ఇన్‌  అప్లికేషన్‌  ఆఫ్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ సైన్స్‌
  3. డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌  అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌
3150
పేపర్‌–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం 

  1. ది ఐడియా ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఆలోచన 1948–1970)
  2. మొబిలైజేషన్‌ ఫేజ్‌ (మద్దతు కూడగట్టే దశ 1971–1990)
  3. టువర్డ్స్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఏర్పాటు దిశగా 1991–2014)
3150

 Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌​​​​​​​

పరీక్ష విధానం..

  • ముందుగా ప్రిలిమినరీ టెస్ట్‌లో అర్హత సాధించాలి. అందులో అర్హత సాధించిన వారు మెయిన్‌ పరీక్షకు ఎంపికవుతారు. ప్రిలిమినరీ పరీక్ష ద్వారా ఎలాంటి ర్యాంకులు జారీ చేయరు. ప్రిలిమినరీ పరీక్ష తెలుగు,ఇంగ్లిష్,ఉర్దూ భాషలో నిర్వహిస్తారు.
  • ఉద్యోగ ఖాళీల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థులను మల్టీజోన్ల వారీగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ల ప్రకారం మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు.
  • మెయిన్‌  పరీక్షను జనరల్‌ ఇంగ్లిష్‌ కాకుండా ఇతర పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషలో నిర్వహిస్తారు. సమాధానాలను అభ్యర్థి ఎంపిక చేసుకునే భాష ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది.
  • జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్ష పదో తరగతి సబ్జెక్ట్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇందులో ఓసీలు, స్పోర్ట్స్‌ మెన్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 40 శాతం కంటే తక్కువ కాకుండా, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం కంటే తక్కువ కాకుండా మార్కులు రావాలి. ఈ పరీక్షలో వచ్చే మార్కులను కూడా ర్యాంకులకు పరిగణనలోకి తీసుకోరు.

 

APPSC/TSPSC: గ్రూప్‌–1, గ్రూప్‌–2లలో ఇంగ్లిష్‌ ప్రాధాన్యం… పట్టు సాధించండిలా!

 

 

గ్రూప్‌–1 సర్వీసెస్‌.. మెయిన్‌ ఎగ్జామినేషన్‌.. గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియలో నిర్వహించే నిర్ణయాత్మక రాత పరీక్ష! ఏపీలో అయిదు పేపర్లుగా.. తెలంగాణలో ఆరు పేపర్లుగా.. గ్రూప్‌ 1 మెయిన్‌ నిర్వహిస్తున్నారు. ఈ పేపర్లకు అదనంగా.. అభ్యర్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన లాంగ్వేజ్‌ పేపర్‌.. ఇంగ్లిష్‌! ఈ పేపర్‌లో.. నిర్దిష్ట శాతంతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అలా ఉత్తీర్ణత సాధిస్తేనే.. మెయిన్‌ ఎగ్జామ్‌లోని మిగతా పేపర్లలోని మార్కులను గణించి.. తుది విజేతలను ప్రకటిస్తారు మరోవైపు..గ్రూప్‌–2లోనూ బేసిక్‌ ఇంగ్లిష్‌ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు! ఈ నేపథ్యంలో.. గ్రూప్‌–1, గ్రూప్‌–2లలో ఇంగ్లిష్‌ ప్రాధాన్యం, ఈ సబ్జెక్ట్‌పై పట్టు సాధించడమెలాగో తెలుసుకుందాం…

  • గ్రూప్‌–1 మెయిన్‌లో అర్హత పేపర్లుగా ఇంగ్లిష్, తెలుగు
  • వీటిలో కనీస అర్హత మార్కులు సాధించాలనే నిబంధన
  • గ్రూప్‌–2లోనూ ఇంగ్లిష్‌ నుంచి ప్రశ్నలు వస్తున్న వైనం
  • అభ్యర్థులు నిర్లక్ష్యం చేయకూడదంటున్న సబ్జెక్ట్‌ నిపుణులు
  • ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్‌–1 మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో అర్హత పేపర్లుగా ఇంగ్లిష్, తెలుగు పేపర్లు ఉంటాయి. అదే విధంగా టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్‌–1 మెయిన్‌ పరీక్షల్లో అర్హత పరీక్షగా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ ఉంటుంది. 150 మార్కులకు నిర్వహించే ఈ పేపర్‌లోనూ.. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులతో, రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం మార్కులతో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉంది. అంటే.. లాంగ్వేజ్‌ పేపర్లలో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 60 మార్కులు, రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 52.5 మార్కులు కచ్చితంగా సాధించాల్సిందే. అప్పుడే మిగతా పేపర్లలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని.. మెరిట్‌ జాబితా రూపొందిస్తారు.
  • అర్హత పేపర్లుగా నిర్దేశించిన ఇంగ్లిష్, తెలుగు లాంగ్వేజ్‌ పేపర్లలో పొందిన మార్కులను మెరిట్‌ జాబితా రూపకల్పనలో కలపరు. కానీ ఈ పేపర్లలో నిర్దిష్ట మార్కులు పొందితేనే మిగతా పేపర్లలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
  • గ్రూప్‌–1 మెయిన్స్‌లో లాంగ్వేజ్‌ పేపర్లకు ఉన్న ప్రాధాన్యతను తెలిపే నిబంధనలివి.
  • ఇక గ్రూప్‌–2లోనూ ఇంగ్లిష్‌కు సంబంధించిన నైపుణ్యాన్ని పరిశీలించే విధంగా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో పది ప్రశ్నల వరకు అడుగుతున్నారు.
  • అభ్యర్థులు ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ విషయంలో ఎక్కువ ఆందోళనకు గురవుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు, తెలుగు మీడియం నేపథ్యం ఉన్న వారిలో ఈ సమస్య కొంత ఎక్కువే. కొద్దిపాటి మెళకువలతో ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ పేపర్‌లో రాణించొచ్చని, కనీస అర్హత మార్కులు సొంతం చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

 

TSPSC గ్రూప్‌–2 పరీక్ష 600 మార్కులకు కుదింపు… పరీక్షా విధానం ఇదే!

 

గ్రూప్స్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల్లో ఇంటర్వ్యూలను (మౌఖిక పరీక్షలు) తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్‌–1, గ్రూప్‌–2లో ఇప్పటివరకు రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలుండేవి. దీనివల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందన్న భావనతో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భర్తీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలవుతుందని భావించి ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష విధానంలో జరిగే మార్పులపై టీఎస్‌పీఎస్సీ సమర్పించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సోమవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జీఓ నంబర్‌ 55ను జారీ చేశారు. గతంలో మొత్తం 675 మార్కులకు ఉండే గ్రూప్‌–2 పరీక్షను (ఇంటర్వ్యూ 75 మార్కులు పోను) 600 మార్కులకు కుదించారు.

చ‌ద‌వండి: TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?​​​​​​​  

గ్రూప్‌–2 పోస్టులు

మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్‌ (నాయిబ్‌ తహసీల్దార్‌), సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2, జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (కో–ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌), అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కో–ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌), అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (మండల పంచాయతీ అధికారి), ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (పీఆర్‌), అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌), ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఎండోమెంట్‌), అసిస్టెంట్‌ సెక్షన్‌  ఆఫీసర్‌ (సెక్రెటేరియట్, లెజిస్లేచర్, ఫైనాన్స్‌, లా).

 

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మొత్తం మార్కులు: 600

రాతపరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌)

 

పేపర్‌సబ్జెక్ట్‌ప్రశ్నలుసమయం (గంటలు)మార్కులు
1జనరల్‌ స్టడీస్, జనరల్‌ సైన్స్‌1502 1/2150
2హిస్టరీ, పాలిటీ     అండ్‌ సొసైటీ   

  1. భారతదేశ మరియు తెలంగాణ సామాజిక సాంస్కతిక చరిత్ర
  2. భారత రాజ్యాంగం మరియు రాజకీయాల పర్యావలోకనం (ఓవర్‌ వ్యూ)
  3. సోషల్‌ స్ట్రక్చర్, ఇష్యూస్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీస్‌
1502 1/2150
3ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌      

  1. భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్లు
  2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
  3. ఇష్యూస్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజెస్‌
1502 1/2150
4తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం                        

  1. తెలంగాణ ఆలోచన పుట్టుక (1948–1970)
  2. మద్దతు కూడగట్టే దశ (1971–1990)
  3. తెలంగాణ ఏర్పాటు దిశగా..(1991–2014)
1502 1/2150

(ఈ పరీక్షలను తెలుగు,ఇంగ్లిష్,హిందీలో నిర్వహిస్తారు)

 

 

TSPSC గ్రూప్‌–3 పరీక్షా విధానం ఇదే!

 

 

గ్రూప్స్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల్లో ఇంటర్వ్యూలను (మౌఖిక పరీక్షలు) తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్‌–1, గ్రూప్‌–2లో ఇప్పటివరకు రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలుండేవి. దీనివల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందన్న భావనతో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భర్తీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలవుతుందని భావించి ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష విధానంలో జరిగే మార్పులపై టీఎస్‌పీఎస్సీ సమర్పించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సోమవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జీఓ నంబర్‌ 55ను జారీ చేశారు. గతంలో మొత్తం 675 మార్కులకు ఉండే గ్రూప్‌–2 పరీక్షను (ఇంటర్వ్యూ 75 మార్కులు పోను) 600 మార్కులకు కుదించారు.

గ్రూప్‌–3 సర్వీసెస్‌

సీనియర్‌ అకౌంటెంట్, ఆడిటర్‌ (పే అండ్‌ అకౌంట్స్‌), సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ), సీనియర్‌ ఆడిటర్, అసిస్టెంట్‌ ఆడిటర్, జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అకౌంటెంట్‌.

 

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మార్కులు: 450

పేపర్‌సబ్జెక్ట్‌ ప్రశ్నలుసమయం (గంటలు)మార్కులు
1జనరల్‌ స్టడీస్, జనరల్‌ సైన్స్‌1502 1/2150
2హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ

  1. సోషియో కల్చరల్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ
  2. ఓవర్‌వ్యూ ఆఫ్‌ ది ఇండియన్‌ కానిస్టిట్యూషన్‌  అండ్‌ పాలిటిక్స్‌
  3. సోషల్‌ స్ట్రక్చర్‌. ఇష్యూస్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీస్‌
1502 1/2150
3ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌    

  1. ఇండియన్‌  ఎకానమీ ఇష్యూస్‌ అండ్‌ ఛాలెంజెస్‌
  2. ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ తెలంగాణ
  3. ఇష్యూస్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజెస్‌
1502 1/2150

(ఈ పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్, హిందీలో నిర్వహిస్తారు).

 

 

 

TSPSC గ్రూప్‌–4 సర్వీసెస్‌ ఇవే… పరీక్ష విధానం కోసం చూడండి

group 4 services and exam pattern
group 4 services and exam pattern

గ్రూప్స్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల్లో ఇంటర్వ్యూలను (మౌఖిక పరీక్షలు) తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్‌–1, గ్రూప్‌–2లో ఇప్పటివరకు రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలుండేవి. దీనివల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందన్న భావనతో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భర్తీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలవుతుందని భావించి ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష విధానంలో జరిగే మార్పులపై టీఎస్‌పీఎస్సీ సమర్పించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సోమవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జీఓ నంబర్‌ 55ను జారీ చేశారు. గతంలో మొత్తం 675 మార్కులకు ఉండే గ్రూప్‌–2 పరీక్షను (ఇంటర్వ్యూ 75 మార్కులు పోను) 600 మార్కులకు కుదించారు.

గ్రూప్‌–4 సర్వీసెస్‌

వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు

 

 

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ మొత్తం మార్కులు: 300

పేపర్‌సబ్జెక్ట్‌ప్రశ్నలుసమయం (ని.)మార్కులు
1జనరల్‌ స్టడీస్‌150150150
2సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌150150150

గెజిటెడ్‌ కేటగిరీ (గ్రూప్‌–1, గ్రూప్‌–2 పరిధిలోకి రానివి)

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మొత్తం మార్కులు: 450

రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌)ప్రశ్నలుసమయం(ని.)మార్కులు
పేపర్‌–1150150150
జనరల్‌ స్టడీస్‌ మరియు జనరల్‌ ఎబిలిటీస్‌పేపర్‌–2150150300
  • కమిషన్‌ సూచించిన సబ్జెక్టులు

నాన్‌  గెజిటెడ్‌ కేటగిరీ (గ్రూప్‌–2, 3, 4 పరిధిలోకి రాని పోస్టులు) 

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌: మొత్తం మార్కులు 300

రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌)ప్రశ్నలుసమయం (ని.)మార్కులు
పేపర్‌–1150150150
జనరల్‌ స్టడీస్‌ మరియు జనరల్‌ ఎబిలిటీస్‌ పేపర్‌–2150150150
  • నిర్దేశించిన సబ్జెక్టులు

మిసలీనియస్‌ కేటగిరీస్‌ అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మార్కులు 650

క్రమ సంఖ్యసబ్జెక్టుప్రశ్నలుసమయం (ని.)మార్కులు
1జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌100100100
2జనరల్‌ స్టడీస్‌ పేపర్‌150150150
3ఆప్షనల్‌ పేపర్‌–1100100200
4ఆప్షనల్‌ పేపర్‌–2100100200

ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మార్కులు 450

క్రమ సంఖ్యసబ్జెక్టుప్రశ్నలుసమయం (ని.)మార్కులు
1జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌100100100
2మ్యాథమేటిక్స్‌ పేపర్‌100100100

⦁    (జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్, మ్యాథమెటిక్స్‌ పరీక్షల మార్కులను ర్యాంకింగ్‌లోకి పరిగణించరు)

క్రమ సంఖ్యసబ్జెక్టుప్రశ్నలుసమయం (ని.)మార్కులు
1జనరల్‌ స్టడీస్‌ పేపర్‌150150150
2ఆప్షనల్‌ పేపర్‌ (ఒక్కటే)150150300

జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మార్కులు 450

క్రమ సంఖ్యసబ్జెక్టు ప్రశ్నలుసమయం (ని.)మార్కులు
1పేపర్‌–1 జనరల్‌ స్టడీస్‌150150150
2పేపర్‌–2 ఇంగ్లిష్‌150150150
3.పేపర్‌–3 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌150150150

సూపర్‌వైజర్‌/ మ్యాట్రన్‌  గ్రేడ్‌–2 (జువైనల్‌ వెల్ఫేర్‌)

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌  : మార్కులు 300

పేపర్‌సబ్జెక్ట్‌ప్రశ్నలుసమయం (ని.)మార్కులు
1జనరల్‌ స్టడీస్‌150150150
2సంబంధిత సబ్జెక్టు150150150
  • (జనరల్‌ స్టడీస్‌ సబ్జెక్ట్‌: పదో తరగతి వరకు హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కరెంట్‌ అఫైర్స్, బాలల హక్కులు, చట్టాలకు సంబధించిన అంశాలుంటాయి)

అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్‌

స్కీం ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మార్కులు 300

పేపర్‌సబ్జెక్టుసమయం(ని.)ప్రశ్నలుమార్కులు
1జనరల్‌ స్టడీస్‌ జనరల్‌ ఎబిలిటీస్‌150150150
2ట్రాన్స్‌లేష‌న్‌90150

వివిధ శాఖల్లో సీనియర్‌ రిపోర్టర్‌ ఇంగ్లిష్‌/ తెలుగు/ ఉర్దూ

స్కీం ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ 
సీనియర్‌ రిపోర్టర్‌ (ఇంగ్లిష్‌)
పేపర్‌: ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌ డిక్టేష‌న్‌ –150 వర్డ్స్‌ పర్‌ మినిట్‌ డ్యూరేషన్‌: 7 మినిట్స్, 150 మార్కులు
(ట్రాన్‌స్క్రిప్షన్‌  ఇన్‌  లాంగ్‌ హ్యాండ్‌–90 నిమిషాలు)

సీనియర్‌ రిపోర్టర్‌ (తెలుగు)
పేపర్‌: తెలుగు షార్ట్‌హ్యాండ్‌ డిక్టేష‌న్‌ –80 వర్డ్స్‌ పర్‌ మినిట్, డ్యూరేషన్‌–7 నిమిషాలు, 150 మార్కులు
(ట్రాన్‌స్క్రిప్షన్‌  ఇన్‌  లాంగ్‌ హ్యాండ్‌–90 నిమిషాలు)

సీనియర్‌ రిపోర్టర్‌ (ఉర్దూ)
పేపర్‌: ఉర్దూ షార్ట్‌హ్యాండ్‌ డిక్టేష‌న్‌ – 130 వర్డ్స్‌ పర్‌ మినిట్‌ డ్యూరేషన్‌7 నిమిషాలు, 150 మార్కులు
(ట్రాన్‌స్క్రిప్షన్‌  ఇన్‌  లాంగ్‌ హ్యాండ్‌– 90 నిమిషాలు)

ఇంగ్లిష్‌ రిపోర్టర్‌ ఇన్‌  లెజిస్లేచర్‌ సర్వీస్‌

రాత పరీక్ష (కన్వెన్షనల్‌ టైప్‌)

సీనియర్‌ రిపోర్టర్‌ (ఇంగ్లిష్‌)
పేపర్‌: ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌ డ్యూరేషన్‌–180 వర్డ్స్‌ పర్‌ మినిట్‌ డ్యూరేషన్‌: 5 మినిట్స్, 150 మార్కులు
(ట్రాన్‌స్క్రిప్షన్‌  ఇన్‌  లాంగ్‌ హ్యాండ్‌– 90 నిమిషాలు)

అర్హత మార్కులు

  • నిర్దేశించిన ఉద్యోగాలకు సంబంధించి స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ప్రకారం అభ్యర్థి అన్ని పరీక్షలకు తప్పకుండా హాజరై అర్హత సాధించాలి.
  • కేటగిరీల వారీగా అన్ని పేపర్లలో ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్‌ సర్వీస్‌మెన్, స్పోర్ట్స్‌మెన్‌లు కనీసం 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button