Telangana Runamafi 2023
అర్హులందరికీ రైతు రుణమాఫీ
అర్హులందరికీ రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని, అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో వానకాలం పంటల పరిస్థితి, యాసంగి సాగుకు సన్నద్ధం, రుణమాఫీ అమలు, ఆయిల్‌పామ్ సాగుపై బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడారు.
- ఇప్పటివరకు 21.35 లక్షల మంది రుణాలు మాఫీ రూ.11,812 కోట్లు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం
- 040-23243667లో సందేహాలకు సంప్రదించాలి
- ఈ వానకాలంలో రికార్డు స్థాయిలో వరి సాగు
- వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి
తు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని, అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో వానకాలం పంటల పరిస్థితి, యాసంగి సాగుకు సన్నద్ధం, రుణమాఫీ అమలు, ఆయిల్‌పామ్ సాగుపై బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడారు. ఇప్పటివరకు 21.35 లక్షల మంది రైతులకు చెందిన రూ.11,812.14 కోట్ల రుణాలను మాఫీ చేసినట్టు వివరించారు. బ్యాంకు ఖాతాలు మూతపడి, కొన్ని సాంకేతిక కారణాలతో కొంతమంది రైతుల రుణమాఫీ నగదు బ్యాంకుల నుంచి వెనక్కి వెళ్లిందని తెలిపారు. ఆయా రైతుల సమస్యలను పరిష్కరించి రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. రుణమాఫీపై సందేహాలున్న రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని, సందేహాల నివృత్తి కొరకు రాష్ట్ర స్థాయిలో 040-23243667 నంబరులో సంప్రదించాలని సూచించారు.
యాసంగి సాగు అంచనా.. 80 లక్షల ఎకరాలు
యాసంగిలో సుమారు 80 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. నిరుడు యాసంగిలో 74 లక్షల ఎకరాల్లో సాగైందని వివరించారు. ఈ వానకాలంలో ఇప్పటివరకు 65 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయిందని, తెలంగాణ చరిత్రలో ఇది రికార్డ్ అని తెలిపారు. ఒక నాగర్‌కర్నులు జిల్లాలో గతం కన్నా 24 వేల ఎకరాల్లో అధికంగా వరి సాగయిందని చెప్పారు. ఇప్పటివరకు 1.26 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు కాగా, మరో 12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయని, 1.93 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగయిందని వివరించారు.
యాసంగికి 18.64 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు
ఈ యాసంగికి అన్ని రకాల ఎరువులు కలిపి 18.64 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని కేంద్రానికి నివేదించగా 9.2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని తెలిపారు. గత యాసంగి కన్నా సాగు పెరిగే అవకాశం ఉన్నందున 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు పెండింగులో ఉన్న రైతుబీమా క్లెయిములన్నీ వేగంగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ, అదనపు సంచాలకుడు విజయ్‌కుమార్, అగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు.