Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TREIRB Recruitment Results 2023

అభ్యర్థులకు అలర్ట్.. తుది కీ విడుదలపై గురుకుల బోర్డు కసరత్తు.. ముందుగా ఆ ఫలితాలు విడుదల..

 

 

సీబీఆర్‌టీ పరీక్షల తుది కీ వెల్లడికి నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణుల బృందం పరిశీలిస్తోంది. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసి, నెలాఖరుకు తుదికీ సిద్ధం చేయనుంది.

 

 

తెలంగాణలో గురుకుల పరీక్షలను(Gurukul Exam) ఆగస్టు 01వ తేదీ నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే వీటి పరీక్షలకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్(Response Sheet) ను ఆగస్టు 23వ తేదీన విడుదల చేశారు.

 

 

ఆగస్టు 03 నుంచి ఆగస్టు 19 వరకు నిర్వహించిన వివిధ విభాగాల పరీక్షలకు సంబంధించి అబ్జెక్షన్స్ కు చివరి తేదీ ఆగస్టు 25తో ముగిసింది. ఆగస్టు 21 నుంచి ఆగస్టు 23వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి కీని ఆగస్టు 24న విడుదల చేయగా.. వీటి అబ్జెక్షన్స్ కు ఆగస్టు 26వరకు అవకాశం కల్పించారు.

 

 

ఇదిలా ఉండగా.. అత్యంత వేగంగా గురుకుల పరీక్షలకు సంబంధించి ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో అర్హత పరీక్ష లను కేవలం మూడు వారాల వ్యవధిలో నిర్వహిం చి రికార్డు సృష్టించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ ఈఐఆర్బీ)… చివరి పరీక్ష రోజునే ప్రాథమిక కీలను విడుదల చేసింది.

 

తాజాగా   సీబీఆర్‌టీ పరీక్షల తుది కీ వెల్లడికి నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణుల బృందం పరిశీలిస్తోంది. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసి, నెలాఖరుకు తుదికీ సిద్ధం చేయనుంది.

 

 

సబ్జెక్టు నిపుణుల బృందం నిర్ణయమే తుది నిర్ణయమని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో తుదికీ వచ్చిన వెంటనే అభ్యర్థుల మార్కులు ప్రకటిస్తారు. ఈ నెలాఖరు నుంచి వరుసగా ఒక్కోరోజు ఒక్కో పోస్టు తుదికీ, మార్కులు వెల్లడించాలని బోర్డు నిర్ణయించింది.

 

 

మార్కుల వెల్లడి అనంతరం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేసి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనుంది. నియామక నిబంధనల ప్రకారం డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్లు, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లకు డెమో తరగతులు ఉన్నాయి.

 

 

ఇవి పూర్తయితేనే ఫలితాల వెల్లడికి అవకాశాలు ఉంటాయి. అయితే సెప్టెంబరు నెలంతా టీఎస్‌పీఎస్సీ సీబీఆర్‌టీ రాతపరీక్షల షెడ్యూలు ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆయా పరీక్షల షెడ్యూలును సమీక్షించి గురుకుల పోస్టులకు ధ్రువీకరణపత్రాల పరిశీలన, డెమో తరగతుల షెడ్యూలు ప్రకటించనుంది.

 

 

ఈ క్రమంలో గురుకుల పరీక్షలు రాసిన అభ్యర్థులు కుల, ఆదాయ, క్రీమిలేయర్‌, విద్యార్హత తదితర పత్రాలను సిద్ధం చేసుకోవాలని ఆయా వర్గాలు సూచించాయి. అవసరమైన పత్రాలపై ఉద్యోగ ప్రకటనలోనే సూచనలు చేశామని తెలిపాయి.

 

 

 

తెలంగాణలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)లు ఆగస్టు 01వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పోస్టులవారీగా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులతో పరీక్షలు ప్రారంభం కాగా.. అనంతరం టీజీటీ, పీజీ టీ, డీఎల్‌, జేఎల్‌ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు సబ్జెక్టులవారీగా పరీక్షలను నిర్వహించారు.

 

 

ఎ స్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి 9 క్యాటగిరీల్లో పీజీటీ- 1,276, టీజీటీ-4,020, జూనియర్‌ లెక్చరర్‌, డిగ్రీ లెక్చరర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ -2,876, టీజీటీ, స్కూల్‌ లైబ్రేరియన్‌- 434, స్కూల్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ -275, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌-226, మ్యూజిక్‌ టీచర్‌ -124 పోస్టులు మొత్తంగా 9,210 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ట్రిబ్‌ ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. అన్ని పోస్టులకు కలిపి 2,63,045 దరఖాస్తులు వచ్చాయని ట్రిబ్‌ ఇప్పటికే వెల్లడించింది. పోస్టుల్లో అత్యధికంగా మహిళలకే కేటాయించారు.

 

 

 

 

 

Related Articles

Back to top button