Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TS Inter Results 2022 తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై కొనసాగుతున్న సస్పెన్స్‌.. ఈ రోజు విడుదల చేసే అవకాశం..

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను ఈ రోజు (జూన్‌ 25) విడుదల చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల ఫలితాలను (TS Inter Results 2022) ఈనెల 25న విడుదల చేసేందుకు ఇంటబోర్డు కసరత్తు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

 

 

 

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల విడుదల తేదీపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ రోజు (జూన్‌ 25) విడుదల చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల ఫలితాలను (TS Inter Results 2022) ఈనెల 25న విడుదల చేసేందుకు ఇంటబోర్డు కసరత్తు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే.. మూల్యాంకన ప్రక్రియ మొత్తం పూర్తయినందున తప్పులు రాకుండా సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరిశీలిస్తున్నారు.

 

అన్నీ సజావుగా జరిగితే.. జూన్ 25న ఫలితాలు (TS Inter Results 2022) విడుదల చేసేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ఒకవేళ 25న కుదరకపోతే 29వ తేదీ అయినా ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయని సమాచారం. త్వరలో ఈ అంశంపై స్పష్టత రానుంది.

ఇక.. తెలంగాణ ఇంటర్‌ పరీక్షలన్నీ మే 24తో పూర్తికాగా అదే నెల 28 నుంచి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. అయితే.. మూల్యాంకన ప్రక్రియ మొత్తం పూర్తయినందున తప్పులు రాకుండా సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరిశీలిస్తామన్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్. ఈ క్రమంలో జూన్ 25న ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

 

ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ గతంలోనే ప్రకటించారు. ఇక.. ఇంటర్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button