Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TS SI & Constable police jobs recruitment 2022 updates || TS police job latest news today

TS Police Recruitment: ఎస్సై, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌.. వ‌యోప‌రిమితిలో మార్పులు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యం.

 

 

 

 

TS Police Recruitment: ఎస్సై, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌.. వ‌యోప‌రిమితిలో మార్పులు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యం.

TS POLICE RECRUITMENT RAISING THE AGE LIMIT FOR SI AND CONSTABLE POSTS STATE CABINET DECISION
TS Police Recruitment: ఎస్సై, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌.. వ‌యోప‌రిమితిలో మార్పులు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యం
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం
TS Police Recruitment | ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల‌కు ప్రిపేర్ అవుతున్న అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి అర్హతలో 3 సంవత్సరాలు సడలించాలని కేబినెట్ నిర్ణయించింది

NEWS18 TELUGU
LAST UPDATED: APRIL 12, 2022, 22:30 IST
తెలంగాణ (Telangana) ప్రభుత్వం భారీ ఉద్యోగ ప్రకటనకు సిద్ధమైంది. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలను భారీ సంఖ్యలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 18,334 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో పోలీస్ అవ్వాలనే కోరిక ఉన్న అభ్యర్థులందరూ తమ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. తాజా ఈ పోస్టుల‌కు ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి అర్హతలో 3 సంవత్సరాలు సడలించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగార్థుల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సీఎంఓ ట్విట్ట‌ర్ వేదికగా వివ‌రాలు వెల్ల‌డించింది.

 

ఈ రిక్రూట్‌మెంట్‌లో అంద‌రికి మెరుగైన అవ‌కాశాలు రావాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా అందిస్తోంది. హైదరాబాద్ నగరంలోని మొత్తం ఐదు జోన్లలోని వివిధ కేంద్రాల్లో ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ నిర్వహించనున్నామని, తేదీలను త్వరలో ప్రకటిస్తామని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఉచిత PRT కి హాజరు కావడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాచ్ టైమింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ లింక్ form.jotform.com/220792437998473 పై క్లిక్ చేయాలి.

TS TET 2022: టెట్ పరీక్షకు ఎన్ని ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకొన్నారో తెలుసా.. పేప‌ర్ వారీగా వివ‌రాలు

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు..

ఈ నేపథ్యంలో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్, ఎస్ఐ ఖాళీలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించింది. కోచింగ్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 6న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 12ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. జిల్లాకు దాదాపు 100 మంది చొప్పున తెలంగాణకు చెందిన మొత్తం 3300 మందికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

TS Gurukula Admission: విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ గ‌డువు పొడగింపు.. పూర్తి వివ‌రాలు

ఈ నేప‌థ్యంలో ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే గ్రూప్స్ ఉద్యోగాల‌కు ఎస్సీ అభ్య‌ర్థుల కోసం ఫౌండేష‌న్ కోర్సు కింద 45 రోజుల నుంచి 60 రోజుల స్వ‌ల్ప కాలిక శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు ఎస్సీ స్ట‌డీ స‌ర్కిల్ డైరెక్ట‌ర్ వేణుగోపాల్ తెలిపారు. ప్ర‌తీ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే ఒక్కో సెంట‌ర్‌లో 75-150 మందికి కొచింగ్ అందించనున్నారు.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button