Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TS SI Preliminary Exam

తెలంగాణ ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట్.. గోరింటాకు పెట్టుకుంటే ఎగ్జామ్ కు ఇబ్బందే.. ఈ రూల్స్ తెలుసుకోండి

 

 

 

 

 

 

ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ (TS SI Preliminary Exam) కు హాజరయ్యే అభ్యర్థుల చేతులకు గోరింటాకు, మెహంది వంటివి పెట్టుకోవడం వలన బయోమెట్రిక్ లో వేలిముద్రలు సరిగ్గా వచ్చే అవకాశం ఉండదని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర అన్నారు. ఇంకా ఆయన పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

 

 

 

ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ (TS SI Preliminary Exam) కు హాజరయ్యే అభ్యర్థుల చేతులకు గోరింటాకు, మెహంది వంటివి పెట్టుకోవడం వలన బయోమెట్రిక్ లో వేలిముద్రలు సరిగ్గా వచ్చే అవకాశం ఉండదని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర (Mahabubabad SP) అన్నారు. తద్వారా అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని గ్రహించి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గోరింటాకు, మెహంది, వంటివి పెట్టుకోవద్దని సూచించారు ఆగస్టు 7న నిర్వహించబోయే ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ వ్రాత పరీక్షను పకడ్బంధీగా నిర్వహించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులకు సూచించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నియమావళి మేరకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండ్ లకు, అబ్జర్వర్లకు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరీక్ష సమయంలో సిబ్బంది మరియు అభ్యర్థులు పాటించవలసిన జాగ్రత్తల గురించి ఎస్పీ వివరించారు.

 

 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ పరీక్షలు ఆగస్టు 7 న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫర్నిచర్, గాలి, వెలుతురు, నీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.

 

-రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోనున్నట్లు వివరించారు. ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందుగానే ( అనగా ఉదయం 9 గంటలకు) పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.

 

 

-ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటల తర్వాత అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబడరని స్పష్టం చేశారు. కావున అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని సూచించారు.

 

 

TS SI Preliminary Exam Rules: ఈ నెల 7నతెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్.. అభ్యర్థులు తప్పక పాటించాల్సిన 7 రూల్స్ ఇవే..

 

 

పరీక్షకు సంబంధించిన నిబంధనలు పూర్తిగా హాల్ టికెట్లో పొందపరిచి ఉంటాయన్నారు. అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు హాల్ టికెట్ లోని నిబంధనలు చదువుకోవడం మర్చిపోవద్దన్నారు. పరీక్ష హాలులోకి ఎటువంటి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులకు అనుమతి ఉండదన్నారు.

 

 

-చేతులకు గోరింటాకు , మెహంది వంటివి పెట్టుకోవడం వలన బయోమెట్రిక్ లో వేలిముద్రలు సరిగ్గా వచ్చే అవకాశం ఉండదన్నారు. తద్వారా అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని గ్రహించి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గోరింటాకు, మెహంది, వంటివి పెట్టుకోరాదని సూచించారు.

 

 

ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరనీ,సెల్ ఫోన్లు, వాచ్ లు(చేతి గడియారాలు) ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలగునవి ఎవరు తీసుకురాకూడదని సూచించారు.

 

 

-పరీక్షకు సంబంధించిన నిబంధనలు కచ్చితంగా అమలు చేయబడతాయని ఎస్పీ వివరించారు.

-ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని అభ్యర్థులు గుర్తించాలన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, అటువంటి మోసగాళ్ల సమాచారం పోలీసులకు తెలపాలని సూచించారు.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button