Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TSPSC 2023 రద్దైన పరీక్షల రీషెడ్యూల్ పై నేడు నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో నిర్వహించిన వివిధ పరీక్ష పేపర్లు లీక్ (TSPSC PAPER LEAK) అవడంతో గ్రూప్ – 1 తో సహ పరీక్షలను రద్దు చేశారు.

 

 

 

 

 

ఈ నేపథ్యంలో ఈ పరీక్షల రీషెడ్యూల్ ను నేడు TSPSC లో చర్చించి ప్రకటించనున్నట్లు సమాచారం. అలాగే ఉద్యానశాఖలో హార్టి కల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 4న నిర్వహించాల్సిన ఉంది. అయినా ఇప్పటి వరకు కమిషన్ హాల్ టికెట్లు విడుదల చేయకపోవడంతో పరీక్ష ఉంటుందా? వాయిదా పడుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాయిదాకే కమిషన్ అధి కారులు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.

 

 

 

తెలంగాణ రాష్ట్రంలో కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్న పత్రాల (TSPSC PAPER LEAK) లీకేజీ కేసుతో రద్దయిన నాలుగు, వాయిదా వేసిన రెండు పరీక్షల తేదీలను వారం రోజుల్లో ప్రకటించాలని TSPSC భావిస్తున్నది. మే నెలలోనే ఆ పరీక్షలు నిర్వహించాలని కసరత్తు చేస్తోంది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది.

 

 

గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి నేతృత్వంలో కమిషన్ భేటీ జరిగింది. ఇప్పటికే జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. మిగిలిన పరీక్షల తేదీల ప్రకటన, నిర్వహణ, సీబీటీ విధానం తదితర అంశాల గురించి చర్చించింది. సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చైర్మన్ అధికారులకు సూచించగా, ఇప్పటికిప్పుడు అంటే సాధ్యం కాకపోవచ్చని, ఆగస్టు వరకు అయితే ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పినట్టు సమాచారం.

 

 

ఈ నేపథ్యంలో ఈ పరీక్షల రీషెడ్యూల్ ను నేడు TSPSC లో చర్చించి ప్రకటించనున్నట్లు సమాచారం. అలాగే ఉద్యానశాఖలో హార్టి కల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 4న నిర్వహించాల్సిన ఉంది. అయినా ఇప్పటి వరకు కమిషన్ హాల్ టికెట్లు విడుదల చేయకపోవడంతో పరీక్ష ఉంటుందా? వాయిదా పడుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాయిదాకే కమిషన్ అధి కారులు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button