Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TSPSC Group 1 Results 2023

నేడే తెలంగాణ గ్రూప్‌ 1 ఫలితాలు..?

 

 

 

 

 

 

TSPSC Group 1 : తెలంగాణ గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇక ఫలితాల విషయానికొస్తే..

TSPSC Group 1 Prelims Results 2023
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. జులై 11 (మంగళవారం) విడుదల కానున్నట్లు సమాచారం. తెలంగాణలో పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన పరీక్షల విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీక్ కమిషన్ (TSPSC) వేగం పెంచింది. ఇప్పటికే పలు పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించగా.. కొన్ని పరీక్షలను నిర్వహించింది. ఇక ఎంతో కీలకమైన గ్రూప్ 1 పరీక్ష (TSPSC Group 1) రద్దు కాగా.. మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించారు. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్‌ కీ కూడా విడుదల చేశారు. ఇదే సమయంలో.. తుది ఫలితాలను జులై 9వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో జూన్‌ 11న నిర్వహించిన TSPSC Group 1 ప్రిలిమినరీ పునఃపరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61.16 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. TSPSC Group 1 పోస్టుల భర్తీకి మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గతేడాది అక్టోబరు 16న జరిగిన పరీక్షతో పోలిస్తే హాజరు శాతం కొంత తగ్గింది.

తెలంగాణ గ్రూప్‌ 1 (TSPSC Group 1) ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదల ప్రక్రియ పూర్తయితే అనంతరం కనీసం మూడు నెలల సమయమిచ్చి మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది. TSPSC ప్రస్తుతం సెప్టెంబరు నెలాఖరు వరకు ఇతర పోటీ పరీక్షలతో షెడ్యూల్‌ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబరు లేదా నవంబరులో గ్రూప్‌ 1 మెయిన్స్‌ నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button