Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TSSPDCL Preparation 2022 | తెలంగాణ విద్యుత్ శాఖ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) నుంచి జాబ్ నోటిఫికేన్ విడుదలైంది.

TSSPDCL మొత్తం 1271 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు 2022.

 

 

 

 

తెలంగాణ విద్యుత్ శాఖ  సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) నుంచి జాబ్ నోటిఫికేన్ విడుదలైంది. మొత్తం 1271 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ లైన్ మెన్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధింత విభాగాల్లో ఐటీఐ, బీటెక్, బీఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ప్రస్తుతం భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. విద్యుత్ శాఖనుంచి వచ్చిన పెద్ద నోటిఫికేషన్ కావడం.. మంచి కెరీర్ అవకాశాలు ఉండడం అభ్యర్థులు  ఎక్కువగా  ఆసక్తి చూపే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో పరీక్షకు అభ్యర్థులు  ఎలా ప్రిపేర్ అవ్వాలో ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

 

అసిస్టెంట్‌ ఇంజనీర్, సబ్‌–ఇంజనీర్‌ పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా నియామకాలు చేస్తారు.

– జూనియర్‌ లైన్‌మెన్‌ల‌కు ముందుగా రెండు సెక్షన్లుగా రాత పరీక్ష, ఆ తర్వాత పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌(స్తంభాలు ఎక్కే పరీక్ష) నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తదుపరి దశలో పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌ ఉంటుంది.

ప్రిప‌రేష‌న్ విధానం..

– ఏఈ, స‌బ్ ఇంజ‌నీర్‌ పోస్ట్‌లకు పోటీ పడే అభ్యర్థులు బీటెక్ కోర్‌ సబ్జెక్ట్‌కు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.

– ముఖ్యంగా మ్యాథమెటిక్స్‌లో లీనియర్‌ అల్జీబ్రా, కాలిక్యులస్, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, కాంప్లెక్స్‌ వేరియబుల్స్, ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్, న్యూమరికల్‌ మెథడ్స్, ట్రాన్స్‌ఫార్మ్‌ థియరీలపై పట్టు సాధించాలి.

 

ఏఈ, స‌బ్ ఇంజినీర్ పోస్టుల్లో 20 మార్కులకు ఉండే జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం కోసం అభ్యర్థులు అనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్, తెలంగాణ సంస్కృతి,ఉద్యమాలకు సంబంధించిన ముఖ్యాంశాలు, పరిణామాలు, కంప్యూటర్‌ నాలెడ్జ్ ప్రిపేర్ అవ్వాలి.

జూ. లైన్‌మెన్ పోస్టుల కోసం..

– ఎక్కువ పోస్టులు ఉన్న జేఎల్‌ఎమ్‌లో రాత పరీక్షలో 65 ప్రశ్నలు కోర్ స‌బ్జెక్టులో ఉటుంది.

– ఇందులో ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నటిజం, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఏసీ, బేసిక్‌ ఎలక్ట్రానిక్స్, డీసీ మెషిన్స్, ట్రాన్స్‌ ఫార్మర్స్, ఏసీ మెషిన్స్, ఎలక్ట్రికల్‌ మెజర్‌మెంట్స్, ఎలక్ట్రిక్‌ పవర్‌ జనరేషన్‌ విభాగాల్లోని అన్ని అంశాలపై ప‌ట్టు సాదించాలి.

 

 

ఇక జ‌న‌ర‌ల్ అవేర్ నెస్ నుంచి 15 మార్కులు వ‌స్తాయి.

– ఇందు కోసం అనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, కరెంట్‌ అఫైర్స్,కన్సూ్యమర్‌ రిలేషన్స్,నిజజీవితంలో సామాన్య శాస్త్రం,పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ,తెలంగాణ హిస్టరీ,ఎకానమీ,జాగ్రఫీ, తెలంగాణ ఉద్యమం అంశాలను ప్రిపేర్ అవ్వాలి.

– అంతే కాకుండా.. సిలబస్‌లో తెలంగాణ సంస్కృతి,సమాజం,వారసత్వం, కళలు, సాహిత్యం, తెలంగాణ ఉద్యమాలకు కొంత వెయిటేజీ ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ హిస్టరీకి సంబంధించిన అంశాల‌ను ప్రిపేర్ అవ్వాలి.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button