Andhra PradeshEducationTop News

సచివాలయ ఉద్యోగాల మెరిట్ జాబితా వెల్లడి…! || అభ్యర్థుల ర్యాంకులు పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

 

సెప్టెంబ‌ర్ 19వ తేదీ మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబరు 1 నుంచి 8 వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించి… కేవలం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు.

ఈ పరీక్షలకు 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబ‌ర్ 30వ తేదీ నుంచి అక్టోబర్‌ 1వరకు శిక్షణ ఇస్తారు.

పరీక్షల నిర్వహణ విజయవంతం:
1.9.2019 నుంచి 8.9.2019 వ తేదీ వరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఎంపిక పరీక్షలను 6 రోజులపాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
దేశ చరిత్రలోనే ఒకే రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేసేందుకు పోటీ పరీక్షలను ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఒక అరుదైన రికార్డు.
అభ్యర్థుల హాజరు: 19 రకాలయిన పోస్టులను భర్తీ చేయడానికి ఉద్దేశించిన 14 రకాల పరీక్షలకు మొత్తం 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు ఈ 19.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరు అయినారు.
పరీక్షలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించారు.

సమాధాన పత్రాల మూల్యాంకనం :
19,50,630 మంది అభ్యర్ధులకు చెందిన ఓ ఎం ఆర్ సమాధాన పత్రాలను తేదీ 3.9.2019 నుండి 9.9.2019 వరకూ రికార్డు సమయంలో స్కాన్ పూర్తి చేయటం జరిగింది
స్కానింగ్ పూర్తి అయిన తరువాత వచ్చిన ఫలితాలను, ఈ రంగంలో నిష్ణాతులైన ” STATISTICAL TEAM” ద్వారా మరొకసారి సరి చూసుకోవటం కోసం STRATIFIED రాండమ్ శాంప్లింగ్ పద్ధతిలో 10,000 ఓఎంఆర్‌ సమాధాన పత్రాలను సరి చూడడం జరిగింది. ముల్యాంకంలో ఎటువంటి తప్పులు దొర్లలేదని ధ్రువీకరించుకోవడం జరిగింది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button