Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

AP Jobs

ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా కేంద్రాల్లో 2103 ఉద్యోగాలు.. విభాగాల వారీగా ఖాళీలివే.. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌..!

 

 

 

 

 

 

ఆంధ్రప్రదేశ్‌ రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ , సిల్స్ బోర్డు అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ద్వారా త్వరలో భర్తీచేయనున్నట్లు కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా కేంద్రాల్లో (RBK) ఖాళీగా ఉన్న 2103 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. ఈ రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ , సిల్స్ బోర్డు అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్ 437, హార్టికల్చర్‌ అసిస్టెంట్ 1644, సిల్క్‌ అసిస్టెంట్ 22 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 2103 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని కూడా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ద్వారా త్వరలో భర్తీచేయనున్నట్లు కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు.
AP High Court Jobs: ఏపీలో 3673 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. సొంత జిల్లాలోనే పనిచేసే అవకాశం
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుతోపాటు ఇటు జిల్లా కోర్టుల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. ఇటీవల ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించి తద్వారా ఏర్పడిన ఖాళీలను సైతం ఇప్పటికే ఉన్న ఖాళీలతో కలిపి భర్తీచేయాలని నిర్ణయించారు.
AP Police Jobs
ఏపీలో 6511 పోలీస్‌ ఉద్యోగాలు.. విభాగాల వారీగా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలివే
AP Police Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ (YS Jagan) గుడ్‌న్యూస్‌ చెప్పారు. రాష్ట్రంలో 6,511 పోలీస్ (AP Police Recruitment) ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్‌, 3,580 సివిల్‌ కానిస్టేబుల్‌, 315 సివిల్‌ ఎస్‌ఐ, 96 రిజర్వ్ ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం ముద్ర వేశారు.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

APPSC Forest Range Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 8 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15 నుండి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button