Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop NewsTravel

DRDO Notification 2022 || DRDO CEPTAM 10 Recruitment 2022

DRDO Updates Today

 

 

 

 

 

DRDO భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. 1061 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

 

 

ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులను భర్తీ చేయనుంది.

 

 

 

ప్రధానాంశాలు:

  • డీఆర్‌డీవో సెప్టమ్‌ రిక్రూట్‌మెంట్‌ 2022
  • 1061 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • నవంబర్‌ 11 నుంచి దరఖాస్తులు ప్రారంభం

 

భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్‌డీవో ఎంట్రన్స్‌ టెస్టుకు సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్‌-10/ఎ&ఎ) అడ్మిన్ & అలైడ్ కేడర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 11 నుంచి ప్రారంభమవుతుంది.

 

 

మొత్తం ఖాళీలు: 1061

  • జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (జేటీవో): 33 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1(ఇంగ్లిష్ టైపింగ్): 215 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2(ఇంగ్లిష్ టైపింగ్): 123 పోస్టులు
  • అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’ (ఇంగ్లిష్ టైపింగ్): 250 పోస్టులు
  • అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’(హిందీ టైపింగ్): 12 పోస్టులు
  • స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’(ఇంగ్లిష్ టైపింగ్): 134 పోస్టులు
  • స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’(హిందీ టైపింగ్): 04 పోస్టులు
  • సెక్యూరిటీ అసిస్టెంట్ ‘ఎ’ 41 పోస్టులు
  • వెహికల్ ఆపరేటర్ ‘ఎ’: 145 పోస్టులు
  • ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ‘ఎ’: 18 పోస్టులు
  • ఫైర్‌మ్యాన్: 86 పోస్టులు

 

 

ముఖ్య సమాచారం:

  • అర్హతలు: పోస్టులను బట్టి 10వ తరగతి, ఇంటర్‌, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండి.. టైపింగ్‌ పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండాలి.
  • వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు- 30 ఏళ్లు మించకూడదు.
  • జీత భత్యాలు: నెలకు జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.35400-రూ.112400, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.25500-రూ.81100, ఇతర పోస్టులకు రూ.19900-రూ.63200 వరకు ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు: రూ.100(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
  • ఎంపిక విధానం: పోస్టును అనుసరించి టైర్-1(సీబీటీ), టైర్-2(నైపుణ్య, శారీరక దృఢత్వ, సామర్థ్య పరీక్షలు) తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: నవంబర్‌ 11, 2022
  • దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్‌ 12, 2022

 

 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌  

 

 

 

నోటిఫికేషన్‌

 

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button