Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

PM Kisan 14th Installment 2023 || https://pmkisan.gov.in/

రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 14వ విడతపై లేటెస్ట్ అప్టేట్ ఇదే.. నిధుల విడుదల ఎప్పుడంటే?

 

పీఎం కిసాన్ 14వ విడత నిధులు కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ అప్టేట్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

 

 

 

PM-KISAN పథకం కింద, అర్హులైన రైతులకు ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పన కేంద్రం విడుదల చేస్తుంది. ఏడాదికి మూడు విడతలకు కలిపి మొత్తం రూ.6,000 వరకు అందుతుంది. ఈ డబ్బు ప్రతీ సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి అనే మూడు వాయిదాలలో చెల్లిస్తుంది మోదీ సర్కార్.

 

 

 

 

లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు నేరుగా ఈ నిధులు బదిలీ చేయబడతాయి. ప్రస్తుతం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) 14వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 14వ విడత ఏప్రిల్-జూలై 2023 మధ్య విడుదల చేయనుంది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.

 

 

 

 

అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. అర్హత కలిగి రైతులు ఇప్పుడు PM-కిసాన్ తదుపరి విడత కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది కేంద్రం. ఇందుకోసం దరఖాస్తులను ఎలా సమర్పించాలో చూద్దాం.

 

 

 

 

www.pmkisan.gov.in వెబ్‌సైట్‌లో ‘ఫార్మర్స్ కార్నర్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి. Step 2: ‘న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్’పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా నింపండి.

 

 

 

 

Step 3: అవసరమైన వివరాలను నమోదు చేయిండి Step 4: దరఖాస్తు ఫామ్ పూర్తిగా నింపిన తర్వాత భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.

 

 

 

 

 

మీరు ఇప్పటికే పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు అయితే.. జాబితాలో మీ పేరును ఇలా చెక్ చేసుకోండి.. Step 1: PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.inని సందర్శించండి. Step 2: పేజీ కుడి మూలన ఉన్న ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

 

 

 

Step 3: మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామం మొదలైనవాటిని ఎంచుకోండి. Step 4: ‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై ఆప్షన్ పై క్లిక్ చేయండి.

 

లబ్ధిదారుల జాబితా వివరాలను స్క్రీన్‌పై చూడవచ్చు. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే, మీరు హెల్ప్‌లైన్ నంబర్‌లు 155261 మరియు 011-24300606కు కూడా కాల్ చేయవచ్చు.

 

 

 

పీఎం-కిసాన్ యొక్క 13వ విడతలో మొత్తం రూ. 16,800 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. దేశంలోని ఎనిమిది కోట్ల మంది అర్హులైన రైతులకు ఈ నిధులను ఫిబ్రవరిలో విడుదల చేశారు.

 

 

దీంతో లబ్ధిదారులకు బదిలీ అయిన మొత్తం 2.30 లక్షల కోట్లకు దాటింది. 12వ విడత అక్టోబర్ 2022లో విడుదలైంది. 11వ విడత నిధులు మే 2022లో విడుదలయ్యాయి.

 

 

 

 

 

https://pmkisan.gov.in/

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button