Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop NewsUncategorized

PM Kisan Scheme 2023 || Modhi News 2023 || PM Kisan Status Check 2023, Beneficiary, 14th Installment

PM Kisan Status Check 2023, Beneficiary, 14th Installment

 

PM Kisan Yojana | కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా రూ. 6 వేలు అందిస్తోంది. అయితే రైతులకు ఈ మొత్తానికి అదనంగా రూ. 4 వేలు పొందొచ్చు.

 

Farmers | రైతులకు తీపికబురు. అదిరిపోయే శుభవార్త. ఎందుకంటే రైతులకు రూ. 10 వేలు లభించనున్నాయి. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుకోవాల్సిందే.

పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రస్తుతం రైతులకు ఏటా రూ. 6 వేలు లభిస్తున్నాయి. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడదతల వారీగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో చేరుతున్నాయి. రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో ఈ డబ్బులు వస్తున్నాయి.

 

ఇలా అర్హత కలిగిన వారికి మోదీ సర్కార్ ఏటా రూ. 6 వేలు ఉచితంగా అందిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు చూస్తే ఏకంగా రూ. 26 వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పుడు ఈ నెలలో మరో రూ. 2 వేలు లభించాల్సి ఉంది. పీఎం కిసాన్ 14వ విడత కింద ఈ డబ్బులు రానున్నాయి.

 

అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ స్కీమ్ రూ. 6 వేలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 4 వేలు అందిస్తోంది. అంటే పీఎం కిసాన్ రైతులకు మొత్తంగా రూ. 10 వేలు లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు.

పీఎం కిసాన్ స్కీమ్ రూ. 6 వేలు, రాష్ట్ర ప్రభుత్వపు రూ. 4 వేలు కలిపి రైతులకు బ్యాంక్ ఖాతాల్లో రూ. 10 జమ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 వేలు అందిస్తూ వస్తోంది. దీంతో అక్కడి రైతులకు ప్రయోజనం కలుగుతోందని చెప్పుకోవచ్చు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కిసాన్ కళ్యాణ్ యోజన పేరుతో స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులకు రూ. 10 వేలు లభిస్తాయి. పీఎం కిసాన్ రూ. 6 వేలు, రాష్ట్ర ప్రభుత్వపు రూ. 4 వేలు కలిపి రూ. 10,000 వస్తాయి.

అయితే కిసాన్ కల్యాణ్ స్కీమ్ కింద రూ. 4 వేలు వస్తున్నాయి. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా రెండు విడతల రూపంలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ అవుతున్నాయి. ఇలా అదనంగా రూ. 4 వేలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు.

 

కాగా ఈ డబ్బులు కేవలం పీఎం కిసాన్ స్కీమ్ కింద మాత్రమే లబ్ధి పొందుతున్న వారికి లభిస్తాయి. అంటే ఒకవేళ పీఎం కిసాన్ స్కీమ్‌లో లేని వారికి ఈ డబ్బులు రావు. అలాగే ఏదైనా పొరపాటు వల్ల పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే.. అప్పుడు వారికి ఈ డబ్బులు కూడా రావు.

అంతేకాకండా మరోవైపు మహరాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాతలకు అదనంగా రూ. 6 వేలు అందిస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ. 6 వేలు వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 6 వేలు అందిస్తోంది. ఇలా రూ. 12 వేలు లభిస్తున్నాయి.

 

PM-KISAN Samman Nidhi

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button