Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

pm kishan 2024

అకౌంట్లలలో డబ్బులు పడేది అప్పుడే’.. రైతులకు కేంద్రం శుభవార్త!

 

 

రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడతను ఈ నెలాఖరులోగా లబ్ధి దారులకు చెల్లిస్తున్నట్లు పీఎం కిసాన్ వెబ్ సైట్ పేర్కొంది.

రైతులకు ఆర్థికంగా నిలిచేందుకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని ప్రారంభించింది.  ఈ పథకంలో రైతులకు కేంద్రం ఏటా రూ. 6 వేలు అందిస్తుంది.  దీనిని ఏడాదికి రూ. 6 వేలు అంటే ప్రతి 4 నెలలకు ఓసారి మొత్తం 3 విడతలకు రూ. 2 వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో డిపాజిట్ చేస్తుంది.

పీఎం కిసాన్కిఅహర్హులు ఎవరంటే?
పీఎం కిసాన్ పథకంలో రైతులు మాత్రమే అర్హులు. పన్ను చెల్లింపు దారులు మాత్రం కాదు.

పీఎం కిసాన్ 16వ విడత విడుదల ఎప్పుడంటే? 
పీఎం కిసాన్ 16వ విడుత నగదు పంపిణీని ఫిబ్రవరి 28, 2024న కేంద్రం రైతులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తేదీన, అర్హత కలిగిన లబ్ధిదారుడి ఖాతాలో నగదు జమ చేయబడుతుంది.

పీఎం కిసాన్ 16వ విడుత నగదు డిపాజిట్ అయ్యిందా? లేదా? అని చెక్ చేసుకోవాలంటే?

స్టెప్1 : అర్హులైన రైతులు https://pmkisan.gov.in/ Portal పీఎం కిసాన్ సమ్మాన్ నిధి…

 

 

స్టెప్2 :హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ ఎంపిక చేసుకోవాలి.

స్టెప్3 : పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్ తనిఖీ ఆప్షన్ ఎంపిక చేయాలి.

స్టెప్4 :ఆధార్ లేదా అకౌంట్ నంబర్ లేదా ఫోన్ నంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి..

స్టెప్5 : గెట్ డేటాపై క్లిక్ చేస్తే మీ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

కేవైసీ తప్పని సరి
పీఎం కిసాన్ వెబ్ సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ లో నమోదు చేసుకునే రైతులు ఈ కేవైసీ తప్పని సరి చేసుకోవాలి. ఈకేవైసీ పద్దతి పీఎం కిసాన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్ కేంద్రాలలో బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ అప్డేట్  చేసుకోవచ్చు.

ఈకేవైసీ ఎందుకు?
కేంద్రం అందించే పీఎం కిసాన్ పథకాన్ని నేరుగా రైతులకు అందించేలా ఈకేవైసీని ప్రవేశ పెట్టింది. తద్వారా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కేంద్రం రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బుల్ని డిపాజిట్ చేస్తుంది.

 

 

 

 

Related Articles

Back to top button