Andhra PradeshBusinessNational & InternationalSocial

PMEGP Loan Ila Thisukondi Online | How To Apply PMEGP Loan Online | Loan Apply Online | How To Apply Loan

PMEGP Loan Ila Thisukondi Online | How To Apply PMEGP Loan Online | Loan Apply Online | How To Apply Loan

 

 

ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రొగ్రామ్(పీఎంఈజీపీ) అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం. ఈ స్కీమ్ కింద, ప్రాజెక్టు ఖర్చులో 15 శాతం నుంచి 35 శాతం వరకు లబ్దిదారులు ప్రభుత్వం నుంచి రాయితీగా పొందుతారు. కుటీర, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖకు చెందిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) అమలు చేస్తోంది. ఎంట్రప్రెన్యూర్‌గా కొత్త ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు పీఎంఈజీపీ నుంచి ఆర్థిక సాయం పొందొచ్చు.

పీఎంఈజీపీ స్కీమ్ ఉద్దేశ్యాలేమిటి…?

స్వయం ఉపాధి ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు మైక్రో సంస్థలను, వెంచర్లను ప్రోత్సహిస్తూ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం లబ్దిదారులకు అవకాశాలను అందిస్తోంది.
సంప్రదాయ కళలు వంటి వాటిల్లో స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ.. యువతకు వారి ప్రాంతాలలోనే ఉపాధి కల్పిస్తోంది.
గ్రామీణులకు, నిరుద్యోగ యువత స్థిరమైన ఉపాధిని సృష్టిస్తోంది. పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లడాన్ని ఆపివేస్తోంది.

 

 

పీఎంఈజీపీ లోన్ స్కీమ్ ద్వారా ఎంత రాయితీ పొందొచ్చు…?
లబ్దిదారుల కేటగిరీ లబ్దిదారుల షేరు(మొత్తం ప్రాజెక్టులో) సబ్సిడీ రేటు( ప్రభుత్వం నుంచి)-పట్టణ ప్రాంతాల వారికి సబ్సిడీ రేటు(ప్రభుత్వం నుంచి)-గ్రామీణ ప్రాంతాల వారికి
జనరల్ 10 శాతం 15 శాతం 25 శాతం
స్పెషల్ 5 శాతం 25 శాతం 35 శాతం

పీఎంఈజీపీ కింద రుణ పరిమితి…
పీఎంఈజీపీ కింద రూ.9.5 లక్షల నుంచి రూ.23.75 లక్షల రుణం లభిస్తుంది. అయితే తయారీ రంగానికి చెందిన ప్రాజెక్టు గరిష్ట పరిమితి రూ.25 లక్షలుగా.. సర్వీసు రంగానికి చెందిన వ్యాపారాలు రూ.10 లక్షలుగా ఉండాలి. లబ్దిదారులు 5 నుంచి 10 శాతం కంట్రిబ్యూట్ చేయాల్సి వస్తుండగా.. మిగిలిన 90 నుంచి 95 శాతం మొత్తం బ్యాంకులు జారీ చేస్తున్నాయి. అయితే ఈ మొత్తంలో బ్యాంకులు కేవలం 60 నుంచి 75 శాతమే అందిస్తున్నాయి. మిగిలిన 15 నుంచి 35 శాతం పీఎంఈజీపీ స్కీమ్ కింద రాయితీ రూపంలో వస్తుంది.

 

 

 

పీఎంఈజీపీ స్కీమ్ కింద తీసుకునే రుణాలకు వడ్డీ రేటు 11 నుంచి 12 శాతం మధ్యలో ఉంటుంది. బ్యాంకులు ప్రాజెక్టు కాస్ట్‌లో 90 నుంచి 95 శాతం వరకు బ్యాంకు నుంచి పొందవచ్చు. దీనిలో 15 శాతం నుంచి 35 శాతం పీఎంఈజీపీ సబ్సిడీ కింద మార్జిన్ మనీ రూపంలో వస్తుంది. మిగిలిన 60 నంుచి 75 శాతం మొత్తాన్ని బ్యాంకులు టర్మ్ లోన్ రూపంలో ఇస్తాయి. ప్రిలిమినరీ మారిటోరియం తర్వాత రీపేమెంట్ వ్యవధి 3 నుంచి 7 ఏళ్లు ఉంటుంది.

పీఎంఈజీపీ లోన్ కింద ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..?

18 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా
తయారీ రంగం కోసమైతే 8వ తరగతి పాస్ అయి ఉండాలి. ప్రాజెక్టు కాస్ట్ రూ.10 లక్షలుగా ఉండాలి. సర్వీసు లేదా బిజినెస్ రంగమైతే రూ.5 లక్షలకు పైన కాస్ట్ ఉండాలి.
స్వయం ఉపాధి గ్రూపులు
సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1860 కింద రిజిస్టర్ అయిన సంస్థలు
ప్రొడక్షన్ కోఆపరేటివ్ సంస్థలు
ఛారిటబుల్ ట్రస్టులు.

 

 

కావాల్సిన డాక్యుమెంట్లు..

 

ఆధార్ కార్డు     పాన్ కార్డు     ప్రాజెక్టు రిపోర్టు     అవసరమైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్     రూరల్ ఏరియా సర్టిఫికేట్     ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్, ఈడీపీ సర్టిఫికేట్     అథరైజేషన్ లెటర్   ఆన్‌లైన్ అప్లికేషన్…      పీఎంఈజీపీను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు

 

 

Official website

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button