Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Runamafi

TS లక్ష వరకు రుణమాఫీ.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

 

 

రైతు రుణమాఫీ స్కీమ్ ఊపందుకున్నది. ఇప్పటివరకు రూ.99,999 వరకు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకే నగదును జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా లక్ష రూపాయల వరకు రుణం ఉన్నవారికీ మాఫీ చేసే ప్రాసెస్ మొదలుపెట్టింది.

రైతు రుణమాఫీ స్కీమ్ ఊపందుకున్నది. ఇప్పటివరకు రూ.99,999 వరకు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకే నగదును జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా లక్ష రూపాయల వరకు రుణం ఉన్నవారికీ మాఫీ చేసే ప్రాసెస్ మొదలుపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే రూ.2,000 కోట్లను బ్యాంకులకు విడుదల చేసినట్లు ఫైనాన్స్ డిపార్టుమెంటు అధికారులు నాలుగు రోజుల క్రితం వెల్లడించారు. దానికి కొనసాగింపుగా బ్యాంకుల నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కావడం సోమవారం నుంచి మొదలైంది. ఇప్పటికే పలువురు రైతుల ఖాతాల్లోకి జమ అయినట్లు మొబైల్ ఫోన్ల ద్వారా మెసేజ్‌లు అందుతున్నాయి. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా సెప్టెంబరు సెకండ్ వీక్ వరకు మొత్తం రైతుల రుణమాఫీ బకాయిల చెల్లింపును పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్టు ముందు రోజున రూ.5,809 కోట్లను రైతుల రుణమాఫీ స్కీమ్ కోసం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు విడతల్లో రూ. 1,943.65 కోట్లను విడుదల చేయగా గత నెల 14న రూ. 5,809 కోట్లను విడుదల చేసింది. దీంతో సెకండ్ టర్మ్‌లో మొత్తం 16.22 లక్షల మందికి మాఫీ అయినట్లయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 36 లక్షల మందికి రుణమాఫీ అమలు కావాల్సి ఉన్నది. నాలుగు విడతల్లో 16.22 లక్షల మందికి మాఫీ కావడంతో మిగిలినవారంతా లక్ష రూపాయల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులే. దాదాపు 20 లక్షల మంది రైతులకు సుమారు రూ.11 వేల కోట్లను మాఫీ నిమిత్తం విడుదల చేయాల్సి ఉన్నది.

మొత్తం స్కీమ్‌ను సెప్టెంబరు రెండో వారంకల్లా కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చిన ప్రకారం రూ. 99,999 కంటే ఎక్కువ రుణం తీసుకున్నవారికి లక్ష రూపాయల వరకు మాఫీ చేసే ప్రాసెస్ మొదలైంది. పది రోజుల్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. లక్ష రూపాయల వరకు రుణం మాఫీని స్టార్ట్ చేయడంతో ఇప్పటివరకు ఎంత మందికి రుణాలు క్లియర్ అయ్యాయో బ్యాంకులు లేదా వ్యవసాయ శాఖ అధికారులు లాంఛనంగా వివరాలను వెల్లడించడంతో స్పష్టతకు రానున్నది. ఒకవైపు వర్షాభావ పరిస్థితుల్లో అనేక జిల్లాల్లో రైతులు సాగు పనులకు ఇబ్బంది పడుతున్న టైమ్‌లో మొబైల్ ఫోన్లకు లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేసినట్లు బ్యాంకుల ద్వారా టింగ్.. టింగ్.. అంటూ మెసేజ్‌లు వస్తుండడం వారికి సంతోషాన్నిస్తున్నది.

 

 

 

 

Related Articles

Back to top button