Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

rythu bandhu live news today

రైతు బంధు’కు వేళాయే

 

 

 

Kumaram Bheem Asifabad: ‘రైతు బంధు’కు వేళాయే

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పథకం రైతుబంధు. ఈ పథకం ద్వారా పట్టాదారు పాసు పస్తుకాలు కల్గిన రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున యాసంగి సీజన్‌తో పాటు వానాకాలం సీజన్‌లో రెండు దఫాలుగా మొత్తం కలిపి ఎకరాకు రూ.10వేల చొప్పున రైతులకు ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు సాయం డబ్బులు వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు.

 

 

– అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఏఈవోలు

– కొత్త పట్టాలు పొందిన రైతుల్లో ఆశలు

– యాసంగిలో కొత్తగా పట్టాలు పొందిన రైతులకు నిరాశే

– ఈ సారైనా సాయం అందుతుందని ఎదురుచూపులు

చింతలమానేపల్లి, జూన్‌ 1: రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పథకం రైతుబంధు. ఈ పథకం ద్వారా పట్టాదారు పాసు పస్తుకాలు కల్గిన రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున యాసంగి సీజన్‌తో పాటు వానాకాలం సీజన్‌లో రెండు దఫాలుగా మొత్తం కలిపి ఎకరాకు రూ.10వేల చొప్పున రైతులకు ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు సాయం డబ్బులు వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. దీంతో రైతులు వ్యవసాయానికి పెట్టుబడితో పాటు ఇతర ఖర్చులకు ఉపయోగించుకుంటున్నారు. వానాకాలం సాగు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే రైతులు వ్యవసాయ పనుల్లో భాగంగా తమ చేన్లను సిద్ధం చేసుకుంటున్నారు. వర్షాలు ప్రారంభం కాగానే రైతులు విత్తనాలు విత్తుకుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి లాగానే సాయం అందించేందుకు కొత్తగా పట్టాలు కల్గిన రైతుల నుంచి ఆయా క్లస్టర్ల వారీగా ఏఈవోల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

జిల్లాలో 4.5 లక్షల ఎకరాల్లో సాగు

జిల్లాలోని 15మండలాల పరిధిలో 4.5లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటల సాగు చేయవచ్చని అధికారులు ఇప్పటికే సాగు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో ప్రధానంగా పత్తి పంట 3.5లక్షల ఎకరాలు, వరి 58వేలు, కంది, సోయా, పెసరా, జొన్నలు, మొక్కజొన్న, మిరప, ఇతర పంటలు సాగు చేస్తారు. వీటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు అందు బాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే విత్తనాలు, ఎరువుల ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం అందజేసే సాయం ఉపయోగపడనుంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలో రైతుబంధుకు 1,14,448 మంది అర్హులు ఉండగా ఈ వానాకాలం మరింత మంది పెరిగే అవకాశం ఉంది. యాసంగిలో రూ.191.41కోట్ల నిధులు మంజూరు కాగా 1,13,261 మంది రైతులు లబ్ధిపొందారు. మొత్తానికి రూ.188.98కోట్లు రైతులకు సాయం అందింది. మరికొంత మంది ఖాతాలు సరిగా లేకపోవడంతో సాయం అందలేదు.

కొత్తగా 2,027 మంది రైతులకు కొత్త పట్టాలు..

జిల్లాలో 2,027మంది రైతులు కొత్తగా పట్టాలు పొంది ఉన్నారు. వీరికి యాసంగి సీజన్‌లో రైతుబంధు సాయం అందలేదు. కొత్తగా పట్టాలు పొందిన రైతులు దరఖాస్తులు చేసుకున్నా సాయానికి దూరమయ్యారు. 2,368మంది రైతుల జాబితాను అధికారులు పోర్టల్‌లో పొందు పరిచినా వారికి నిరాశే మిగిలింది. అయితే ఈ వానాకాలం సీజన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ యంత్రాంగం కొత్తగా పట్టాలు పొందిన రైతుల నుంచి దరఖాస్తులు కోరడంతో ఈ సారైనా సాయం అందు తుందని వారు ఆశగా ఎదురు చూస్తున్నారు.

కొత్తగా పట్టాలు పొందిన రైతులు దరఖాస్తులు చేసుకోవాలి..

– రామకృష్ణ, ఏవో

వానాకాలం సీజన్‌ 2023కోసం రైతుబంధు పెట్టుబడి సాయం కోసం కొత్తగా పట్టాపాస్‌ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత ఏఈవోల వద్ద దరఖాస్తులు చేసుకోవాలి. పట్టాపాసు పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా పాసు పుస్తకం జిరాక్స్‌తోపాటు దరఖాస్తు ఫారం నింపి ఇవ్వాలి.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button