Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Rythu Bandhu updates today 2022 | rythubandhu.telangana.gov.in Rythu Bandhu Status 2022 Check here

Rythu Bandhu | RYTHU BANDHU Government of Telangana

ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. తొలి రోజు రూ.586.65 కోట్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సొమ్ము 19.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో డిపాజిట్‌ చేసినట్లు తెలిపారు. మొదటిరోజు 11.73 లక్షల ఎకరాలకు సాయం అందినట్లు వెల్లడించారు.

దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ కాగితాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ‘జాతీయ పార్టీలకు జాతీయ విధానాలు ఉండవా ? రాష్ట్రానికో విధానం ఉంటుందా ?’ అని ప్రశ్నించారు. అధికార కాంక్ష తప్ప కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రం మీద ప్రేమ లేదని, ఆ పార్టీల  పిల్లిమొగ్గలను ప్రజలు తెలంగాణ ఉద్యమ సమయంలోనే చూశారని అన్నారు.

కొత్త లబ్ధిదారులకు రైతుబంధు పథకం అమలుకానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల ఐదు వరకు కటాఫ్‌ తేదీని నిర్ణయించింది. అంటే ఆ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ అయిన, పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ అయిన భూములను రైతుబంధు పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన రైతులు, పట్టాదారు పాస్‌ బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో)కి అందజేయాలి.

ఆదివారం ఉదయం నుంచి ఏఈవో లాగిన్‌ను ఓపెన్‌ చేశారు. సీసీఎల్‌ఎ డేటా ఆధారంగా రైతుల వివరాలను అధికారులు అప్‌లోడ్‌ చేస్తారు. ముందుగా కటాఫ్‌ తేదీని ప్రకటించి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రారంభిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త లబ్ధిదారుల నమోదుకు రెండు రోజులు మాత్రమే అవకాశం కల్పించటంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

ఈ వానాకాలం సీజన్‌లో 68.10 లక్షలమంది రైతుబంధు కింద పెట్టుబడి సాయం పొందడానికి అర్హులని వ్యవసాయ శాఖ ప్రకటించింది. మంగళవారం(నేడు) నుంచి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. మొదటిరోజు ఎకరా వరకు భూమి ఉన్న 19.98 లక్షల మంది రైతులకు 586.65 కోట్లు జమ చేస్తామని పేర్కొంది. 1,50,43,606 ఎకరాలకు చెందిన రైతులకు రైతుబంధు సొమ్ము అందజేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. అందుకోసం రూ.7,521.80 కోట్లు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కొత్త లబ్ధిదారులకు రైతుబంధు పథకం అమలుకానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల ఐదు వరకు కటాఫ్‌ తేదీని నిర్ణయించింది. అంటే ఆ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ అయిన, పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ అయిన భూములను రైతుబంధు పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన రైతులు, పట్టాదారు పాస్‌ బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో)కి అందజేయాలి.

ఆదివారం ఉదయం నుంచి ఏఈవో లాగిన్‌ను ఓపెన్‌ చేశారు. సీసీఎల్‌ఎ డేటా ఆధారంగా రైతుల వివరాలను అధికారులు అప్‌లోడ్‌ చేస్తారు. ముందుగా కటాఫ్‌ తేదీని ప్రకటించి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రారంభిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త లబ్ధిదారుల నమోదుకు రెండు రోజులు మాత్రమే అవకాశం కల్పించటంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

రైతుబంధు కింద అన్నదాత లకు ఈ నెల 28 నుంచి పెట్టుబడి సాయం అందనుంది. ఈ అంశంపై బుధవారం సీఎస్‌ సోమేశ్‌ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో చర్చించిన సీఎం కేసీఆర్‌… వర్షాలు బాగా కురుస్తున్నందున రైతులకు రైతు బంధు సొమ్ము అందించాలని ఆదేశించారు. ఈ వానాకాలం సీజన్‌కు 65 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి.

ముందుగా ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత ఒకటి నుంచి రెండెక రాల రైతులకు.. ఇలా రైతుబంధు సొమ్మును దశల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ‘సాక్షి’కి తెలి పారు. వచ్చే నెల 15 నాటికి అందరి ఖాతాల్లో పెట్టు బడి సాయం జమ అయ్యే అవకాశం ఉంది. అంతే గాకుండా బుధవారం రాత్రి వరకు క్రయవిక్ర యాలు జరిగిన భూములకు చెందిన రైతులకు కూడా రైతుబంధు సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు.

Rythu Bandhu district wise mobile number contact list

telangana agriculture officers list

How to check payments

TS Rythu Bandhu Status 2022

కొత్త లబ్ధిదారులకు రైతుబంధు పథకం అమలుకానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల ఐదు వరకు కటాఫ్‌ తేదీని నిర్ణయించింది. అంటే ఆ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ అయిన, పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ అయిన భూములను రైతుబంధు పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన రైతులు, పట్టాదారు పాస్‌ బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో)కి అందజేయాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button