Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Singareni Jobs 2022

సింగరేణి జూనియర్ అసిస్టెట్ ఉద్యోగాలు

 

 

 

 

రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరిట జరిగిన అవినీతి సంఘటనలు మరువకముందే తెరపైకి మళ్ళీ సింగరేణి ఉద్యోగాల మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

 

సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు కల్పించేందుకు దళారులు దందా మొదలు పెట్టారు . సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లో దళారులు నిరుద్యోగుల నుంచి భారీగా దండుకోవడానికి పైరవీలు చేస్తామంటూ నమ్మిస్తున్నారు.

 

 

సింగరేణివ్యాప్తంగా కొంతమంది దళారులు నిరుద్యోగుల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి మాయమాటలతో నమ్మిస్తున్నారు . ఒక్కో ఉద్యోగానికి రూ .15 లక్షల నుంచి రూ .25 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు . ఉద్యోగం ఆశతో ఇప్పటికే కొంతమంది నిరుద్యోగులు దళారులకు అడ్వాన్స్ కింద కొంత సమర్పించుకున్నారు .

 

 

సింగరేణిలో అంతర్గత 155 , ఎక్స్టెర్నల్ ద్వారా 117 జూనియర్ అసిస్టెంట్ గ్రేడు -2 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . అంతర్గత ఖాళీలను మే 19 న , ఎకర్నల్ ఖాళీలకు జూన్ 16 న నోటిఫికేషన్ విడుదల చేసింది . అంతర్గత అభ్యర్థులు మే 25నుంచి జూన్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి గడువు విధించింది .

 

 

ఎక్స్టెర్నల్ అభ్యర్థులకు జూన్ 20 నుంచి జులై 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది . దీంతో ఇదే అదునుగా భావించి కొందరు దళారులు రంగంలోకి దిగారు. దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులను నమ్మించేందుకు తమకు పైవారితో పరిచయాలున్నాయని డబ్బులు దండుకుంటున్నారు .

 

 

ముందే అడ్వాన్స్ కింద కొంతమొత్తం తీసుకుంటున్న దళారులు పరీక్షలు పూర్తయి ఉద్యోగానికి ఎంపికైన తర్వాత మిగతా మొత్తం చెల్లించాలని వారితో మాట తీసుకుంటున్నారు . ఇదే దందా ఉమ్మడి కరీంనగర్ లోనే కాదు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచుసుకుంటున్నాయి.

 

 

సింగరేణిలో 2015 లో 450 జూనియర్ అసిస్టెంట్ గ్రేడు -2 ఉద్యోగ నియామకాల సమయంలోనూ పరీక్షల్లో గందరగోళం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి . పైరవీలు చేసుకున్న వారే ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రచారం జరిగింది .

 

ఆ సమయంలోనూ పైరవీకారులు , దళారులు భారీ ఏత్తున నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు . మొన్నటి కి మొన్న రామగుండం ఎరువుల కర్మగరంలో పరిమినెంట్ ఉద్యోగాల పేరుతో 790మంది దగ్గర రూ. కోట్లు కొళ్లగొట్టిన  దళారులు మళ్ళీ ఇప్పుడు సింగరేణి ఉద్యోగాలంటూ తెరపైకి రావడం తో మళ్ళీ ఒకసారి రామగుండం వార్తలో నిలిచింది.

 

ఇటువంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని.. దళారులపై చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు వాపోతున్నారు.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button