Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TS Govt Jobs 2024

హెల్త్ డిపార్ట్​మెంట్​లో ఉద్యోగాలు - అర్హతలు, ఖాళీల వివరాలివే

 

 

Telangana Govt Jobs 2024: తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఇప్పుడిప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 31వ తేదీతో గడువు ముగియనుంది.

 

 

హెల్త్ డిపార్ట్​మెంట్​లో ఉద్యోగాలు

 

 

DMHO Mahabubnagar Recruitment 2024 : తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై కసరత్తు చేస్తోంది కొత్త ప్రభుత్వం. ఇటీవలనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ తో పాటు సభ్యుల నియామకం కూడా పూర్తి అయింది. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు రావటంతో పాటు ఇప్పటికే నోటిఫికేషన్లు వచ్చిన వాటిని కూడా వేగవంతం చేయనున్నారు. రాతపరీక్షలు, ఫలితాల విడుదలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. డీఎస్పీతో పాటు మరిన్ని శాఖల నుంచి కూడా ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉంది.

 

 

 

ఇదిలా ఉంటే తాజాగా మహబూబ్ నగర్ డీహెంహెచ్ఓ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది.ఈ నోటిఫికేషన్ లో భాగంగా… మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపాదికనచేస్తున్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూద్దాం…

 

 

ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన – వైద్యారోగ్య అధికారి కార్యాలయం, మహబూబ్ నగర్(DMHO)

ఉద్యోగాలు – మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్

మొత్తం ఖాళీలు – 17

అర్హతలు – ఎంబీబీఎస్, బీఏఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం ఉత్తీర్ణత, దరఖాస్తు చేసే పోస్టును బట్టి అర్హతలను నిర్ణయించింది.

ఎంఎల్ హెచ్ పీ(ఎంబీబీఎస్, బీఎఎంస్ డాక్టర్లకు 40 వేల జీతం, స్టాఫ్ నర్సులకు ఎంపికైన వారికి రూ. 29,900)

వయోపరిమితి – 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు – ఆఫ్ లైన్

ఉద్యోగ ప్రకటన తేదీ – 25 జనవరి 2024.

దరఖాస్తుల స్వీకరణ – 27 జనవరి 3024.

దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు – 31 జనవరి 2024.

అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారమ్ ను నింపి మహబూబ్ నగర్ జిల్లా వైద్యోరోగ్య అధికారి కార్యాలయం అడ్రస్ కు పంపాలి.

దరఖాస్తుల పరిశీలన -1 ఫిబ్రవరి 2024.

ప్రివిజినల్ జాబితా ప్రకటన – 7 ఫిబ్రవరి 2024.

అభ్యంతరాల స్వీకరణ – 09 ఫిబ్రవరి 2024.

తుది జాబితా విడుదల – 13 ఫిబ్రవరి 2024.

కౌన్సిలింగ్ తేదీ – 15 ఫిబ్రవరి 2024.

అధికారిక వెబ్ సైట్ – https://mahabubnagar.telangana.gov.in/

 

 

 

 

 

 

Related Articles

Back to top button