Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TS SI Preliminary Exam 2022 Key

ఎస్సై ప్రిలిమినరీ ప‌రీక్ష ‘కీ’ విడుద‌ల‌.. అర్హ‌త మార్కులు ఇవే..

 

 

 

 

తెలంగాణలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై), తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షను ఆగస్టు 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ ప‌రీక్ష‌ను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.

 

ఈ ఎస్సై ప్రిలిమినరీ ప‌రీక్షకు సంబంధించిన ప్రాథ‌మిక‌ ‘కీ’ ని ఆగ‌స్టు 12వ తేదీన అధికారులు విడుద‌ల‌ చేశారు. ఈ ‘కీ’ కి సంబంధించిన మీకు ఏవైనా అభ్యంత‌రాలు ఉంటే.. ఆగ‌స్టు 13వ తేదీ ఉద‌యం 8:00 గంట‌ల నుంచి ఆగ‌స్టు 15వ తేదీ సాయంత్రం 5:00 గంట‌ల‌లోపు తెలియ‌చేయండి.

 

 

ఈ ‘కీ’  కి సంబంధించిన అభ్యంత‌రాలు ఉంటే ఈ లింక్ క్లిక్ చేయండి

అర్హ‌త మార్కులు ఇవే.. 
ఎస్సై ప్రిలిమినరీ ప‌రీక్షను మొత్తం 200 మార్కులను నిర్వహించారు. ఇందులో 60 మార్కులు సాధించిన వారు తర్వాత పరీక్షకు అర్హత సాధిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఈవెంట్స్ లోనూ అర్హత పొందిన వారికి తుది పరీక్ష ఉంటుంది. ఫైన‌ల్‌గా ఈ రాత పరీక్షలో ప్ర‌తిభ చూపిన వారికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ఎంపికలో రిజర్వేషన్ ను పాటిస్తారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 35 పట్టణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 554 సబ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టుల‌కు 2,47,630 దరఖాస్తులు వ‌చ్చాయి.

 

ఎస్సై ప్రిలిమినరీ ప‌రీక్ష-2022 కొశ్చ‌న్ పేప‌ర్ 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button