Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TSPSC Exam Schedule 2023

tspsc రద్దైన ప‌రీక్ష‌ల రీషెడ్యూలు ఇలా.. మే నెల‌లో..!

 

 

 

 

 

 

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూలును వారం రోజుల్లో ప్ర‌క‌టించ‌నున్నారు.

 

 

 

 

 

 

ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే షెడ్యూలు చేసిన పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే అవకాశముంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీని రద్దు చేసిన రోజునే పునఃపరీక్ష తేదీని జూన్‌ 11గా వెల్లడించింది. అయితే… గ్రూప్‌-1తోపాటు రద్దయిన ఏఈఈ, డీఏవో, ఏఈ, వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది.

tspsc latest breaking news telugu

 

 

కేంద్ర ప్రభుత్వ, వివిధ పోటీ పరీక్షల షెడ్యూలును పరిశీలించి, టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు అనువైన తేదీలను వారంలోగా ప్రకటించనుంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పరీక్షలకు మధ్య వ్యవధిని పరిశీలించి, ఆ మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. మే నెలలోనే ఆ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చైర్మన్‌ అధికారులకు సూచించగా, ఇప్పటికిప్పుడు అంటే సాధ్యం కాకపోవచ్చని, ఆగస్టు వరకు అయితే ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పినట్టు తెలిసింది.

 

 

 

online exam

 

 

తక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్న నోటిఫికేషన్ల రాతపరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహిస్తోంది. లీకేజీ నేపథ్యంలో మరింత భద్రతతోపాటు ఫలితాలను వేగంగా వెల్లడించేందుకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సిన హార్టికల్చర్‌ అధికారులు, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, భూగర్భజల అధికారులు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్ల పరీక్షలను యధావిధిగా నిర్వహించాలా? ఆ లోగా కొత్త ప్రశ్నపత్రాలు సిద్ధం అవుతాయా? తదితర విషయాలను పరిశీలిస్తోంది.

 

 

రీషెడ్యూల్‌ను ఇలా..

 

 

 

tspsc exams details in telugu

 

 

అవసరమైతే వారం నుంచి 15 రోజుల వ్యవధితో వీటిని రీషెడ్యూలు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే వీటన్నింటినీ సీబీఆర్‌టీ పద్ధతిలో నిర్వహించాలని కమిషన్‌ యోచిస్తోంది. ఏఈఈ పోస్టులకు 81 వేల మంది, ఏఈ పోస్టులకు 74 వేల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ పోస్టుల్లో వివిధ కేటగిరీలు ఉన్నందున, ఆయా విభాగాల వారీగా సీబీఆర్‌టీ విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. తద్వారా పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో వేగం పెంచనుంది. గ్రూప్‌ సర్వీసుల ఉద్యోగాలకు సీబీఆర్‌టీ పద్ధతిలోనే విడతల వారీగా పరీక్షలు నిర్వహించి నార్మలైజేషన్‌ విధానంలో మార్కులను లెక్కించే విషయాన్ని పరిశీలిస్తోంది. ఈ అంశంపై అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

 

 

 

విషయాలపై సూచనలు..
టీఎస్‌పీఎస్సీలో సైబర్‌ సెక్యూరిటీ విధానాన్ని తీసుకొచ్చేందుకు కమిషన్‌ పరిశీలిస్తోంది. వారం రోజులుగా ఐఐటీ హైదరాబాద్‌, జేఎన్‌టీయూ, ఉస్మానియా వర్సిటీల ఐటీ విభాగాధిపతులు, సైబర్‌ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమైంది. సీబీఆర్‌టీ విధానంలో పరీక్షల నిర్వహణ, కాన్ఫిడెన్షియల్‌ వ్యవహారాలు, సైబర్‌ సెక్యూరిటీ, అలర్ట్‌ సిస్టమ్‌ తదితర అంశాలను పరిశీలించింది. చేయాల్సిన మార్పులు, భద్రత విషయాలపై సూచనలు తీసుకుంది.

 

 

 

TSPSC | మేలో పరీక్షలకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు.. వారం రోజుల్లో తేదీల వెల్లడి

 

TSPSC | కంప్యూటర్‌ హ్యాకింగ్‌, ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో రద్దయిన నాలుగు, వాయిదా వేసిన రెండు పరీక్షల తేదీలను వారం రోజుల్లో ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నది. మే నెలలోనే ఆ పరీక్ష లు నిర్వహించాలని యోచిస్తున్నది.

 

 

కంప్యూటర్‌ హ్యాకింగ్‌, ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో రద్దయిన నాలుగు, వాయిదా వేసిన రెండు పరీక్షల తేదీలను వారం రోజుల్లో ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నది. మే నెలలోనే ఆ పరీక్ష లు నిర్వహించాలని యోచిస్తున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. గురువారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో కమిషన్‌ భేటీ జరిగింది.

 

 

 

ఇప్పటికే జూన్‌ 11న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. మిగిలిన పరీక్షల తేదీల ప్రకటన, నిర్వహణ, సీబీటీ విధానం తదితర అంశాల గురించి చర్చించింది. సీబీటీ వి ధానంలో పరీక్ష నిర్వహించేందుకు ఏ ర్పాట్లు చేయాలని చైర్మన్‌ అధికారులకు సూచించగా, ఇప్పటికిప్పుడు అంటే సాధ్యం కాకపోవచ్చని, ఆగస్టు వరకు అయితే ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పినట్టు తెలిసింది.

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button