Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TSPSC GROUP 1 HALL TICKETS DOWNLOAD PROCESS

టీఎస్​పీఎస్సీ గ్రూప్​–1 హాల్​టికెట్లు

 

 

 

 

 

 

తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ అక్టోబర్​ 16న నిర్వహిస్తున్న గ్రూప్​–1 ప్రిలిమినరీ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. హాల్​ టికెట్లను ఎల్లుండి నుంచి (అక్టోబర్​ 9) నుంచి టీఎస్​పీఎస్​సీ అఫిషియల్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచనుంది. ఈ పరీక్ష ఏర్పాట్లపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

 

 

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం మొత్తం 1040 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ లో 503 ఖాళీల భర్తీకి టీఎస్​పీఎస్సీ గ్రూప్​ వన్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇందులో 121 ఎంపీడీఓ ఉద్యోగాలు, 91 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, 48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, 42 డిప్యూటీ కలెక్టర్, 41 మున్సిపల్ కమిషనర్ , 40 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి.

 

 

 

ఉమ్మడి రాష్ట్రంలో చివరి సారిగా 2011లో 312 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 11 ఏళ్ల తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా గ్రూప్-1 నోటిఫికేషన్​ విడుదలైంది. సుమారు 3.8 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్​కు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 756 మంది పోటీ పడుతున్నారు.

 

 

 

 

TSPSC GROUP 1 HALL TICKETS DOWNLOAD LINK

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button