Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TSPSC Group-1 Prelims-2022

గ్రూప్స్‌-1లో ప్రిలిమ్స్‌ స్కోరే ‘మెయిన్‌’.. ఇంత మందే మెయిన్స్‌కు అర్హ‌త‌

 

 

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వెలువడటంతో పోటీ పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

 

 

మొదటిసారి ప్రకటించిన నోటిఫికేషన్‌ ద్వారా అత్యధిక సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండటంతో అభ్యర్థుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మే 2వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై నెలాఖరు వరకు కొనసాగనుంది. వివిధ శాఖల్లో 503 గ్రూప్‌–1 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ తొలిసారిగా నిర్వహించే గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీపై అభ్యర్థుల్లోనూ ఆత్రుత, అయోమయం నెలకొంది.

 

 

 

ఈ విధానం సరికాదు.. కానీ
సుగమమవుతుందనే భావన అభ్యర్థుల్లో ఉంది. దీంతో చాలా మంది మెయిన్‌ పరీక్షలపై ఎక్కువ శ్రద్ధ పెడుతూ ప్రిలిమ్స్‌ వరకు సాధారణ స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఈ విధానం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. మెయిన్‌ పరీక్షల్లో అర్హత సాధించాలంటే ప్రిలిమ్స్‌ మార్కులే కీలకం కానున్నాయి. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులను ర్యాంకింగ్‌లోకి పరిగణించరని టీఎస్‌పీఎస్సీ చెబుతున్నప్పటికీ.. ఈ పరీక్షలో వచ్చే స్కోర్‌ ఆధారంగానే మెయిన్‌ పరీక్షలకు అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేసింది.

 

 

 

 

ఒక్కో పోస్టుకు..
గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష జూలై/ఆగస్టులో నిర్వహిం చనున్నట్లు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ప్రిలిమ్స్‌ను జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబి లిటీ(ఆబ్జెక్టివ్‌ టైప్‌) విభాగంలో 150 ప్రశ్నలతో నిర్వహిస్తారు. రెండున్నర గంటల పాటు సాగే ఈ పరీక్ష మొత్తం మార్కులు 150. ఇందులో ఎక్కువ మార్కులు స్కోర్‌ చేసిన వారిని నిర్దేశించిన కేటగిరీలు, రిజర్వేషన్ల వారీగా వడపోసి మెయిన్‌ పరీక్షలకు ఎంపిక చేస్తారు.ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 ఉద్యోగ ఖాళీలున్నాయి. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్‌ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ లెక్కన టాప్‌ 25,150 మంది అభ్యర్థులు మెయిన్‌ పరీక్షలకు అర్హత సాధిస్తారు. ఈ క్రమంలో ప్రిలిమ్స్‌ పరీక్షలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

 

 

 

 

 

శాఖల వారీగా గ్రూప్‌-1 పోస్టుల వివరాలు.. వ‌యోప‌రిమితి ఇలా .. : 

పోస్టుఖాళీలువయో పరిమితి
డిప్యూటీ కలెక్టర్‌4218–44
డీఎస్పీ9121–31
కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌4818–44
రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌421–31
జిల్లా పంచాయతీ అధికారి518–44
జిల్లా రిజి్రస్టార్‌518–44
డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌(మెన్‌)221–31
అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌818–44
అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌2621–31
మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌–2)4118–44
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సాంఘిక సంక్షేమం)318–44
డీబీసీడబ్ల్యూఓ (బీసీ సంక్షేమం)518–44
డీటీడబ్ల్యూఓ (గిరిజన సంక్షేమం)218–44
జిల్లా ఉపాధి కల్పనాధికారి218–44
పరిపాలనాధికారి(ఏఓ)(వైద్య, ఆరోగ్య శాఖ)2018–44
అసిస్టెంట్‌ ట్రెజరర్‌(ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌)3818–44
అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌(స్టేట్‌ ఆడిట్‌ సరీ్వస్‌)4018–44
ఎంపీడీఓ(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి)12118–44

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మొత్తం మార్కులు: 900

సబ్జెక్ట్‌సమయం (గంటలు)గరిష్ట మార్కులు 
ప్రిలిమినరీ టెస్ట్‌ (జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ)2 1/2150
రాత పరీక్ష (మెయిన్‌ ) (జనరల్‌ ఇంగ్లిష్‌)(అర్హత పరీక్ష)3150
మెయిన్‌ పేపర్‌–1 జనరల్‌ ఎస్సే

  1. సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు
  2. ఆర్థికాభివృద్ధి మరియు న్యాయపరమైన (జస్టిస్‌) సమస్యలు
  3. డైనమిక్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌
  4. భారతదేశ చారిత్రక మరియు సాంస్కతిక వారసత్వ సంపద
  5. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి
  6. విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి
3150
పేపర్‌–2 హిస్టరీకల్చర్‌ అండ్‌ జియోగ్రఫీ      

  1. భారతదేశ చరిత్ర మరియు సంస్కతి (1757–1947)
  2. తెలంగాణ చరిత్ర మరియు వారసత్వ సంపద
  3. జియోగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ
3150
పేపర్‌–3  ఇండియన్‌  సొసైటీ, కానిస్టిట్యూషన్‌  అండ్‌ గవర్నెన్స్‌  

  1. భారతీయ సమాజం, నిర్మాణం మరియు సామాజిక ఉద్యమం
  2. భారత రాజ్యాంగం
  3. పాలన
3150
పేపర్‌–4 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌  

  1. భారతీయ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
  2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
  3. అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు
3150
పేపర్‌–5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌     

  1. శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర, ప్రభావం
  2. మెడరన్‌  ట్రెండ్స్‌ ఇన్‌  అప్లికేషన్‌  ఆఫ్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ సైన్స్‌
  3. డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌  అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌
3150
పేపర్‌–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం 

  1. ది ఐడియా ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఆలోచన 1948–1970)
  2. మొబిలైజేషన్‌ ఫేజ్‌ (మద్దతు కూడగట్టే దశ 1971–1990)
  3. టువర్డ్స్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఏర్పాటు దిశగా 1991–2014)
3150.

 

 

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button