Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TSPSC Jobs rescheduled 2024!

ఉద్యోగాల భర్తీ రీషెడ్యూల్‌ 2024 !

 

వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలై పలు దశల్లో నిలిచిపోయిన నియామక ప్రక్రియను రీషెడ్యూల్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.

రూపకల్పన చేస్తున్న టీఎ్‌సపీఎస్సీ

వివరాలను వెల్లడించేందుకు కసరత్తు

చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

మరో ముగ్గురు సభ్యులు కూడా..

 

 

వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలై పలు దశల్లో నిలిచిపోయిన నియామక ప్రక్రియను రీషెడ్యూల్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. త్వరలోనే ఈ రీ-షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించాలని నిర్ణయించింది. టీఎ్‌సపీఎస్సీ నూతన చైర్మన్‌గా నియమితులైన మహేందర్‌రెడ్డి, సభ్యులు అనితా రాజేంద్ర, ఎన్‌.యాదయ్య, రజనీ కుమారి శుక్రవారం తమ బాధ్యతలను స్వీకరించారు.

 

 

 

అనంతరం ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనుసరించాల్సిన విధానంపై చర్చించినట్టు సమాచారం. నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే.. ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ఖరారు చేయాలని భావిస్తున్నారు. పలు పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశలో నిలిచిపోయిన విషయం తెలిసిందే.

 

 

కొన్ని పోస్టులకు సంబంధించిన పరీక్షలను పూర్తిచేయగా, మరికొన్ని పోస్టులకు సంబంధించి ఇంకా పరీక్షలను నిర్వహించలేదు. పరీక్షలను నిర్వహించిన పోస్టులు, ఇంకా పరీక్షలను నిర్వహించలేని పోస్టులను వేర్వేరు కేటగిరీలుగా భావించి, ఈ షెడ్యూల్‌ను రూపొందించాలని భావిస్తున్నారు. అంటే.. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకోసం జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి రీ-షెడ్యూల్‌ను జారీ చేయనున్నారు. ఒకవేళ ఆయా గ్రూపు పోస్టుల్లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని భావిస్తే.. అనుబంధ నోటిఫికేషన్లను కూడా జారీ చేయాల్సి ఉంటుంది.

 

 

దీనిపై ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం కమిషన్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుమారు 8,039 గ్రూపు-4 పోస్టుల భర్తీ కోసం కోసం బోర్డు ఇప్పటికే పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 7,62,872 మంది అభ్యర్థులు పరీక్షలను రాయగా.. తుది కీని కూడా విడుదల చేశారు. ఈ ఫలితాల వెల్లడిపై కూడా కమిషన్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 

 

 

Related Articles

Back to top button