Andhra PradeshNational & InternationalSocial

చిరుతపులి, హైనా, మొసలి బిగ్ ఫైట్.. ఇలాంటి వీడియో ఎప్పుడూ చూసి ఉండరు..!

Leopard, Hyena, Crocodile Big Fight.. You have never seen a video like this..!

 

 

అడవి ప్రాంతాలు అందమైన ప్రకృతి దృశ్యాలతో ఆకట్టుకుంటాయి. అయితే ఇక్కడ ఒళ్లు గగుర్పొడిచే హింసాత్మక దాడులు కూడా కనిపిస్తుంటాయి. వీటిని చూస్తే గుండె జల్లుమంటుంది. జంతువుల మధ్య జరిగే కొన్ని భీకర పోరాటాలు చూస్తుంటే చెమటలు పట్టేస్తాయి. తాజాగా అలాంటి ఒక యానిమల్స్ ఫైటింగ్‌ను చూసే ఛాన్స్ ఐటీ కన్సల్టెంట్ ట్రావిస్ కరీరాకు దక్కింది. ట్రావిస్ ఇటీవల దక్షిణాఫ్రికాలోని మార్లోత్ పార్క్‌కు వెళ్లాడు. ఆ పార్క్‌లో చిరుతపులి, హైనాలు, మొసళ్లు ఒక జింక మాంసం కోసం పోట్లాడుకున్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు.

 

వీటి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. జింక జాతికి చెందిన ఓ ఇంపాలా ఈ మూడు క్రూరమైన జంతువుల మధ్య బలయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొదటగా ట్రావిస్, అతడి స్నేహితులు పార్క్‌లో చిరుతపులిని చూశారు. సూర్యుడు అస్తమిస్తున్న అదే సమయంలో ఇంపాలాల గుంపు వద్దకు హైనాలు వెళ్లాయి. వాటిపై హైనాల గుంపు కచ్చితంగా దాడి చేస్తుందని భావించారు. ట్రావిస్ వీడియో రికార్డింగ్ మొదలుపెట్టాడు.

ఇంతలోనే ఒక చిరుతపులి ఎంట్రీ ఇచ్చి ఒక ఇంపాలాపై దాడి చేసింది. దాని మెడను నోటితో బలంగా పట్టుకుంది. అదే సమయంలో ఒక హైనా జోక్యం చేసుకుని ఎరను దొంగిలించింది. చిరుతపులి ధైర్యం కోల్పోకుండా ఇంపాలాను తిరిగి దక్కించుకునేందుకు పోరాడింది. అయితే అనుకోకుండా మరిన్ని హైనాలు పరుగులు తీస్తూ వచ్చాయి. ఇవి చాలదన్నట్టు రెండు మొసళ్లు కూడా జింక మాసం దక్కించుకోవడానికి ముందుకొచ్చాయి. ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది.

 

* భయంకరమైన అనుభూతి

“ఇంపాలా ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా, హైనా దాన్ని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. ఇంపాలా తీవ్రంగా తన్నుతున్నా, హైనా పట్టు వీడలేదు. అప్పుడు నా దృష్టి మరో వైపు మళ్లింది. ఎందుకంటే ఆ దిశగా రెండు భారీ మొసళ్లు సమీపంలోని నది నుంచి బయటకు వచ్చాయి. అవి పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. పెద్ద మొసలి, హైనా తీసుకెళ్తున్న ఇంపాలాపైకి దూసుకెళ్లింది. దాన్ని నోట్లో బంధించి చంపేసింది.” అని ఈ భయంకరమైన పోరాటాన్ని ట్రావిస్ వర్ణించారు.

 

ఇదే సమయంలో చిరుతపులి ఇంపాలాను తిరిగి పొందడానికి చాలా ప్రయత్నించింది, కానీ దాని ప్రయత్నం ఫలించలేదు. హైనాలు మొసళ్లతో ధైర్యంగా పోరాటం ప్రారంభించి, జింకను దొంగిలించాలని భావించాయి. కానీ వాటి కృషి ఫలించలేదు, మిగిలి ఉన్న మాంసపు ముద్దలు మాత్రమే లాక్కోగలిగాయి. మిగిలిన ఇంపాలా శరీరాన్ని మొసలి మింగేసింది.

 

వీడియో చూసిన వారు షాక్‌ను వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి, “ఇంపాలా పోరాటంలో భాగం కాదు, అది ఒక బహుమతి” అని ఒక యూజర్ అన్నాడు. మొసళ్ల రూపాన్ని గమనించిన ఒక వ్యక్తి, “ఆ మొసళ్లు చాలా పెద్దగా ఉన్నాయి” అని వ్యాఖ్యానించాడు. మరొక వ్యక్తి, “ఆఫ్రికా ఒక నిరంతర యుద్ధ భూమి” అని అక్కడి పరిస్థితిని సింపుల్‌గా చెప్పాడు. ఈ వీడియోను లేటెస్ట్ సైటింగ్స్ యూట్యూబ్ ఛానెల్‌ పోస్ట్ చేసింది. దీనికి ఇప్పటికే కోటి దాకా వ్యూస్ వచ్చాయి.

 

SEE THIS VIDEO

 

 

Related Articles

Back to top button