Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

PM Kisan Alert to farmers…two installments into their account

రైతులకు అలర్ట్... వారి అకౌంట్‌లోకి రెండు ఇన్‌స్టాల్‌మెంట్స్

టీవల కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి (PM Kisan Scheme) చెందిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను రిలీజ్ చేసింది. న్యూ ఢిల్లీలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పీఎం కిసాన్ నిధుల్ని జమ చేశారు. 8 కోట్లకు పైగా రైతుల అకౌంట్లలో రూ.16,000 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 24 లోగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల రైతులకు ఆలస్యంగా డబ్బులు జమ కావొచ్చు.

పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా రైతుల అకౌంట్లలో నాలుగు నెలలకు ఓసారి రూ.2,000 చొప్పున జమ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు విడతల్లో ఏడాదికి రూ.6,000 జమ అవుతాయి. ఈసారి కొందరు రైతుల అకౌంట్లలో రూ.4,000 జమ కానున్నాయి. ఈ విషయంపై గతంలోనే స్పష్టత ఇచ్చింది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ. కేంద్ర ప్రభుత్వం మే చివరి వారంలో పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ చేసింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతుల అకౌంట్లలో రూ.2,000 జమ కాలేదు.

పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ పొందని రైతుల్ని గుర్తించి వారి అకౌంట్లలో 11వ ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించిన రూ.2,000, 12వ ఇన్‌స్టాల్‌మెంట్ రూ.2,000 కలిపి మొత్తం రూ.4,000 జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మేలో విడుదల చేసిన వాయిదా, తాజాగా విడుదల చేసిన వాయిదా కలిపి రూ.4,000 వారి అకౌంట్లలో జమ కానున్నాయి. అయితే మేలో డబ్బులు రాని రైతులకు మాత్రమే రూ.4,000 జమ అవుతాయి. మేలో 11వ ఇన్‌స్టాల్‌మెంట్ పొందినవారికి ఇప్పుడు 12వ ఇన్‌స్టాల్‌మెంట్ రూ.2,000 మాత్రమే జమ అవుతాయి.

 

ఇక ఈసారి ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బుల్ని జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ డబ్బుల్ని పొందడానికి ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఇకేవైసీ పూర్తి చేయని రైతులకు 12వ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చే అవకాశం లేదు. మరి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇలా చెక్ చేయండి.

Step 1- రైతులు ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- Farmers Corner సెక్షన్‌లో Beneficiary Status ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

లేదా నేరుగా https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx లింక్ ఓపెన్ చేయొచ్చు.

Step 3- ఆ తర్వాత ఆధార్ నెంబర్ , పీఎం కిసాన్ అకౌంట్ నెంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయాలి.

Step 4- వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.

Step 5- వివరాలన్నీ సరిగ్గా చెక్ చేయాలి.

Step 6- ఒకవేళ మీ అకౌంట్‌లో డబ్బులు జమ అయినట్టు కనిపించకపోతే కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button